ఇంటి పెద్ద దిక్కు మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎంతో దయనీయంగా మారుతుంది. సంపాదనతో ఫ్యామిలీని పోషించే మనిషి లేకుంటే అంతా తలకిందులవుతుంది. చాలా సందర్భాల్లో పిల్లలు బడి మానేసే దుస్థితి ఏర్పడుతుంది. వయసుకు మించిన పని చేయడానికీ వెనుకాడరు. ఇటీవల ఢిల్లీలో జస్‌ప్రీత్ అనే పిల్లవాడు తన తండ్రిని కోల్పోవడంతో ఆయనలాగే చపాతీలు చేసే పనిలోకి దిగాడు. పదేళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతను భుజాన వేసుకున్నాడు.
చేయూతనిచ్చేందుకు రెడీ
తల్లి పంజాబ్‌లోని గ్రామంలో ఉండగా జస్‌ప్రీత్ తన సోదరితో కలిసి వాళ్ల ఆంటీ ఇంట్లో ఉంటున్నాడు. ఓ ఫుడ్ వ్లాగర్ ఇతడి పరిస్థితి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. దీంతో ఆనంద్ మహీంద్రా, ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్, బీజేపీ లీడర్ రాజీవ్ బాబ్బర్ తనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తాజాగా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తనకు చేయూతనిచ్చేందుకు రెడీ అయ్యాడు.
సెల్యూట్
ఈ పదేళ్ల బాలుడు చిరునవ్వుతో కష్టాలను దాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. తండ్రి చనిపోయిన పది రోజులకే ఆయన పనిని చేసేందుకు రంగంలోకి దిగిన అతడి గుండెధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాను. అతడికి లేదా అతడి సోదరికి మంచి విద్య అందించేందుకు సాయం చేయాలనుకుంటున్నాను. అతడు ఎక్కడుంటాడో తెలిస్తే చెప్పండి అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. ఇది చూసిన జనాలు అర్జున్‌ది ఎంత గొప్ప మనసు అని కొనియాడుతున్నారు.
చదవండి: రూ.15 లక్షల విలువైన జ్యువెలరీ.. తల్లికి రైతుబిడ్డ గిఫ్ట్!
Comments
Please login to add a commentAdd a comment