Asaduddin Owaisi: ముస్లింలు, దళితులకు చంద్రబాబు శత్రువు... | Sakshi
Sakshi News home page

Asaduddin Owaisi: ముస్లింలు, దళితులకు చంద్రబాబు శత్రువు...

Published Mon, Apr 29 2024 7:19 PM

Asaduddin Owaisi Comments On TDP And BJP Parties

ముస్లిలంకు రిజర్వేషన్‌లు ఇచ్చింది మహానేత వైఎస్సార్‌

రిజర్వేషన్‌లతో ముస్లింలు ఇప్పుడిప్పుడే బాగుపుడుతున్నారు

ముస్లిం రిజర్వేషన్‌లను  బీజేపీ ఓర్వలేకపోతోంది

ఏపీలో బీజేపీ ఎజెండాను చంద్రబాబు అమలు చేస్తున్నారు

ముస్లిం రిజర్వేషన్‌లు తీసివేసేందుకు చంద్రబాబు కుట్ర

చంద్రబాబు రాజకీయ అవకాశవాది

జగన్ సెక్యులర్ నాయకుడు

ముస్లింలు, దళితులకు అండగా నిలబడే నాయకుడు జగన్‌

జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలబడాలని ముస్లింలు, దళితులను కోరుతున్నాను

రిపోర్టర్‌: ఈ సారి దేశవ్యాప్తంగా ఎన్నికలు హిందూ-ముస్లిం, ముస్లిం రిజర్వేషన్‌లు అనే ఎజెండాపై జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం…

ఓవైసి: సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ తన లోపాలను కప్పిపుచ్చేందుకు ఇలాంటి వాతావరణం సృష్టించారు. నిన్నటి దాకా విశ్వగురు, జీ-20, చంద్రయాన్‌, 5ట్రిలియన్‌ ఎకానమి అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు అవన్నీ వదిలేసి.. హిందూ-ముస్లిం వివాదం తీసుకువ్చచారు. ఇది చూస్తే అర్ధమవుతోంది… ప్రధాని మోదీకి ముస్లిం మైనారిటీలంటే ఎంత ధ్వేషమో. ముస్లింలను ధ్వేషించడం ఒక్కటే… ప్రధాని మోదీ గ్యారంటీ.

రిపోర్టర్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాతో పాటు ముస్లిం రిజర్వేషన్‌లు ఉన్న ప్రతీచోటా వాటిని తీసివేయాలనే ప్రయత్నం జరుగుతోంది… దీనిపై మీ అభిప్రాయం.

ఓవైసి: 2004లో గులాంనబీ అజాద్‌ కాంగ్రెస్ పరిశీలకులుగా హైదరాబాద్ వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ నేత యూనుస్ సుల్తాన్ ఇంట్లో జరిగిన సమావేశంలో… ముస్లిం రిజర్వేషన్‌లు ఇస్తామని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. హామి ఇచ్చినట్లుగానే అధికారంలోకి రాగానే వైఎస్సార్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్‌లు కల్పించింది.

ముందుగా కోర్టు దీనిపై అభ్యంతరం చెప్పింది. దీంతో ప్రముఖ ఆంత్రోపాలజిస్టు కృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ వేసి… ముస్లింలలో కుల ప్రాతిపదికన 4శాతం రిజర్వేషన్‌లు ఇవ్వడం సహేతుకమే అని తేల్చారు. ఆ తరువాత వేసిన ఎస్‌ఎల్‌పీలో ముస్లిం రిజర్వేషన్‌లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. చాలామంది ముస్లిం యువకులు, విద్యార్ధులు రిజర్వేషన్‌ల వల్ల లబ్ది పొందుతున్నారు.

ఇప్పుడిప్పుడే ముస్లింలు కాస్త బాగుపడుతున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, డీఎస్పీలు, ఆర్డీవోలు, టీచర్‌లుగా ఉద్యోగులు పొందుతున్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వారికి ముస్లింలు అంటే తీవ్రమైన ధ్వేషం. 4శాతం రిజర్వేషన్ల ద్వారా ముస్లింలు లబ్దిపొందడం బీజేపీకి మింగుడుపడటం లేదు. విద్యా, ఉద్యోగ పరంగా ముస్లింలు స్వావలంబన సాధించడం బీజేపీకి నచ్చక వారు రిజర్వేషన్‌లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలో ముస్లింలకు మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు లభించడం లేదు. ముస్లింలలోని నిమ్న కులాలు వారికి సమాజంలో ఉన్న సామాజిక, విద్యాపరమైన వెనకబాటు కారణంగా రిజర్వేషన్‌లు అందుతున్నాయి.

ముస్లింల అభివృద్దిని అడ్డుకునేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లు చంద్రబాబునాయుడు, జనసేన పార్టీలు పనిచేస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల శత్రువులు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు బీజేపీ ఎజెండా ఆధారంగా ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.  ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే బీజేపీ, జనసేనతో కలిసి చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్‌లు లేకుండా చేస్తాడు. ముస్లిం రిజర్వేషన్‌ల తరువాత వీరు దళితులకు కూడా రిజర్వేషన్‌లు లేకుండా చేస్తారు. ఏపీ ప్రజలంతా ఆలోచించి చంద్రబాబు, బీజేపీ, జనసేనలాంటి మతతత్వ, ఫాసిస్టు పార్టీలను ఓడిస్తారని ఆశిస్తున్నాను.

ఏపీ ప్రజలందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నాను… మీరంతా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా ఓటు వేయండి. జగన్‌మోహన్‌రెడ్డి మతతత్వవాది కాదు… జగన్‌మోహన్‌రెడ్డి లౌకికవాది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విభజన తరువాత చాలా సమస్యలున్నాయి.

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయనిర్ణయాలు తీసుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడు దళితులు, ముస్లింల ప్రయోజనాలపై రాజీపడలేదు. చంద్రబాబు మాత్రం ముస్లింలు, దళితుల ప్రజయోజనాలను తాకట్టుపెట్టి స్వలాభం ఆలోచించారు. 2002లో గుజరాత్‌ అల్లర్ల కారణంగా దేశం మొత్తం కాలిపోతుంటే, ముస్లింలపై దౌర్జన్యాలు జరుగుతుంటే చంద్రబాబు మాత్రం బీజేపీకి మద్దతిచ్చాడు. చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ నమ్మరు. ముస్లింల పట్ల చంద్రబాబుకు ఎలాంటి ప్రేమలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement