working title
-
జర్నీ టు అయోధ్య
శ్రీరామ నవమిని పురస్కరించుకుని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ అధినేత వేణు దోనేపూడి ‘జర్నీ టు అయోధ్య’ (వర్కింగ్ టైటిల్) పేరుతో సినిమా ప్రకటించారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ‘విశ్వం’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ బేనర్లో ‘జర్నీ టు అయోధ్య’ రెండో సినిమా. దర్శకుడు వీఎన్ ఆదిత్య ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ‘‘అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ్ర΄÷డక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే వీఎన్ ఆదిత్య నేతృత్వంలో అయోధ్య సహా పలు చోట్ల లొకేషన్స్ పరిశీలిస్తున్నారు. ఒక యంగ్ డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి దర్శక– నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు. -
తాతా... మనవడు?
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తెలుగు సినిమాలకు వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ తాజాగా మరో తెలుగు మూవీలో నటించేందుకు సుముఖత వ్యక్తం చేశారని ఫిల్మ్‌నగర్ టాక్. అది కూడా హీరో రామ్‌చరణ్‌కి తాతయ్య పాత్ర అని భోగట్టా. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. తాత–మనవడు కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ తాత పాత్ర కోసం అమితాబ్ బచ్చన్‌ని సంప్రదించారట మేకర్స్. ‘ఆర్సీ 16’ కథ, తన పాత్ర నచ్చడంతో ఈ క్యారెక్టర్ చేసేందుకు అమితాబ్ అంగీకరించారని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
తనకు అంత పిచ్చి ఉంటుందనుకోలేదు
‘‘డైరెక్టర్ సుకుమార్‌గారి టీమ్‌లో బుచ్చిబాబు బెస్ట్. తనకు సినిమా అంటే పిచ్చి. ‘రంగస్థలం’ కథని సుకుమార్‌గారు నాకు నలభై నిమిషాలు చె΄్పారు. ఆ తర్వాత ప్రతి రోజూ నాకు రెండేసి గంటలు నెరేష¯Œ ఇచ్చింది మాత్రం బుచ్చిబాబునే. తనకు సినిమా అంటే అంత పిచ్చి ఉంటుందనుకోలేదు’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా బుధవారం ్రపారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బోనీ కపూర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో చిరంజీవి క్లాప్ కొట్టారు. డైరెక్టర్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ ‘‘నేను, జాన్వీ కలిసి ‘జగదేకవీరుడు–అతిలోక సుందరి’ లాంటి మూవీ చేయాలని చాలామంది అనుకున్నారు. మా కాంబినేషన్ ‘ఆర్సీ 16’తో నిజం కావడం హ్యాపీ’’ అన్నారు. ‘‘నాపై నమ్మకంతో రామ్‌చరణ్‌గారు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటాను’’ అన్నారు బుచ్చిబాబు సానా. ‘‘బుచ్చిబాబు ఏదైనా పెద్దగా ఆలోచిస్తాడు. తన కథపై తనకు ఉన్న నమ్మకం అలా ఉంటుంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. ‘‘ఈ సినిమాకి ఇప్పటికే మూడు ట్యూ¯Œ ్స పూర్తి చేశాం’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ‘‘నేను ఎంతగానో అభిమానించే ప్రముఖులందరితో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం నా అదృష్టం’’ అన్నారు జాన్వీ కపూర్. ‘‘బుచ్చిబాబు ఈ సినిమాతో తప్పకుండా మరో హిట్ కొడతాడు’’ అన్నారు నిర్మాత నవీన్ ఎర్నేని. ఈ ్రపారంభోత్సవంలో నిర్మాతలు వై. రవిశంకర్, ‘దిల్’ రాజు, శిరీష్, సాహూ గారపాటి, రామ్ ఆచంట, నాగవంశీ, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పకుడు: సుకుమార్, కెమెరా: రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: వి.వై. ప్రవీణ్ కుమార్. -
సుడిగాలి సుధీర్ నాలుగో సినిమా షురూ
సుడిగాలి సుధీర్ హీరోగా నాలుగో సినిమా ‘ఎస్ఎస్4’ (వర్కింగ్ టైటిల్) షురూ అయింది. ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్య భారతి హీరోయిన్. లక్కీ మీడియా–మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్‌పై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి నిర్మాతలు డి. సురేశ్ బాబు, కేఎస్ రామారావు, సూర్యదేవర రాధాకృష్ణ, కేఎల్ దామోదర ప్రసాద్ అతిథులుగా హాజరయ్యారు. తొలి సీన్‌కి నిర్మాత పి. కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్ కొట్టారు. ‘‘మంచి కథాంశంతో రూపొందుతున్న చిత్రం ఇది’’ అన్నారు చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్. ‘‘ఒక గంట కథ వినగానే ఒప్పుకున్న సుధీర్‌కి థ్యాంక్స్’’ అన్నారు నరేష్ కుప్పిలి. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, కెమెరా: బాలాజీ సుబ్రహ్మణ్యం. -
Taraka Ratna death: ఎన్టీఆర్ 30 వాయిదా
‘జనతా గ్యారేజ్’(2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్– డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్ 30’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాకి ఈ నెల 24న కొబ్బరికాయ కొట్టాల్సింది. అయితే హీరో తారకరత్న మృతితో నందమూరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ కారణంగా ఎన్టీఆర్– కొరటాల శివ తాజా చిత్రం ప్రారంభోత్సవం వాయిదా పడింది. నందమూరి కల్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్న ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో 30వ మూవీ. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి, మార్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, 2024 ఏప్రిల్ 5న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు. కాగా తాజాగా తారకరత్న మృతితో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తునట్లు చిత్రబృందం ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. ఇక ‘ఎన్టీఆర్ 30’తో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్. -
కంచె వేస్తున్నారు!
‘వీడు ఆరడుగుల బుల్లెట్టు...’ అని ‘అత్తారింటికి దారేది’లో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఓ పాట ఉంటుంది. బాబాయే కాదు.. అబ్బాయి కూడా ఆరడుగుల బుల్లెట్టే అని ‘ముకుంద'లో వరుణ్ తేజ్‌ను చూసినవాళ్లు అన్నారు. మంచి ఎత్తు, ఎత్తుకి తగ్గ బరువుతో.. ఒక మంచి మాస్ హీరో ఎలా ఉండాలో వరుణ్ అచ్చంగా అలా ఉంటాడు. లుక్పరంగా మార్కులు కొట్టేసిన వరుణ్ నటనపరంగా కూడా భేష్ అనిపించుకున్నాడు. తొలి చిత్రంతో పాస్ అయిన ఉత్సాహంతో ఈ యువ హీరో కొన్ని రోజులుగా మలి చిత్రానికి సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ చిత్రం శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. క్రిష్ దర్శకత్వంలో రాజీవ్‌రెడ్డి ఈ చిత్రం నిర్మిస్తున్నారనీ, ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఉద్వేగంగా ఉందనీ వరుణ్ తేజ్ ట్విట్టర్లో పేర్కొనడంతో పాటు, క్లాప్ బోర్డ్ ఫొటోను కూడా పొందుపరిచారు. ఆ క్లాప్ బోర్డ్‌పై ‘కంచె' అని రాసి ఉంది. మరి.. ఇది వర్కింగ్ టైటిలా? లేక దీన్నే ఖరారు చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.