owaisi asaduddin
-
Asaduddin Owaisi: ముస్లింలు, దళితులకు చంద్రబాబు శత్రువు...
రిపోర్టర్: ఈ సారి దేశవ్యాప్తంగా ఎన్నికలు హిందూ-ముస్లిం, ముస్లిం రిజర్వేషన్లు అనే ఎజెండాపై జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం…ఓవైసి: సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ తన లోపాలను కప్పిపుచ్చేందుకు ఇలాంటి వాతావరణం సృష్టించారు. నిన్నటి దాకా విశ్వగురు, జీ-20, చంద్రయాన్, 5ట్రిలియన్ ఎకానమి అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు అవన్నీ వదిలేసి.. హిందూ-ముస్లిం వివాదం తీసుకువ్చచారు. ఇది చూస్తే అర్ధమవుతోంది… ప్రధాని మోదీకి ముస్లిం మైనారిటీలంటే ఎంత ధ్వేషమో. ముస్లింలను ధ్వేషించడం ఒక్కటే… ప్రధాని మోదీ గ్యారంటీ.రిపోర్టర్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు ముస్లిం రిజర్వేషన్లు ఉన్న ప్రతీచోటా వాటిని తీసివేయాలనే ప్రయత్నం జరుగుతోంది… దీనిపై మీ అభిప్రాయం.ఓవైసి: 2004లో గులాంనబీ అజాద్ కాంగ్రెస్ పరిశీలకులుగా హైదరాబాద్ వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ నేత యూనుస్ సుల్తాన్ ఇంట్లో జరిగిన సమావేశంలో… ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. హామి ఇచ్చినట్లుగానే అధికారంలోకి రాగానే వైఎస్సార్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించింది.ముందుగా కోర్టు దీనిపై అభ్యంతరం చెప్పింది. దీంతో ప్రముఖ ఆంత్రోపాలజిస్టు కృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ వేసి… ముస్లింలలో కుల ప్రాతిపదికన 4శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సహేతుకమే అని తేల్చారు. ఆ తరువాత వేసిన ఎస్ఎల్పీలో ముస్లిం రిజర్వేషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. చాలామంది ముస్లిం యువకులు, విద్యార్ధులు రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందుతున్నారు.ఇప్పుడిప్పుడే ముస్లింలు కాస్త బాగుపడుతున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, డీఎస్పీలు, ఆర్డీవోలు, టీచర్లుగా ఉద్యోగులు పొందుతున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారికి ముస్లింలు అంటే తీవ్రమైన ధ్వేషం. 4శాతం రిజర్వేషన్ల ద్వారా ముస్లింలు లబ్దిపొందడం బీజేపీకి మింగుడుపడటం లేదు. విద్యా, ఉద్యోగ పరంగా ముస్లింలు స్వావలంబన సాధించడం బీజేపీకి నచ్చక వారు రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ముస్లింలకు మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు లభించడం లేదు. ముస్లింలలోని నిమ్న కులాలు వారికి సమాజంలో ఉన్న సామాజిక, విద్యాపరమైన వెనకబాటు కారణంగా రిజర్వేషన్లు అందుతున్నాయి.ముస్లింల అభివృద్దిని అడ్డుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లు చంద్రబాబునాయుడు, జనసేన పార్టీలు పనిచేస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల శత్రువులు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు బీజేపీ ఎజెండా ఆధారంగా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే బీజేపీ, జనసేనతో కలిసి చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లు లేకుండా చేస్తాడు. ముస్లిం రిజర్వేషన్ల తరువాత వీరు దళితులకు కూడా రిజర్వేషన్లు లేకుండా చేస్తారు. ఏపీ ప్రజలంతా ఆలోచించి చంద్రబాబు, బీజేపీ, జనసేనలాంటి మతతత్వ, ఫాసిస్టు పార్టీలను ఓడిస్తారని ఆశిస్తున్నాను.ఏపీ ప్రజలందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నాను… మీరంతా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మద్దతుగా ఓటు వేయండి. జగన్మోహన్రెడ్డి మతతత్వవాది కాదు… జగన్మోహన్రెడ్డి లౌకికవాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తరువాత చాలా సమస్యలున్నాయి.రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్రెడ్డి రాజకీయనిర్ణయాలు తీసుకున్నారు. జగన్మోహన్రెడ్డి ఎప్పుడు దళితులు, ముస్లింల ప్రయోజనాలపై రాజీపడలేదు. చంద్రబాబు మాత్రం ముస్లింలు, దళితుల ప్రజయోజనాలను తాకట్టుపెట్టి స్వలాభం ఆలోచించారు. 2002లో గుజరాత్ అల్లర్ల కారణంగా దేశం మొత్తం కాలిపోతుంటే, ముస్లింలపై దౌర్జన్యాలు జరుగుతుంటే చంద్రబాబు మాత్రం బీజేపీకి మద్దతిచ్చాడు. చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ నమ్మరు. ముస్లింల పట్ల చంద్రబాబుకు ఎలాంటి ప్రేమలేదు. -
ఆ ముగ్గురూ తోడు దొంగలే
వికారాబాద్/కొడంగల్: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, ఎంపీ ఒవైసీ ముగ్గురూ తోడు దొంగలేనని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ట్రిపుల్ తలాక్, 370డీ రద్దు వంటి మోదీ తీసుకున్న నిర్ణయాలకు కేసీఆర్ అండగా నిలిచారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని గెలిపించాలని ఒవైసీ.. ముస్లింలకు ఎలా చెబుతాడని ప్రశ్నించారు. వికారాబాద్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే ఎంతో మంది యువత ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని ప్రారంభించి వైఎస్ రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే.. కేసీఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాణహితకు పాతరేశాడన్నారు. రంగారెడ్డి జిల్లాకు, దక్షిణ తెలంగాణకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని విమర్శించారు. కేసీఆర్ తన సొంత ఊరు బాగుంటే చాలనుకుంటున్నారని, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేక చింతమడకకు సర్పంచో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ముదిరాజ్‌లకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని కేసీఆర్ పూర్తిగా గాలికి వదిలేశారని రేవంత్ విమర్శించారు. జనాభాలో మెజార్టీ శాతం ఉన్న ముదిరాజ్‌లకు బీఆర్ఎస్ రాష్ట్రం మొత్తంలో ఒక్క అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వలేదని, మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరుకానున్న చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రజాగర్జన సభకు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు రఘువీరారెడ్డి పాల్గొన్నారు. కొడంగల్ రుణం ఎన్నటికీ తీర్చలేనిది కొడంగల్ ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణానికి వచి్చన ఆయన మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం దేశ్‌ముఖ్ కుటుంబ సభ్యులను కలిసి.. తనకు మద్దతివ్వాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో రేవంత్ మాట్లాడుతూ.. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కొడంగల్‌ను మరువను.. విడువను అని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌లో చేరిన మైత్రి గ్రూప్ చైర్మన్ సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లాకు చెందిన మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం సాయంత్రం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. జైపాల్ పార్టీలో చేరిక సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆయన అనుచరులు గాందీభవన్‌కు తరలివచ్చారు. -
గాడ్సే, ఆప్టే పుత్రులు ఎవరో?.. ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్..
మహారాష్ట్ర: ఔరంగాబాద్ వివాదాస్పద వాట్సప్ స్టేటస్‌ల వివాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై ఏఐఎమ్ఐఎమ్ నాయకుడు అసదుద్ధీన్ ఓవైసీ స్పందించారు. ఔరంగజేబు కుమారులు నగరంలో ప్రత్యక్షమయ్యారనే ఫడ్నవీస్ వ్యాఖ్యలకు అసదుద్ధీన్.. గాడ్సే, ఆప్టే పుత్రులు ఎవరో తెలుసుకోవాలని? అన్నారు. కొల్లాపూర్‌లో కొందరు యువకులు ఔరంగజేబు, టిప్పు సుల్తాన్లను కీర్తిస్తూ వాట్సప్ స్టేటస్‌లను పెట్టడం వివాదాస్పదమైంది. తీవ్ర స్థాయిలో ఘర్షణలు కూడా జరిగాయి. అయితే.. ఈ వివాదంపై ఫడ్నవీస్.. నగరంలో కొందరు ఔరంగాజేబు కుమారులు ప్రత్యక్షమయ్యారని, వారెవరో తొందరగా గుర్తిస్తామని అన్నారు. వారు ఎవరి మనుషులో? ఎవరు పంపించారో కనుక్కుంటామని వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన అసదుద్ధీన్ ఓవైసీ.. ఫడ్నవీస్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. 'నాథూరాం గాడ్సే, వామన్ శివరామ్ ఆప్టే కుమారులెవరో తెలుసుకోవాలి. మీకు అన్నీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఆ విషయంలో మీరు నిపుణులని తెలుసు?' అని అన్నారు. అయితే.. బుధవారం ఈ వివాదంపై జరిగిన ఘర్షణల కారణంగా స్థానికంగా కర్ఫ్యూ విధించారు. అందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని సీఎం ఏక్నాథ్ షిండే చెప్పారు. ఇదీ చదవండి:ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్టు.. మిన్నంటిన ఆందోళనలు -
అసెంబ్లీ నుంచి బహిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని యాకుత్‌పురా ఎమ్మెల్యే(ఎంఐఎం) సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బుధవారం లేఖ రాశారు. ఇక రాజాసింగ్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మండిపడగా.. రాష్ట్రాన్ని తగలబెట్టి శ్మశానాలు ఏలుతారా అంటూ టీఆర్ఎస్, బీజేపీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో మతఘర్షణలు చేయించడానికి సీఎం కుట్ర పన్నుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేశారు. అసెంబ్లీ నుంచి బహిష్కరించండి శాసనసభ విలువలను దిగజా రుస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని యాకుత్‌పురా ఎమ్మెల్యే(ఎంఐఎం) సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బుధవా రం లేఖ రాశారు. ఎమ్మెల్యేగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించి సభ ప్రతిష్టకు భంగం కలిగించిన రాజాసింగ్‌పై రాజ్యాంగంలోని 194వ ఆర్టికల్ నిబంధనల మేరకు చర్యలు తీసుకునే అధికారం అసెంబ్లీకి ఉందని లేఖలో ప్రస్తావించారు. ఈ నెల 22న మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నా యన్నారు. ఈ ఏడాది అసెంబ్లీలోనూ అసంబద్ద వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన విషయాన్ని ఖాద్రి గుర్తు చేశారు. రాజాసింగ్‌ను బహిష్కరించాలి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మతకల్లోలాలకు దారి తీసేలా, మత ఘర్షణలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సమాజ బహిష్కరణ చేయాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణపై బీజేపీ మిడతల దండులా దాడి చేస్తోందని, మత అలజడులను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుధవారం భట్టి విలేక రులతో మాట్లాడారు. బీజేపీ నేతల తీరు దేశ సమైక్యత, సమగ్రత, లౌకికవా దానికి పెనుముప్పుగా మారుతోందన్నారు. రాజాసింగ్ తన స్థాయి మరిచి జుగుప్సకర వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. సమాజహితం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రాజాసింగ్‌ను కట్టడి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇతర మతా లను గౌరవించాలని, కానీ రాజాసింగ్ అందుకు భిన్నంగా మాట్లాడినందున భారత రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే వారిని జైలుకు పంపండి: రేవంత్ మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘మత విద్వేషాలు రెచ్చగొట్టి, తాత్కాలిక రాజకీయ ప్రయోజనం పొందడానికి బీజేపీ ఎంతకైనా బరితెగిస్తుందని రాజాసింగ్ మాటలు ధ్రువీకరి స్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలోని వాస్తవాలను మరుగున పరచడా నికి టీఆర్ఎస్ కృత్రిమంగా సృష్టిస్తోన్న గందరగోళాన్ని కూడా ప్రజలు గమ నిస్తున్నారు’ అని రేవంత్ ఆ ట్వీట్లో వ్యాఖ్యానించారు. రాజాసింగ్‌ను జైలుకు పంపాలి: అసదుద్దీన్ ఒవైసీ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను జైలుకు పంపాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన దారు స్సలాంలో మీడియాతో మాట్లాడారు. రాజాసింగ్ కు బెయిల్ రావడంపై మండిపడ్డారు. పోలీసుల పొరపాటుతో ఆయనకు జైలు తప్పిందని, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు దీనిని సరిదిద్దుతారని ఆశిస్తు న్నానని పేర్కొన్నారు. రాజాసింగ్‌పై తీవ్ర ఆరో పణలు ఉన్నాయని, సహించరాని వివాదాస్పద వాఖ్యలతో ఆయన వీడియోను విడుదల చేశారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేగా రాజాసింగ్ వైఖరి అసభ్యకరంగా ఉందని ఒవైసీ నిప్పులు చెరిగారు. వివాదాస్పద వాఖ్యలు చేసిన రాజాసింగ్ వాయిస్ శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. వాయిస్ శాంపిల్ నిర్ధారణ ద్వారా బలమైన కేసు పెట్టాలని ప్రభు త్వానికి సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఇలాంటి వాఖ్యలు చేయడం ఇదే చివరిసారి కావాలని పేర్కొన్నారు. నుపుర్‌శర్మ వ్యవహారం నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకోలేదని ఆయన దుయ్యబట్టారు. ఎక్కడ కనిపించినా దాడి చేయండి: ఫిరోజ్‌ఖాన్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే హైదరాబాద్ లోని ముస్లింలు రాజాసింగ్ ఎక్కడ కనిపించినా దాడి చేయాలని కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక మతాన్ని కించప రిచేలా మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్య మాల్లో బుధవారం ఆయన ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఫిరోజ్‌ఖాన్ మాట్లాడుతూ.. శాంతి, సమానతలతో ఉన్న హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేలా రాజాసింగ్ వ్యాఖ్యలున్నాయని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకుని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. -
ఓ పక్క మన వాళ్లను చంపుతుంటే, పాక్‌తో టీ20 అవసరమా.
-
బీజేపీ కనుసన్నల్లోనే ఢిల్లీ అల్లర్లు: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కనుసన్నల్లోనే ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మంగళవారం దారుస్సలాంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే డీసీపీ పక్కన నిలబడి అల్టిమేటం ఇస్తున్నారన్నారు. పోలీసులు తమ విధులను పక్కనపెట్టి గుంపులతో కలిసి అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇవి మతపరమైన అల్లర్లు కావని, పథకం ప్రకారం జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయన్నారు. -
మమతపై ఒవైసీ ఫైర్
కోల్‌కతా: మైనారిటీల్లో అతివాదాన్ని పెంచుతోందంటూ ఏఐఎంఐఎంను ఉద్దేశించి పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. తృణమూల్ చీఫ్ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముస్లింలు ఘోరంగా వెనుకబడిపోయారని దుయ్యబట్టారు. సోమవారం కూచ్ బెహర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమత మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఓ పార్టీ.. సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తోంది. ఇటువంటి అతివాద శక్తుల మాటలు మైనార్టీలు వినొద్దు. నమ్మొద్దు..’ అంటూ ఎంఐఎం పేరును ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఒవైసీ మంగళవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. ‘ఆమె అహంకారంతో అర్థం లేని నిరాధారమైన ప్రకటనలు చేస్తున్నారు. ఆమెకు ఓటు వేసిన ముస్లింలందరినీ కించపరిచారు’అని అన్నారు. తృణమూల్ చీఫ్ మాటలు వింటుంటే ఆ రాష్ట్రంలో ఎంఐఎం ఎంత బలంగా ఎదిగిందో తెలుసుకోవచ్చన్నారు. -
ఆ పార్టీ విభేదాలు సృష్టిస్తోంది
కోల్‌కతా : హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఏఐఎంఐఎం పార్టీ సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బిహార్ లో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏఐఎంఐఎంను అతివాద పార్టీగా ఆమె అభివర్ణించారు. ఇటువంటి శక్తులను నమ్మకూడదని మైనార్టీలను కోరారు.అలాగే హిందూ అతివాద శక్తుల పట్ల ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. 2011 నుంచి పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ కొనసాగుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రయత్నాలు జరుపుతుండడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే తమ బలాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించడం గమనార్హం. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఒవైసీ స్పందిస్తూ.. మమత ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. బెంగాల్లో ముస్లింల పరిస్ధితి అత్యంత దారుణంగా ఉంది. బెంగాల్లో మేం బీజేపీకి 'బీ టీం' అనడం పూర్తిగా అర్థరహితమన్నారు. మమతా బెనర్జీ భయంతోనే అలా మాట్లాడుతున్నారు. బెంగాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు ఒవైసీ తెలిపారు. -
ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం అనుమతించదు : ఓవైసీ
-
ఎంపీకి కంప్లైంట్ చేసిన స్టూడెంట్స్
-
బల్దియాలో పాగా వేయాలి
వినాయక్‌నగర్,న్యూస్‌లైన్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంరూ.ఎం అభ్యర్థులు ప్రత్యర్థుల కు గట్టి పోటీనిచ్చి తమ ప్రతాపాన్ని చూపాలని ఆ పార్టీ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపు నిచ్చారు. పార్టీ అభ్యర్థులు ఎక్కువ సం ఖ్యలో గెలువాలన్నారు. నగరంలోని ఖిల్లా రోడ్డులో బుధవారం రాత్రి ఏ ర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో తె లంగాణ బిల్లు సమయంలో పలు డిమాండ్లు చేసినప్పటికీ ఎవరూ పట్టిం చుకోలేదన్నారు. తెలంగాణలో ప్రథమ భాషగా ఉర్దూను గుర్తించాలి. తె లంగాణ హైకోర్టును నిర్మించాలి. తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఏర్పాటు చే యాలి. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలనే తదితర డి మాండ్లను అధికార పార్టీ, ప్రతిపక్షాలు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అయితే తన డిమాండ్లు బాగున్నాయని లోక్‌సభ స్పీకర్ కాంగ్రెస్ ఎంపీలతో అన్నారని, వారు ఆ విషయాన్ని తనతో చెప్పినట్లు అసదుద్దీన్ పేర్కొన్నారు. ఎంపీ మధుగౌడ్ ఏం అభివృద్ధి చేశాడో ఒక్కసారి ఆయనను జిల్లా ప్రజలు నిలదీయాలన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ద్వారా నిజామాబాద్ జిల్లాలోని 3 లక్షల 4 వేల ఎకరాలకు నీరందుతుందని, అయితే ఆ ప్రాజెక్టు పది సంవత్సరాలైనా పూర్తికాదన్నారు. పోలవరం మాత్రం ఆగమేఘాలల్లో నిర్మాణం అవుతుందని వ్యంగంగా అన్నారు. ఇతర పార్టీల్లోని ముస్లింలందరూ ఎంరూ.ఎంలోకి రండి.. దేశ చరిత్రనే మార్చేద్దాం అంటూ పేర్కొన్నారు. షబ్బీర్‌అలీ రెండు సార్లు ఓడిపోయాడు. కాంగ్రెస్‌లో ఎందుకు ఎంరూ.ఎంకు విచ్చేయండిఅంటూ సూచించారు. చంద్రబాబు.. బిల్‌క్లింటన్‌ను కలిశావు.. ఎందరో మందిని కలిశావు. చివరకు మోడీని కలుస్తున్నావు నీ పార్టీ ఖాళీ అవుతుంది. సైకిల్ పైనుంచి అందరు దిగి కారులోకి వెళ్తున్నారు. ఇకనైనా కళ్లు తెరవాలని హితబోధ చేశారు. నగరానికి ఏమి అభివృద్ధి చేశాడో.. ఎంత రక్షణ కల్పించాడో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేను అడుగండి అని సభికులను ఉద్దేశించి అసదుద్దీన్ అన్నారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల నిర్మించడం హర్షణీయమైనప్పటికీ పండ్ల దుకాణాలను ఎత్తివేసి వ్యాపారుల పొట్టగొట్టడం బాధాకరమన్నారు. సభలో యాకత్‌పూర ఎమ్మెల్యే భాషాఖద్రీ, రాష్ట్ర నాయకులు , నగర అధ్యక్షులు ఎం.ఎ.ఫహిమ్, కైసర్ , మోహిస్, పాషా, జావిద్, ఉసెన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.