
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తెలుగు సినిమాలకు వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ తాజాగా మరో తెలుగు మూవీలో నటించేందుకు సుముఖత వ్యక్తం చేశారని ఫిల్మ్‌నగర్ టాక్. అది కూడా హీరో రామ్‌చరణ్‌కి తాతయ్య పాత్ర అని భోగట్టా. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఆర్‌సీ 16’ (వర్కింగ్ టైటిల్) చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. తాత–మనవడు కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ తాత పాత్ర కోసం అమితాబ్ బచ్చన్‌ని సంప్రదించారట మేకర్స్. ‘ఆర్‌సీ 16’ కథ, తన పాత్ర నచ్చడంతో ఈ క్యారెక్టర్ చేసేందుకు అమితాబ్ అంగీకరించారని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment