
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ఇటీవల నటన వైపు దృష్టి మళ్లించారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఏకె వర్సెస్ ఏకె' చిత్రంలో అతిథి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించమని బోనీ కపూర్‌కి ఆఫర్లు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం పలు బహుళ భాషలు నిర్మించే పనిలో బిజీగా ఉండటంతో వాటిని సున్నితంగా తిరస్కరించారు.
అయితే తాజాగా ఆయన లవ్ రంజన్ దర్శకత్వంలో నటించేందుకు పంచ జెండా ఊపేశాడు. ఈ చిత్రంలో స్టార్ హీరో రణబీర్ కపూర్ తండ్రి పాత్రలో నటించనున్నారు. త్వరలోనే ఆయన ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నారు. కాగా, బోనీ కపూర్ ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వీటితో పాటు.. బధాయి హూ రిమేఖ, తమిళంలో వాలిమై చిత్రాలను నిర్మిస్తున్నారు.
Bollywood Star Producer #BoneyKapoor To Act In Luv Ranjan’s Next With #RanbirKapoor
— BARaju (@baraju_SuperHit) January 10, 2021
Boney Kapoor will play the role of father to young star hero Ranbir Kapoor in the movie. Boney Kapoor will join the shoot of the film soon. @BoneyKapoor pic.twitter.com/pdhZIc39mA
Comments
Please login to add a commentAdd a comment