
తమిళ నటుడు అజిత్ బైక్, కార్ రేసింగ్స్ పట్ల భలే ఇంట్రెస్ట్‌గా ఉంటారు. కొన్నిసార్లు ఆయన రేసింగ్ పోటీలో పాల్గొన్నారు కూడా. ఈ రేసింగ్ మజాను ఆయన వెండితెరపైకి తేచ్చే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. తన తర్వాతి సినిమాలోఅజిత్ కార్ రేసర్‌గా కనిపించబోతున్నారని టాక్. ఈ సినిమాకు బోనీకపూర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తారట. ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టులో ప్రారంభించాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఫారిన్ లొకేషన్స్‌లో మేజర్ షూటింగ్‌ను ప్లాన్ చేశారు.
సౌతాఫ్రికా, మిడిల్ ఈస్ట్, బుడాపెస్ట్ లొకేషన్స్‌ను ఫైనలైజ్ చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్. ఈ సినిమాను తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారని కోలీవుడ్ టాక్. ఒకవేళ ఇదే నిజమైతే.. దాదాపు 18ఏళ్ల తర్వాత ఓ హిందీ సినిమాలో నటిస్తున్నారు అజిత్. 2001లో షారుక్‌ఖాన్ నటించిన ‘అశోక’ సినిమాలో అజిత్ ఓ చితన్న పాత్ర చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు రేస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. హెచ్. వినోద్ దర్శకత్వంలో బోనీకపూర్ నిర్మాణంలో అజిత్ నటించిన ‘నెర్కొండ పరవై’ చిత్రం ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment