
జాన్వీకపూర్, బోనీకపూర్, శ్రీదేవి
ఈ జూన్ 2న బోనీ కపూర్, శ్రీదేవి తమ 22వ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకోవాల్సింది. కానీ శ్రీదేవి దురదృష్టవశాత్తు బాత్ టబ్‌లో పడి చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె చనిపోయిన తర్వాత ఆమె ట్వీటర్ అకౌంట్‌ను ఆమె భర్త బోనీ కపూర్ మొయింటేన్ చేస్తున్నారు. పెళ్లి రోజు సందర్భంగా శ్రీదేవి చివరిసారిగా దుబాయ్‌లో అటెండ్ అయిన వెడ్డింగ్ ఈవెంట్ వీడియోను పోస్ట్ చేసి– ‘‘ఈ రోజు మన 22వ వెడ్డింగ్ యానివర్శరీ అయ్యుండేది.
జాన్.. నా సోల్‌మేట్, నువ్వు ప్రేమానురాగాలకు నిర్వచనం. నీ ప్రేమను, అనుభూతులను, జ్ఞాపకాలను ఎప్పటికీ నాలోనే దాచుకుంటాను. లెజెండ్ అన్న దాని కంటే కూడా నువ్వు ఎక్కువ. నువ్వు లేని లోటు కచ్చితంగా తీరనిది’’ అని పేర్కొన్నారు బోనీ. తల్లిదండ్రుల వెడ్డింగ్ యానివర్శరీ సందర్భంగా ‘బోనీ శ్రీదేవిని ముద్దాడుతున్న’ ఫొటోను షేర్ చేశారు కుమార్తె జాన్వీ. బీటౌన్‌లో జాన్వీ నటించిన తొలి చిత్రం ‘ధడక్’ వచ్చే నెల 20న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment