వినాయక్‌నగర్,న్యూస్‌లైన్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంరూ.ఎం అభ్యర్థులు ప్రత్యర్థుల కు గట్టి పోటీనిచ్చి తమ ప్రతాపాన్ని చూపాలని ఆ పార్టీ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపు నిచ్చారు. పార్టీ అభ్యర్థులు ఎక్కువ సం ఖ్యలో గెలువాలన్నారు. నగరంలోని ఖిల్లా రోడ్డులో బుధవారం రాత్రి ఏ ర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో తె లంగాణ బిల్లు సమయంలో పలు డిమాండ్లు చేసినప్పటికీ ఎవరూ పట్టిం చుకోలేదన్నారు.
తెలంగాణలో ప్రథమ భాషగా ఉర్దూను గుర్తించాలి. తె లంగాణ హైకోర్టును నిర్మించాలి. తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఏర్పాటు చే యాలి. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలనే తదితర డి మాండ్లను అధికార పార్టీ, ప్రతిపక్షాలు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అయితే తన డిమాండ్‌లు బాగున్నాయని లోక్‌సభ స్పీకర్ కాంగ్రెస్ ఎంపీలతో అన్నారని, వారు ఆ విషయాన్ని తనతో చెప్పినట్లు అసదుద్దీన్ పేర్కొన్నారు. ఎంపీ మధుగౌడ్ ఏం అభివృద్ధి చేశాడో ఒక్కసారి ఆయనను జిల్లా ప్రజలు నిలదీయాలన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ద్వారా నిజామాబాద్ జిల్లాలోని 3 లక్షల 4 వేల ఎకరాలకు నీరందుతుందని, అయితే ఆ ప్రాజెక్టు పది సంవత్సరాలైనా పూర్తికాదన్నారు.
పోలవరం మాత్రం ఆగమేఘాలల్లో నిర్మాణం అవుతుందని వ్యంగంగా అన్నారు. ఇతర పార్టీల్లోని ముస్లింలందరూ ఎంరూ.ఎంలోకి రండి.. దేశ చరిత్రనే మార్చేద్దాం అంటూ పేర్కొన్నారు. షబ్బీర్‌అలీ రెండు సార్లు ఓడిపోయాడు. కాంగ్రెస్‌లో ఎందుకు ఎంరూ.ఎంకు విచ్చేయండిఅంటూ సూచించారు. చంద్రబాబు.. బిల్‌క్లింటన్‌ను కలిశావు.. ఎందరో మందిని కలిశావు. చివరకు మోడీని కలుస్తున్నావు నీ పార్టీ ఖాళీ అవుతుంది. సైకిల్ పైనుంచి అందరు దిగి కారులోకి వెళ్తున్నారు. ఇకనైనా కళ్లు తెరవాలని హితబోధ చేశారు. నగరానికి ఏమి అభివృద్ధి చేశాడో.. ఎంత రక్షణ కల్పించాడో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేను అడుగండి అని సభికులను ఉద్దేశించి అసదుద్దీన్ అన్నారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల నిర్మించడం హర్షణీయమైనప్పటికీ పండ్ల దుకాణాలను ఎత్తివేసి వ్యాపారుల పొట్టగొట్టడం బాధాకరమన్నారు. సభలో యాకత్‌పూర ఎమ్మెల్యే భాషాఖద్రీ, రాష్ట్ర నాయకులు , నగర అధ్యక్షులు ఎం.ఎ.ఫహిమ్, కైసర్ , మోహిస్, పాషా, జావిద్, ఉసెన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బల్దియాలో పాగా వేయాలి
Published Thu, Mar 6 2014 3:27 AM | Last Updated on Tue, Oct 16 2018 7:27 PM
Advertisement
Advertisement