‘ఐఫా’ వేదిక మీద అందాల నటి శ్రీదేవికి ఘన నివాళి అర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీదేవి ఫోటోలు, పాటలు కలిపి రూపొందించిన అద్భుతమైన వీడియోను ప్రదర్శించారు. ఆ వీడియో చూసిన వారికి ఒక్క క్షణం అలనాటి జ్ఞాపకాలన్ని కళ్ల ముందు మెదిలాయి. శ్రీదేవి అభిమానులనే కాకా సిని ప్రియులందరి హృదాయలను దోచుకున్న ఈ వీడియో ఇప్పుడు వివాదస్పదంగా మారింది. ‘ఐఫా’ వేడుకల అనంతరం ఢిల్లీకి చెందిన సబా అరీఫ్ అనే శ్రీదేవి అభిమాని తాను కష్టపడి రూపొందించిన వీడియోను తన అనుమతి లేకుండా ‘ఐఫా’ వాడుకుందని ఆరోపించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ వివాదంపై బోనీ కపూర్ స్పందిస్తూ ‘శ్రీదేవికి సంబంధించిన ఫోటోలపై హక్కులన్ని నావే. వాటిని వాడుకునే అధికారం నాకు ఉంది. ఈ వీడియో నాకు ఎంతో నచ్చింది. ఐఫాలో శ్రీదేవికి నివాళులు సమర్పించే సమయంలో ఈ వీడియోను వాడితే బాగుంటుందని అనిపించింది. అందుకే యశ్‌రాజ్ ఫిలిమ్స్‌తో కలిసి ఈ వీడియోను నేనే ఓకే చేశాను. ఇంకా చెప్పాలంటే నాకు సంబంధించిన ఫోటోలను ఆమె వాడుకుంది. అంతే కాక ఈ వీడియో తనదని చెప్పుకుంటుంది. ఇది కరెక్ట్ కాదు. అయినా ఆమెకు ఏదైనా సమస్య ఉంటే నన్ను కలవాల్సింది. అంతే తప్ప ఇలా ఆరోపణలు చేయడం సరికాద’న్నారు.
ఫోటోలు వారివి, కష్టం నాది
Published Sat, Aug 4 2018 11:23 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement