శ్రీదేవి (ఫైల్ ఫోటో)
‘ఐఫా’ వేదిక మీద అందాల నటి శ్రీదేవికి ఘన నివాళి అర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీదేవి ఫోటోలు, పాటలు కలిపి రూపొందించిన అద్భుతమైన వీడియోను ప్రదర్శించారు. ఆ వీడియో చూసిన వారికి ఒక్క క్షణం అలనాటి జ్ఞాపకాలన్ని కళ్ల ముందు మెదిలాయి. శ్రీదేవి అభిమానులనే కాకా సిని ప్రియులందరి హృదయాలను దోచుకున్న ఈ వీడియో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ‘ఐఫా’ వేడుకల అనంతరం ఢిల్లీకి చెందిన సబా అరీఫ్ అనే శ్రీదేవి అభిమాని తాను కష్టపడి రూపొందించిన వీడియోను తన అనుమతి లేకుండా ‘ఐఫా’ వాడుకుందని ఆరోపించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ వివాదంపై బోనీ కపూర్ స్పందిస్తూ ‘శ్రీదేవికి సంబంధించిన ఫోటోలపై హక్కులన్ని నావే. వాటిని వాడుకునే అధికారం నాకు ఉంది. ఈ వీడియో నాకు ఎంతో నచ్చింది. ఐఫాలో శ్రీదేవికి నివాళులు సమర్పించే సమయంలో ఈ వీడియోను వాడితే బాగుంటుందని అనిపించింది. అందుకే యశ్‌రాజ్ ఫిలిమ్స్‌తో కలిసి ఈ వీడియోను నేనే ఓకే చేశాను. ఇంకా చెప్పాలంటే నాకు సంబంధించిన ఫోటోలను ఆమె వాడుకుంది. అంతే కాక ఈ వీడియో తనదని చెప్పుకుంటుంది. ఇది కరెక్ట్ కాదు. అయినా ఆమెకు ఏదైనా సమస్య ఉంటే నన్ను కలవాల్సింది. అంతే తప్ప ఇలా ఆరోపణలు చేయడం సరికాద’న్నారు.
బోనీ వ్యాఖ్యలపై సబా స్పందిస్తూ ‘ఈ వీడియోలో ఉన్న ఫోటోలు ఆయనవే ఒప్పుకోంటాను. కానీ నేను ఎంతో శ్రమించి ఈ వీడియో తయారు చేశాను. పాటలు, అందుకు తగ్గట్లుగా ఫోటోలను సెలక్ట్ చేసి వీడియో తయారు చేయడానికి నాకు మూడు రోజులు పట్టింది. ఫోటోలు వారివి, కష్టం నాది. నా అనుమతి లేకుండా నేను రూపొందించిన వీడియోను ఎలా వాడతారు. ఈ వీడియోను పోస్టు చేస్తున్నప్పుడు ఇంత గుర్తింపు వస్తుందని అనుకోలేదు. ఇప్పటికి చెప్తున్నా ఆ వీడియో నాదే. ఈ విషయంలో నన్ను గుర్తించాలి’ అని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment