‘అమ్మా లవ్ యూ.. ఎప్పటిలాగానే.. ఇప్పుడు ఎక్కడున్నా సరే నువ్వు నవ్వుతూనే ఉండాలి.. ఈ ఫొటో మనం కలిసి జరుపుకొన్న చివరి పుట్టిన రోజునాటిది.. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో జరగాలని నేను కోరుకున్నా... నిజంగా నిన్ను మిస్ అవుతున్నా అమ్మా.. 25 ఏళ్ల వయస్సులో నిన్ను కోల్పోయినపుడు ఈ సొసైటీ నేను ఎలా ఉండాలని అయితే భావించిందో అంతే దృఢంగా ఉండేందుకు ప్రయత్నించాను. నీ జీవితం ముగిసిపోయిన తర్వాత చాలా రోజుల పాటు నేను ఎంతగా వేదన చెందానో నాకే తెలుసు... అయితే నీ ముందు కూర్చుని.. నిన్ను విసిగించడం మాత్రం ఇప్పటికీ మానలేదు.. హ్యాపీ బర్త్‌డే అమ్మా.. మనం ఇలాగే కలిసి మరింత సమయం గడుపుదాం. అన్షులా నీలాగే తను చేస్తున్న పనిలో దూసుకుపోతోంది’ అంటూ బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తన తల్లి మోనా శౌరీ కపూర్‌ను గుర్తుచేసుకున్నాడు. సోమవారం తల్లి పాత ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసి.. ఆమెతో కలిసి గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశాడు.
కాగా అర్జున్ కపూర్, అతడి సోదరి అన్షులా కపూర్.. బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్- అతడి మొదటి భార్య మోనా సంతానం అన్న సంగతి తెలిసిందే. ఇక అందాల తార శ్రీదేవితో ప్రేమలో పడిన తర్వాత మోనాకు విడాకులిచ్చిన బోనీ.. ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మోనా, ఆమె పిల్లలు అర్జున్, అన్షులా తండ్రికి దూరంగానే ఉన్నారు. ఈ క్రమంలో 2012లో మోనా క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. ఇక తల్లితో తన అనుంబంధం గురించి అర్జున్ తరచుగా గుర్తుచేసుకుంటాడన్న సంగతి తెలిసిందే. కాగా శ్రీదేవి మరణానంతరం తండ్రి, చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలతో కలిసి పోయిన అర్జున్.. ప్రతీ విషయంలోనూ వారికి అండగా నిలుస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment