
చిన్నతనంలో పిల్లలు పిచ్చి గీతలు గీస్తేనే మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. పెద్దయ్యాక వాళ్లే కుంచె పట్టుకొని అద్భుతమైన బొమ్మలు వేస్తే? ఆ ఆనందానికి అవధులుండవు. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్. లాక్‌డౌన్‌లో బోనీ కపూర్ కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ డ్రాయింగ్ మీద దృష్టి పెట్టారు. లాక్‌డౌన్‌లో వాళ్లు గీసిన పెయింటింగ్స్‌ను తన ట్విట్టర్‌లో షేర్ చేసి, ‘మా పిల్లలు ప్రతిభావంతులు’ అని మురిసిపోయారు బోనీ కపూర్. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ గీసిన చిత్రాలను ఇక్కడ చూడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment