తనే ఆదర్శం.. 14 కిలోలు తగ్గా.. ఇంకా..: బోనీ కపూర్‌ | Boney Kapoor Loses 14 kg, 8 More To Go, Latest Look Photo Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Boney Kapoor New Look: నా జాన్‌ను ఆదర్శంగా తీసుకున్నా

Published Mon, Aug 19 2024 2:24 PM | Last Updated on Mon, Aug 19 2024 3:40 PM

Boney Kapoor Loses 14 kg, 8 More To Go

దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌ తన శరీరంపై దృష్టి పెట్టాడు. బరువు తగ్గే పనిలో ఉన్నాడు. ఈపాటికే 14 కిలోల దాకా బరువు తగ్గాడు. తాజాగా తన ట్రాన్స్‌ఫర్మేషన్‌ను తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో ఓ ఫోటో కూడా షేర్‌ చేశాడు. సోమవారం (ఆగస్టు 19న) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫోటోలో బోనీ బక్కచిక్కి కనిపించాడు.

నా జుట్టు ఒత్తుగా కనిపిస్తోంది. ఇప్పుడు మరింత బెటర్‌గా కనిపిస్తున్నాను. ఇప్పటివరకు 14 కిలోలు తగ్గాను.. ఇంకా 8 కిలోల దాకా తగ్గాల్సి ఉంది. నా జాన్‌ (శ్రీదేవి)ను ఆదర్శంగా తీసుకుని బరువు తగ్గే పని మొదలుపెట్టాను. ఆమె ఆలోచనలు ఎప్పుడూ నా వెంటే ఉంటాయి. తను నిత్యం నాతోనే ఉంటుంది అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. బోనీని ఇలా సన్నగా చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు అతడిని పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు.

ఎప్పుడూ బట్టతలతో కనిపించే బోనీ కపూర్‌ ఇప్పుడు ఒత్తైన జుట్టుతో కనిపించడంతో పలువురూ షాక్‌కు గురవుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకున్నాడు. అందుకే బోనీకి బట్టతల కనిపించకుండా పోయింది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement