మా నాన్న తగ్గారోచ్‌ | Janhvi Kapoor's father Boney Kapoor loses some kilos | Sakshi
Sakshi News home page

మా నాన్న తగ్గారోచ్‌

Published Sun, Jun 2 2019 5:50 AM | Last Updated on Sun, Jun 2 2019 5:50 AM

Janhvi Kapoor's father Boney Kapoor loses some kilos - Sakshi

బోనీ కపూర్‌, జాన్వీ కపూర్‌

కథానాయికలు ఫిట్‌నెస్‌కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శరీరాన్ని చక్కగా ఉంచుకోవడానికి జిమ్‌లలో చెమటోడుస్తుంటారు. కఠినమైన వర్కవుట్స్‌ చేస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు కూడా. ఇక యువతారల్లో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ విషయానికి వస్తే.. ఫిట్‌నెస్‌కి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఫిట్‌నెస్‌ విషయంలో ఎప్పుడూ తన ఫొటోలు షేర్‌ చేసే జాన్వీ తాజాగా తన తండ్రి ఫొటో షేర్‌ చేసి, చాలామందిని ఆశ్చర్యపరిచారు. ‘‘మా డాడీ (బోనీ కపూర్‌) 12 కిలోల బరువు తగ్గారు. ఆరోగ్యకరమైన జీవనం గడిపేందుకు ఆయన అన్ని కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా, ట్రిమ్‌గా తయారయ్యి నాకు స్ఫూర్తిగా నిలిచారు.

నాన్నను చూసి చాలా గర్వపడుతున్నా’’ అంటూ తండ్రి ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు జాన్వీ కపూర్‌. గతంలో కంటే ఆ ఫొటోలో చాలా స్లిమ్‌గా కనిపిస్తున్నారు బోనీకపూర్‌. గత ఏడాది ఫిబ్రవరిలో శ్రీదేవి చనిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నాన్నతో మరింత ఎక్కువగా క్లోజ్‌గా ఉంటున్నారు జాన్వీ. బహుశా బోనీ తగ్గాలనుకోవడానికి కూతురు కూడా ఓ కారణం అయ్యుంటుందేమో. జాన్వీ నటించిన తొలి చిత్రం ‘ధడక్‌’ గత ఏడాది విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆమె శరణ్‌ శర్మ దర్శకత్వంలో పైలట్‌ గున్‌జాన్‌ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘కార్గిల్‌ గర్ల్‌ ఇన్‌ లక్నో’, కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘తక్త్‌’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement