
సినిమా వాళ్లతో క్రికెటర్లకి మంచి స్నేహబంధం ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ తారలతో క్రికెటర్లంతా టచ్‌లో ఉంటారు. యాడ్స్‌లో కలిసి నటిస్తుంటారు. ఈ మధ్యకాలంలో వెండితెరపై కూడా కనిపిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్ ప్లే చేస్తూ అలరిస్తున్నారు.
అయితే మొన్నటి వరకు బాలీవుడ్ సినిమాల్లోనే కనిపించిన క్రికెటర్లు..ఇప్పుడు తెలుగు తెరపై కూడా సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే డేవిడ్ వార్నర్ ‘రాబిన్ హుడ్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో వార్నర్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ నెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు రానుంది. ఇక తాజాగా మరో స్టార్ క్రికెటర్ కూడా తెలుగు తెరపై సందడి చేసేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతంది. ఆయన ఎవరో కాదు..తనదైన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni).
నిజమెంత?
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 16 (RC 16) అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్‌కు ట్రైనర్‌గా ధోని కనిపించబోతున్నాడనే గాసిప్ బయటకు వచ్చింది. అసలు విషయం ఏంటంటే.. ధోని ఈ చిత్రంలో నటించడం లేదు. ఇదంతా ఒట్టి పుకారు మాత్రమేనని రామ్ చరణ్ పీఆర్ టీమ్ పేర్కొంది.
ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment