Boney Kapoor Revealed His Love Story with Sridevi - Sakshi
Sakshi News home page

Boney Kapoor: మా లవ్‌స్టోరీ అలా మొదలైంది.. మొదటి భార్యకు కూడా చెప్పా..

Published Fri, Feb 24 2023 5:32 PM | Last Updated on Fri, Feb 24 2023 6:24 PM

Boney Kapoor Revealed His Love Story with Sridevi - Sakshi

భారతీయ సినీపరిశ్రమను ఏలిన అతి కొద్దిమంది హీరోయిన్లలో శ్రీదేవి ఒకరు. తన అందాన్ని, నటనాప్రతిభను చూసి ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు సైతం విస్తుపోయేవారు. శ్రీదేవి అందం, అభినయం చూసి బోనీ కపూర్‌ కూడా మంత్రముగ్ధుడయ్యాడు. అందుకే ఆమె వెంటపడ్డాడు. అప్పటికే ఆమెకు నటుడు మిథున్‌ చక్రవర్తితో పెళ్లైందంటూ వార్తలు వచ్చాయి. అయినా అవేమీ పట్టించుకోలేదు. తనతో జీవితం కొనసాగించాలని కలలు కన్నాడు. చివరకు ఆ కల నిజం చేసుకున్నాడు. కానీ కలకాలం తనతో కలిసి ఉండాలనుకున్న కోరిక మాత్రం తీరలేదు. 2018 ఫిబ్రవరి 24న బోనీ కపూర్‌ను ఒంటరి చేస్తూ శ్రీదేవి మృత్యు ఒడిలోకి చేరుకుంది.

ఈరోజు శ్రీదేవి వర్ధంతి కావడంతో బోనీ కపూర్‌ సోషల్‌ మీడియా వేదికగా తన ప్రేమ ప్రయాణాన్ని షేర్‌ చేసుకున్నాడు. 'శ్రీదేవిని ఓ తమిళ సినిమాలో చూడగానే తనతో వెంటనే ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నా. సోల్వా సావన్‌లో శ్రీదేవి గ్లామర్‌ రోల్‌ చేయనప్పటికీ తన పాత్ర నన్ను ఇంప్రెస్‌ చేసింది. తర్వాత తనను ఎలాగోలా కలిశాను. ఆమెతో మాట్లాడాక నాకు తెగ నచ్చేసింది.

ఒక ఈవెంట్‌లో శ్రీదేవి తల్లిని కలిశా. అప్పుడు శ్రీదేవి రెమ్యునరేషన్‌ దాదాపు రూ.8 లక్షలు ఉండి ఉంటుంది. ఆమెతో సినిమా చేయాలని చెప్తే శ్రీదేవి తల్లి మాత్రం రూ.10 లక్షలు డిమాండ్‌ చేసింది. నేను వెంటనే కుదరదని షాకిచ్చి ఆ వెంటనే రూ.11 లక్షలిచ్చి సర్‌ప్రైజ్‌ చేశాను. షూటింగ్స్‌కు తన వెంట వెళ్లేవాడిని. అలా తనకు మరింత దగ్గరయ్యాను. అప్పటికే నాకు ఓసారి పెళ్లైంది. భార్య మోనా శౌరీకి తనతో ప్రేమలో పడ్డానని, నా ఫీలింగ్స్‌ చెప్పాను. తనను వదులుకోలేనన్నాను. ఇకపోతే శ్రీదేవిపై ఎంతో కేర్‌ తీసుకునేవాడిని. అదే ఆమెను తిరిగి ప్రేమించేలా చేసింది' అని చెప్పుకొచ్చాడు బోనీ కపూర్‌. కాగా బోనీ కపూర్‌.. నిర్మాత మోనా శౌరీని మొదటగా వివాహం చేసుకున్నాడు. 1996లో ఆమెకు విడాకులిచ్చి శ్రీదేవిని పెళ్లాడాడు. వీరికి జాన్వీ, ఖుషీ కపూర్‌ జన్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement