
సాక్షి, చెన్నై: అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్న లెజండరీ నటి శ్రీదేవి సంస్మరణ సభను కోలీవుడ్ ఇండస్ట్రీ నిర్వహించనుంది. ఆదివారం చెన్నైలోని క్రౌన్ ప్లాజాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి బోనీకపూర్ తన ఇద్దరి కుమార్తెలతో కలిసి హాజరవనున్నారు. చెన్నై సినీ ప్రముఖులు హజరై.. శ్రీదేవితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకోనున్నారు.
ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరు కాలేకపోతున్నారు. ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం హిమాలయాలకు వెళ్లనుండటంతో ఈ సభకి రావటంలేదు. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్, అజిత్,భారతీరాజా ఇతర ప్రముఖులు హాజరవనున్నారు. చివరి వారం శ్రీదేవి సంస్మరణ సభ టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్వహించిన సంగతి తెలిసిందే.