
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కనుసన్నల్లోనే ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మంగళవారం దారుస్సలాంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే డీసీపీ పక్కన నిలబడి అల్టిమేటం ఇస్తున్నారన్నారు. పోలీసులు తమ విధులను పక్కనపెట్టి గుంపులతో కలిసి అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇవి మతపరమైన అల్లర్లు కావని, పథకం ప్రకారం జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయన్నారు.