ఎంత ఘోరంగా స్టెప్పులేసిందో! డ్యాన్స్‌ క్లాసులకు వెళ్లాల్సింది: ఉర్ఫీ | Urfi Javed Feels Tripti Dimri Need Dance Classes | Sakshi
Sakshi News home page

Urfi Javed: తృప్తికి డ్యాన్సే రాదు.. క్లాసులకు వెళ్లి నేర్చుకోవచ్చుగా!

Published Fri, Nov 8 2024 4:20 PM | Last Updated on Fri, Nov 8 2024 4:50 PM

Urfi Javed Feels Tripti Dimri Need Dance Classes

చిత్రవిచిత్ర వేషధారణతో ఎప్పుడూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూనే ఉంటుంది ఉర్ఫీ జావెద్‌. ఈ బుల్లితెర నటి ఇటీవలే ఫాలో కర్లో యార్‌ అనే సిరీస్‌లో మెరిసింది. ఇందులో ఉర్ఫీ పడ్డ కష్టాలను, తన జర్నీని, సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా ఎలా ఎదిగిందన్నదీ చూపించారు.

ఆ స్టెప్పయితే ఘోరం
ఇకపోతే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఉర్ఫీ జావెద్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్‌ తృప్తి డిమ్రికి డ్యాన్స్‌ రాదనేసింది. ఉర్ఫీ మాట్లాడుతూ.. తృప్తి మంచి నటి.. అందులో సందేహమే లేదు. కానీ డ్యాన్స్‌ విషయానికి వచ్చేసరికి మాత్రం తను చాలా వీక్‌. ఎందుకు తృప్తి ఇలా చేశావ్‌? మేరే మెహబూబ్‌ పాటలో ఆ ఫ్లోర్‌ స్టెప్పయితే అస్సలు బాగోలేదు. నువ్వు డ్యాన్స్‌ క్లాసులకు వెళ్లి ఉండాల్సింది అని విమర్శించింది. 

నిజమే..
ఈ కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉర్ఫీ చెప్తోంది నిజమే.. నాకు తృప్తి అంటే చాలా ఇష్టం. కానీ ఆమెకు సరిగా డ్యాన్స్‌ చేయరాదు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఆమె నటి.. డ్యాన్సర్‌ కాదు, మరొకరి గురించి చెప్పేముందు నువ్వు సరిగ్గా దుస్తులు ధరించడం నేర్చుకో అని కౌంటర్లు ఇస్తున్నారు.

సినిమా
​కాగా యానిమల్‌ సినిమాతో నేషనల్‌ క్రష్‌గా మారిన తృప్తి డిమ్రి గత నెలలో 'విక్కీ విద్యాకో వో వాలా వీడియో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రాజ్‌ కుమార్‌ రావు హీరోగా నటించాడు. ఈ మూవీలోని మేరే మెహబూబ్‌ పాటలో రాజ్‌ కుమార్‌ ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌కు మంచి మార్కులు పడగా.. తృప్తి వేసిన స్టెప్పులకుగానూ ట్రోలింగ్‌కు గురైంది.

చదవండి: Vijay Devarakonda: కిందపడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement