– రామ్‌చరణ్
‘‘డైరెక్టర్ సుకుమార్‌గారి టీమ్‌లో బుచ్చిబాబు బెస్ట్. తనకు సినిమా అంటే పిచ్చి. ‘రంగస్థలం’ కథని సుకుమార్‌గారు నాకు నలభై నిమిషాలు చె΄్పారు. ఆ తర్వాత ప్రతి రోజూ నాకు రెండేసి గంటలు నెరేష¯Œ ఇచ్చింది మాత్రం బుచ్చిబాబునే. తనకు సినిమా అంటే అంత పిచ్చి ఉంటుందనుకోలేదు’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్‌సీ 16’ (వర్కింగ్ టైటిల్).
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా బుధవారం ్రపారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బోనీ కపూర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో చిరంజీవి క్లాప్ కొట్టారు. డైరెక్టర్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ ‘‘నేను, జాన్వీ కలిసి ‘జగదేకవీరుడు–అతిలోక సుందరి’ లాంటి మూవీ చేయాలని చాలామంది అనుకున్నారు.
మా కాంబినేషన్ ‘ఆర్‌సీ 16’తో నిజం కావడం హ్యాపీ’’ అన్నారు. ‘‘నాపై నమ్మకంతో రామ్‌చరణ్‌గారు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటాను’’ అన్నారు బుచ్చిబాబు సానా. ‘‘బుచ్చిబాబు ఏదైనా పెద్దగా ఆలోచిస్తాడు. తన కథపై తనకు ఉన్న నమ్మకం అలా ఉంటుంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్.
‘‘ఈ సినిమాకి ఇప్పటికే మూడు ట్యూ¯Œ ్స పూర్తి చేశాం’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ‘‘నేను ఎంతగానో అభిమానించే ప్రముఖులందరితో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం నా అదృష్టం’’ అన్నారు జాన్వీ కపూర్. ‘‘బుచ్చిబాబు ఈ సినిమాతో తప్పకుండా మరో హిట్ కొడతాడు’’ అన్నారు నిర్మాత నవీన్ ఎర్నేని. ఈ ్రపారంభోత్సవంలో నిర్మాతలు వై. రవిశంకర్, ‘దిల్’ రాజు, శిరీష్, సాహూ గారపాటి, రామ్
ఆచంట, నాగవంశీ, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పకుడు: సుకుమార్, కెమెరా: రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: వి.వై. ప్రవీణ్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment