
సాధారణంగా ‘హోమ్ బేనర్’ అంటేనే ఏదో స్పెషల్ కిక్ ఉంటుంది ఎవరికైనా. కానీ ఈ కిక్‌ను ప్రస్తుతం శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ వద్దనుకుంటున్నారు. తండ్రి బోనీ కపూర్ ఆఫర్ చేసిన సినిమాలో నటించడానికి ‘నో’ చెప్పారు. కూతురు కాదన్నందుకు బోనీ కపూర్ సంబరపడిపోతున్నారు. అదేంటీ అనుకుంటున్నారా? సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి కుమార్తె ఎదిగిందని ఆనందపడుతున్నారాయన. పైగా తండ్రికే డేట్స్ ఇవ్వలేనంత బిజీ అయినందుకు ఆయన డబుల్ హ్యాపీ. ‘‘మా ఫ్యామిలీతో కరణ్ జోహార్ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రస్తుతం జాన్వీకి మంచి గైడ్‌లా ఉన్నారు కరణ్. జాన్వీని కూతురిలా భావిస్తారాయన. నా ప్రమేయం లేకుండానే జాన్వీ నిర్ణయాలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
నా పెద్ద కూతురితో నేను తీయబోయే సినిమా తీసే టైమ్ వీలైనంత తొందరగా రావాలని కోరుకుంటున్నాను’’ అని బోనీ కపూర్ పేర్కొ న్నారు . అందడీ సంగతి.. జాన్వీ కపూర్ దగ్గర డాడీ సినిమాకు డేట్స్ లేవన్నమాట. ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం ‘తక్త్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరణ్ జోçహార్ రూపొందిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఇది. అనిల్ కపూర్, రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్, భూమి పడ్నేకర్ ముఖ్య పాత్రలు చేయనున్నారు. ఈ సినిమా 2020 లో రిలీజ్ కానుంది. ఇది కాకుండా వేరే ఓ ప్రముఖ బేనర్లో సినిమా చేయడానికి జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అందుకే తండ్రి సినిమాకి డేట్స్ ఇవ్వ లేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment