బోనీకపూర, దిల్ రాజు
ఇక పవన్ కల్యాణ్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేశారా? అని చాలామంది అనుకుంటున్న తరుణంలో ఓ వార్త తెరమీదకు వచ్చింది. హిందీ హిట్ చిత్రం ‘పింక్’ తెలుగు రీమేక్‌లో ఆయన నటించబోతున్నారన్నది ఆ వార్త సారాంశం. గత ఏడాది ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ మరో సినిమాలో నటించని సంగతి తెలిసిందే. ఇక హిందీ ‘పింక్’ని తమిళంలో అజిత్‌తో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేసిన బోనీకపూరే తెలుగు రీమేక్‌ను నిర్మించబోతున్నారు.
‘దిల్’ రాజు మరో నిర్మాత. ‘ఓ.. మై ఫ్రెండ్, ఎమ్‌సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)’ చిత్రాల ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకుడు. హిందీ హిట్ ‘బదాయి హో’ తెలుగు రీమేక్ నిర్మాణానికి తొలిసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న బోనీ కపూర్, ‘దిల్’ రాజు తాజాగా ‘పింక్’ తెలుగు రీమేక్‌ను కూడా నిర్మించబోతుండటం విశేషం. ‘బదాయిహో’ తెలుగు రీమేక్‌లో ఎవరు నటించబోతున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరి.. ‘పింక్’లో పవన్ నటిస్తారా? లేదా?
Comments
Please login to add a commentAdd a comment