
అప్పటిదాకా ఓ వెలుగు వెలిగిన తారలు అర్ధాంతరంగా తనువు చాలించిన ఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అందులో స్టార్ హీరోయిన్ శ్రీదేవి మరణం కూడా ఒకటి. దుబాయ్‌లో బంధువుల ఫంక్షన్‌కు వెళ్లిన ఆమె 2018 ఫిబ్రవరి 24న బాత్రూమ్‌లో కిందపడి విగతజీవిగా మారింది. కోట్లాదిమంది అభిమానులను, భర్త బోనీ కపూర్, పిల్లలు జాన్వీ, ఖుషీ కపూర్‌లను దుఃఖ సాగరంలో ముంచుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.
రేపు శ్రీదేవి వర్ధంతి. ఈ సందర్భంగా బోనీ కపూర్ శ్రీదేవి మరణానికి ముందురోజు చివరగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇందులో అందంగా రెడీ అయిన శ్రీదేవి కుటుంబంతో కలిసి ఫోటోకు పోజిచ్చింది. కల్మషం లేని చిరునవ్వు ఆమె పెదాలపై అలాగే నిలిచి ఉంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు 'శ్రీదేవికి మరణం లేదు, మా గుండెల్లో తను చిరస్థాయిగా నిలిచిపోయింది' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: అమెరికన్ పాపులర్ షోలో చరణ్
Comments
Please login to add a commentAdd a comment