
తమిళసినిమా: హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం వలిమై. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుది ఘట్టానికి చేరుకుంది. దీంతో అజిత్ నటించనున్న నెక్ట్స్ చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. కాగా బోనీ కపూర్‌కి మరో అవకాశం ఇస్తున్నట్లు తాజా సమాచారం. ఇక గతంలో నేర్కొండ పార్వై, వలిమై చిత్రాలలో అజిత్ నటించారు. ఈ రెండింటికీ హెచ్.వినోద్‌నే దర్శకుడిగా ఎంచుకున్నారు. తదుపరి చిత్రా నికి కూడా ఈయనే దర్శక త్వం వహించనున్నారు. నేర్కొండ పార్వై, వలిమై చిత్రాలకు యువన్ శంకర్‌రాజా సంగీతం అందించారు. కాగా అజిత్ తాజా చిత్రానికి జిబ్రాన్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నట్లు తెలిసింది.