
బోనీ కపూర్, శ్రీదేవి (ఫైల్ ఫొటో)
సాక్షి, ముంబై: ‘ఆమె ఈ ప్రపంచానికి చాందినీ.. నాకు మాత్రం ఆమే సర్వస్వం.. నా ప్రేమ. ఓ స్నేహితురాలు, భార్య, ఇద్దరు కూతుళ్ల తల్లిని కోల్పోయాను. ఆమె లేని లోటు మాటల్లో వర్ణించలేను’ అని నిర్మాత, నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ ట్వీట్ చేశారు. అంత్యక్రియలు పూర్తయిన అనంతరం శ్రీదేవి ట్వీటర్ ఖాతా నుంచి ఆయన ట్వీట్ చేశారు. శ్రీదేవి మృతిచెందిన తర్వాత ఆమె ట్వీటర్ నుంచి పోస్టయిన తొలి ట్వీట్ ఇది. శ్రీదేవి వెండితెరపై ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. నేడు భౌతికంగా ఆమె మన మధ్య లేదు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో రాసుకొచ్చారు బోనీ కపూర్.
‘ఈ బాధాకర సమయంలో అర్జున్ కపూర్, అన్షుల నా వెంట నిలబడి.. నాకు, జాన్వికి, ఖుషికి ఎంతో ధైర్యాన్నిచ్చారు’ అని ట్వీట్ చేశారు. తన ఇద్దరు కూతుళ్లు జాన్వి, ఖుషిలను జాగ్రత్తగా చూసుకోవడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. సినీ తారల జీవితానికి తెర పడదని, వెండితెరపై వారెప్పుడూ సజీవంగానే ఉంటారని శ్రీదేవి మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న భర్త బోనీ కపూర్ అన్నారు. శ్రీదేవి ట్వీటర్ నుంచి పోస్ట్ అయిన ట్వీట్ వేల రీట్వీట్లు, లైక్స్‌తో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— SRIDEVI BONEY KAPOOR (@SrideviBKapoor) 28 February 2018
Comments
Please login to add a commentAdd a comment