మా అమ్మానాన్నను భయపెట్టారు! | Tripti Dimri Interview | Sakshi
Sakshi News home page

మా అమ్మానాన్నను భయపెట్టారు!

Published Mon, Sep 23 2024 3:50 AM | Last Updated on Mon, Sep 23 2024 3:50 AM

Tripti Dimri Interview

‘‘నేను నటి కావాలనుకున్నప్పుడు మా కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. అయితే మా బంధువులు, ఇరుగు పోరుగు వాళ్లు సినిమా ఇండస్ట్రీ మంచిది కాదు. అక్కడికి వెళితే చెడు అలవాట్లకు బానిసవుతుంది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు’ అంటూ ఏవేవో చెప్పి మా అమ్మానాన్నను భయపెట్టారు’’ అన్నారు త్రిప్తీ దిమ్రి. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించిన ‘యానిమల్‌’ (2023) సినిమాలో చేసిన కీలక పాత్ర ద్వారా  దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు త్రిప్తి. 

ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారామె. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిప్తీ దిమ్రి మాట్లాడుతూ– ‘‘చిన్నతనం నుంచే నాకు నటనంటే ఆసక్తి. నటి కావాలనుకున్నప్పుడు ఇంట్లో వాళ్లు కొంచెం కంగారుపడ్డారు. ఆ తర్వాత ధైర్యం చేసి ముంబై వచ్చాను.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. అవకాశాల్లేక బాధపడిన క్షణాలున్నాయి. కొన్ని సందర్భాల్లో నమ్మకం కోల్పోయాను. చివరకు హీరోయిన్‌గా ‘లైలా మజ్ను’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాను. నా విషయంలో నా ఫ్యామిలీ మెంబర్స్‌ హ్యాపీ’’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement