Department of Municipal Administration
-
పురపాలకశాఖకు..రూ.15,594 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో పురపాలక శాఖకు భారీగా నిధులు దక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రూ.15,594 కోట్లు కేటాయించారు. 2023–24 బడ్జెట్లో కేటాయించింది రూ.11,372 కోట్లే. కాగా ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో హైదరాబాద్‌లో చేపట్టే అభివృద్ధి పనులకే అత్యధికంగా రూ. 10వేల కోట్లు ప్రకటించడం గమనార్హం. రానున్న మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ గ్రేటర్ హైదరాబాద్‌కు భారీగా నిధులు కేటాయించారన్న వాదన ఉంది.హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం స్పెషల్ ఫోకస్ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే పలు ప్రతిపాదనలు చేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీలను కలిపి జీహెచ్ ఎంసీ పరిధిలోకి తేవాలని సీఎం ఆలోచన. ఈ పరిధిలోనే రాబోయే పదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేయాలని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ప్రతిపాదించారు.ఇందులో మూసీ రివర్ ఫ్రంట్, నాలాల అభివృద్ధి, మెరుగైన నీటిసరఫరా, మెట్రో విస్త రణ, ఓఆర్ఆర్కు ఇరువైపులా అభివృద్ధి, హైడ్రా ప్రాజె క్టుతో పాటు రీజినల్ రింగ్‌రోడ్డు(ఆర్ఆర్ఆర్) వంటివి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపో యినా, రాష్ట్ర ప్రభుత్వం తరపున అయినా ఈ అభివృద్ధి పనులు కొనసాగించాలని నిర్ణయించినట్టు రెండురోజుల క్రితం తన నివాసంలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.ఇందులో భాగంగానే ఈ 2024–25 బడ్జెట్లో కేవలం హైదరాబాద్ అభివృద్ధికే రూ. 10వేల కోట్లు కేటాయించారు. వచ్చే జనవరినాటికి హైదరాబాద్ శివారు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పాలకమండళ్ల పదవీకాలం ముగియనుంది. ఏడాదిన్న రలో జీహెచ్ఎంసీ పదవీకాలం కూడా ముగియనున్న నేప థ్యంలో ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని పాలకమండళ్ల పరిధి నిర్వహణకు ఎలాంటి ప్రణాళికలు చేయాలనే అంశంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఓఆర్ఆర్ లోపల అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఈ ఏడాదిలో వెచ్చించనున్నట్టు స్పష్టమవుతోంది.ఇతర జిల్లాల్లోని పురపాలికలకు...హైదరాబాద్, రంగారెడ్డి పాత ఉమ్మడి జిల్లాలు మినహా మిగతా 8 ఉమ్మడి జిల్లాల్లోని పురపాలక సంస్థల్లో రూ. 5,594 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోప్రధానమైన 100 మునిసిపాలి టీలతో పాటు పాత కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లపై ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం. పౌరసరఫరాల శాఖకు రూ.3,836 కోట్లుసాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పౌరసరఫరాల శాఖకు రూ.3,836 కోట్లు కేటాయించారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2022–23లో ఈ శాఖకు రూ.2,213 కోట్లు కేటాయించగా.. 2023–24లో రూ.3,001 కోట్లు కేటాయించారు. ఈ సారి గత సంవత్సరం కన్నా రూ.835 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం.రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ.723 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని 39.33 లక్షల కుటుంబాలకు ప్రతి గ్యాస్ సిలిండర్‌పై రూ.500 చొప్పున సబ్సిడీగా ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంవత్సరానికి 3 సిలిండర్లకు రూ.500 చొప్పున సబ్సిడీ ఇస్తే రూ.590 కోట్లు ఖర్చవుతాయి. అదే 4 సిలిండర్లు ఇస్తే రూ.786 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.అటవీశాఖకు రూ.1,063 కోట్లుహైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు సంబంధించి రూ.1,063.87 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో అటవీ, పర్యావరణ శాఖలోని వివిధ అంశాలకు చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి. పీసీసీఎఫ్, హెచ్‌వోడీకి శాఖాపరంగా పలు విధుల నిర్వహణకు సంబంధించి రూ.876 కోట్లు (రూ.162.13 కోట్లు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కలిపి) ప్రతిపాదించారు. ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు రూ.102.99 కోట్లు, జూపార్కులకు రూ.12 కోట్లు, అఫారెస్టేషన్ ఫండ్ రూ.5 కోట్లు, ప్రాజెక్ట్ టైగర్‌కు రూ.5.21 కోట్లు ప్రతిపాదించారు.ఇంధన శాఖకు రూ.16,410 కోట్లుసాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంధన శాఖకు బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. 2023–24లో శాఖకు రూ.12,727 కోట్లను కేటా యించగా, 2024–25 బడ్జెట్లో రూ.16,410 కోట్లకు కేటాయింపులను ప్రభుత్వం పెంచింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇతర కేటగిరీలకు రాయితీపై విద్యుత్ సరఫరాకు గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ రూ.8,260 కోట్లను కేటాయించింది.ఉదయ్ పథకం కింద రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల రుణాలను ప్రభుత్వం టేకోవర్ చేసుకోవడానికి గతేడాది రూ.500 కోట్లను కేటాయించగా, ఈసారి రూ.250 కోట్లకు తగ్గించింది. ప్రతి నెలా పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు అమల్లోకి తెచ్చిన గృహ జ్యోతి పథకానికి మరో రూ.2418 కోట్లను కేటాయించింది. ట్రాన్స్‌కో, డిస్కంలకు ఆర్థిక సహాయం కింద రూ.1509.40 కోట్లను కేటాయించింది. గత ఐదు నెలల్లో గృహ జ్యోతి పథకం అమలుకు రూ.640 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే డిస్కంలకు చెల్లించింది. ఈ పథకం కింద 46,19,236 కనెక్షన్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తోంది. -
మెగా హెచ్ఎండీఏ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ను రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఏడు జిల్లాల్లో ఏడువేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హెచ్ఎండీఏ సుమారు పదివేల చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సచివాలయంలో పురపాలక శాఖ, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి కొత్తగా రానున్న ఆర్ఆర్ఆర్ మధ్య ఉండే ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకుని రావాలని ఆదేశించారు. రెండు రింగ్ రోడ్లను అనుసంధానించేలా రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఓఆర్ఆర్ లోపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా, ఆర్ఆర్ఆర్ లోపు ఉన్న ప్రాంతాన్ని మరో యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన సిటీతో పాటు కొత్తగా విస్తరిస్తున్న శివారు మునిసిపాలిటీల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. మాస్టర్ ప్లాన్– 2050కి అనుగుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీతో సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాలని ఆదేశించారు. ఆమ్రపాలికి ‘టోల్ నివేదిక’ బాధ్యత ఓఆర్ఆర్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని హెచ్ఎండీఏ అధికారులను సీఎం ఆదేశించారు. కనీస రేటు నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని ప్రశ్నించారు. టెండర్లలో ఏయే సంస్థలు పాల్గొన్నాయి? అవకతవకల్లో ఎవరెవరి ప్రమేయముంది? తదితర అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని చెప్పారు. టెండర్లకు అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరు, జరిగిన అవకతవకలపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని ఆదేశించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏవైనా మిస్సయినట్లు గుర్తిస్తే.. వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినెట్లో చర్చించి, టెండర్ల వ్యవహారంపై సీబీఐ లేదా అదే స్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టెండర్ విధానంతో రూ.15 వేల కోట్లకు పైగా నష్టం! టెండర్లకు ముందు ఓఆర్ఆర్పై టోల్ కింద ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు సీఎంకు వివరించారు. అలాంటప్పుడు 30 ఏళ్లకు రూ.18 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని కానీ కేవలం రూ.7,380 కోట్లకు ఐఆర్బీ కంపెనీకి ఎలా అప్పగించారని రేవంత్ ప్రశ్నించారు. హెచ్ఎండీఏ అనుసరించిన టెండర్ విధానంతో ప్రభుత్వం రూ.15 వేల కోట్లకు పైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమికంగా అంచనా వేశారు. హెచ్ఎండీఏ రెండు కంపెనీలతో డీపీఆర్ తయారు చేయించగా, ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డీపీఆర్‌ను ఎంచుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయిస్తేనే నిజాలు బయటకు వస్తాయని సీఎం పేర్కొన్నారు. టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్‌ను చూపించి 49 శాతం వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని, విదేశీ కంపెనీలతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటల్ని పరిరక్షించాలి హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటలను పరిరక్షించాలని, అలాగే ల్యాండ్ పూలింగ్ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హెచ్ఎండీఏ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, డిజిటల్, జీపీఎస్ విధానాలతో ఎక్కడ ఎంత స్థలముందో మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. ల్యాండ్ పార్శిల్స్, చెరువులు, కుంటలు ఆక్రమణకు గురి కాకుండా ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. డీఐజీ స్థాయిలో ఒక ఐపీఎస్ అధికారిని నియమించాలని, ఇద్దరు ఎస్పీ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. కాగా హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 8,374 ఎకరాల ల్యాండ్ పార్శిళ్లు ఉంటే.. అందులో 2,031 ఎకరాల పార్శిళ్లు వివిధ స్థాయిల్లో కోర్టు కేసుల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ‘కమ్యూనిటీ’ స్థలాలపై తక్షణ సర్వే హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్ తదితర పట్టణాల లే అవుట్లలో కమ్యూనిటీ అవసరాలకు ఇచి్చన స్థలాలు తమ అ«దీనంలోనే ఉన్నాయా? లేక ఆక్రమణకు గురయ్యాయా? వెంటనే సర్వే చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పాఠశాలల ఏర్పాటుకు ముందుకొచ్చే కార్పొరేట్ కంపెనీలు, పేరొందిన పాఠశాలల యాజమాన్యాలకు వీటిని అప్పగించాలని సూచించారు. స్థానికులైన పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా కనీసం 25 శాతం అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పారు. ప్రపంచ స్థాయి టూరిస్ట్ ప్లేస్‌గా హుస్సేన్‌సాగర్ పరిసరాలు హుస్సేన్‌సాగర్‌పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరమైన, అందమైన జోన్‌గా తీర్చిదిద్దాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఇటు అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ పార్కు, తెలంగాణ అమరుల జ్యోతి నుంచి అటు నెక్లెస్ రోడ్డు, ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు వరకు ఉన్న మొత్తం ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి సందర్శనీయ ప్రాంగణంగా తయారు చేయాలని సూచించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలిగించాలన్నారు. దుబాయ్ తరహాలో స్కై వాక్ వే, ఫుడ్ స్టాళ్లు, చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ జోన్, గ్రీనరీ, ల్యాండ్ స్కేప్లను అభివృద్ధి చేయాలని సూచించారు. అవసరమైతే ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలను మరో రూట్‌కు మళ్లించి పర్యాటక జోన్‌గా మార్చాలని చెప్పారు. వెంటనే అంతర్జాతీయ స్థాయి కన్సెల్టెన్సీలతో ఈ ప్రాజెక్టు నమూనాలు తయారు చేయాలని ఆదేశించారు. సీఎస్ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
‘టౌన్ ప్లానింగ్’ శివబాలకృష్ణ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు దొరికిన పురపాలక శాఖ పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగం ఉన్నతాధికారి శివబాలకృష్ణ ఆస్తులు లెక్కకు మించి బయటపడుతున్నాయి. సోదాల్లో గుర్తించిన ఆస్తుల విలువను మదింపు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. గురువారం ఆయనను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వచ్చే నెల 8వరకు రిమాండ్ విధించడంతో.. చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక బాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించిన మూర్తి, సత్యంల కోసం గాలిస్తున్నారు. శివబాలకృష్ణ అవినీతి, అక్రమాల సంపాదనతో నాలుగైదు ప్రాంతాల్లో వంద ఎకరాల వరకు వ్యవసాయ భూమి, ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేశారని పురపాలక శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వాటి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు ఐదు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సుమారు రెండు కిలోల బంగారం.. కోటి నగదు.. శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో స్థిరాస్తి పత్రాలను అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్‌లో విల్లాలు, ఫ్లాట్లు, నగర శివారు ప్రాంతాల్లో భారీగా భూముల పత్రాలు వీటిలో ఉండటం గమనార్హం. మొత్తంగా వంద ఎకరాల వరకు ఈ భూములు ఉన్నట్టు తెలిసింది. వీటితోపాటు కోటి వరకు నగదు, దాదాపు రెండు కిలోల బంగారు ఆభరణాలు, ఆరు కిలోలకుపైగా వెండి వస్తువులు, 80కిపైగా అత్యంత ఖరీదైన వాచీలు, పదుల సంఖ్యలో ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లను కూడా అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. ఇంకా బ్యాంకు లాకర్లను తెరిస్తే ఇంకా ఎంత స్థాయిలో ఆస్తులు బయటపడతాయోనని అధికారులు పేర్కొంటున్నారు. బినామీల పేరిట భూములు సోదాల్లో కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాల స్థిరాస్తి భూముల పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటిలో చాలా వరకు బినామీల పేరిట ఉన్నట్టు చెప్తున్నారు. బినామీలుగా వ్యవహరించిన సత్యం, మూర్తి కోసం అధికారులు గాలిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో, మరో 16 చోట్ల జరిపిన దాడుల్లో ఇప్పటివరకు స్థిరాస్తులు, చరాస్తుల డాక్యుమెంట్లలోని ప్రభుత్వ విలువ ప్రకారం రూ.8.26 కోట్ల ఆస్తులను గుర్తించినట్టు ఏసీబీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో ఎన్నోరెట్లు అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా ఆస్తుల మదింపు జరుగుతోందని తెలిపారు. సోదాల్లో రూ.99,60,850 నగదు, 1,988 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆరు కిలోల వెండి ఆభరణాలు/వస్తువులు, డాక్యుమెంట్ల లెక్కల ప్రకారం రూ.5,96,27,495 విలువైన స్థిర, చరాస్తులను గుర్తించినట్టు తెలిపారు. బాలకృష్ణను అరెస్టు చేసి ఏసీబీ కోర్టు అదనపు స్పెషల్ జడ్జి ముందు హాజరుపర్చినట్టు వివరించారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులకు సంబంధించి ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని సమాచారం ఇవ్వాలని కోరారు. పుర ‘ప్లానింగ్’ అంతా ఆయనదే! ♦ విధానాల రూపకల్పనలో చక్రం తిప్పిన శివబాలకృష్ణ ♦ ఆయన కోసం పురపాలక శాఖలో డైరెక్టర్ (ప్లానింగ్) పోస్టు సృష్టి ♦ హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రో రైల్ విధాన నిర్ణయాల్లో ప్రభావం ♦ రెరా నిబంధనలు, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, టీఎస్–బీపాస్ల రూపకల్పనలోనూ కీలక పాత్ర ♦ అనుమతులు, మినహాయింపులు, అలైన్మెంట్ మార్పుల పేరిట అవినీతి ♦ శివబాలకృష్ణ ఏసీబీకి చిక్కడంపై రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్ర చర్చ సాక్షి, హైదరాబాద్: ఏసీబీకి చిక్కి అరెస్టయిన హెచ్ ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ.. రాష్ట్ర అర్బన్ ప్లానింగ్ పాలసీల రూపకల్పనలో చక్రం తిప్పారని పురపాలకశాఖ వర్గాలు చెప్తున్నాయి. పట్టణ ప్రణాళి కకు సంబంధించిన విధానాల రూపకల్పన, రచన (డ్రాఫ్టింగ్)లో దిట్టకావడంతో ఆయన హవా కొన సాగిందని అంటున్నాయి. 2014లో రాష్ట్ర సచివాల యంలోని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో డైరెక్టర్ (ప్లానింగ్) పేరుతో కొత్త పోస్టును సృష్టించి మరీ ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించ డం గమనార్హం. దీనితో ఆయన హెచ్ఎండీఏ, జీహె చ్ఎంసీ, హైదరాబాద్ మెట్రోరైల్, భూవిని యోగ మార్పిడి, ఎలివేటెడ్ కారిడార్లు, ఆకాశ హర్మ్యాలు, మాస్టర్ ప్లాన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ స్థాయి లో విధానపర నిర్ణయాలు తీసుకోవ డంలో కీలకంగా వ్యవహరించారు. పురపాలక శాఖ లో ఈ వ్యవ హారాలను పర్యవేక్షించే కీలకమైన ప్లానింగ్–1, ప్లానింగ్–2, ప్లానింగ్–3 అనే మూడు సెక్షన్లకూ శివ బాలకృష్ణ మకుటం లేని మహా రాజుగా వ్యవహరించారని.. హెచ్ఎండీఏ డైరెక్టర్ (ప్లానింగ్)గా ఆ సంస్థ అంతర్గత వ్యవహారాల్లోనూ ప్రభావం చూపి నట్టు చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే ఆయ న పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడి ఆస్తులు పోగే సుకున్నట్టు ఆరోపణలు విని పిస్తున్నాయి. శివబాల కృష్ణ ఇంట్లో సోదాల్లో లభించిన విలువైన వాచీలు, సెల్ఫోన్లు, ఆభరణాలు వంటివన్నీ బహుమతు లుగా అందుకున్నవేనని పురపాలక శాఖలో చర్చ జరుగుతోంది. కీలక విధాన నిర్ణయాలన్నీ.. గత పదేళ్లలో రాష్ట్ర పురపాలక శాఖ తీసుకొచ్చిన పాలసీల రూపకల్పనలో శివబాలకృష్ణ ముఖ్యపాత్ర పోషించారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ముఖ్యమైన తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యు లేషన్ అథారిటీ (టీఎస్ రెరా) నిబంధనలను సైతం శివబాలకృష్ణ రూపొందించారు. ఈ క్రమంలో రెరా అమల్లోకి వచ్చిన తేదీ నాటికే నిర్మాణం ప్రారంభమైన ప్రాజెక్టులకు మినహాయింపు ఇచ్చి, బిల్డర్లకు ప్రయోజనం కల్పించినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇక అనుమతి లేని కట్టడాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం సర్కారు తెచ్చిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ల జీవోలు శివబాలకృష్ణ ఆధ్వర్యంలోనే సిద్ధం చేశారు. టౌన్షిప్ పాలసీ, పొడియం పార్కింగ్ పాలసీ, పార్కింగ్ ఫీజు విధానం, సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో భవన అనుమతుల జారీ కోసం తెచ్చిన టీఎస్–బీపాస్ పాలసీ, కూల్‌రూఫ్ పాలసీ, రాష్ట్ర బిల్డింగ్ రూల్స్ (జీవో 168)కు సవరణలతో వేర్వేరు సందర్భాల్లో జారీ చేసిన జీవోలు, లేఅవుట్ రూల్స్‌కు సవరణలతో వేర్వేరు సందర్భాల్లో ఇచ్చిన జీవోలను సైతం ఆయన నేతృత్వంలోనే రూపొందించినట్టు పురపాలక శాఖ వర్గాలు చెప్తున్నాయి. దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టి.. హెచ్ఎండీఏ, ఇతర పట్టణాల మాస్టర్ ప్లాన్లకు సవ రణలు/మినహాయింపులు, మాస్టర్ ప్లాన్ల నుంచి రోడ్లను తొలగించడం/పార్కులను మార్చడం, హెచ్ఎండీఏ పరిధిలో భూవినియోగ మార్పిడి దర ఖాస్తుల పరిష్కరణ, హెచ్ఎండీఏ పరిధి విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్, ఓఆర్ఆర్ వ్యవహారాలు, ఆకాశహర్మ్యాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిబంధ నల మినహాయింపులు, భారీ రియల్ ఎస్టేట్ ప్రాజె క్టులు/గేటెడ్ సొసైటీలు/టౌన్‌షిప్‌ల నిర్మాణానికి అనుమతులు, మెట్రో అలైన్మెంట్ మార్పులు వంటి అంశాల్లోనూ శివబాలకృష్ణ కీల కంగా వ్యవహ రించారని సమాచారం. ఈ క్రమంలో ఆయా అంశాల్లో అనుమతులు, మినహాయింపులు కోరుతూ వచ్చే దరఖాస్తులను పెండింగ్ ఉంచేవా రని.. కొన్నింటికి మాత్రమే వేగంగా పురపాలకశాఖ నుంచి అనుమతులు లభించేవని విమర్శలు ఉన్నా యి. ఈ క్రమంలోనే భారీగా సొమ్ము, బహుమ తులు అందుకునేవారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వాలంతరీ ‘రియల్ ఎస్టేట్స్’
సాక్షి, హైదరాబాద్: నీరు, భూమి యాజమాన్య శిక్షణా పరిశోధన సంస్థ (వాలంతరీ) భూములను నీటిపారుదల శాఖ అమ్మకానికి పెడుతోంది. వాలంతరీతో పాటు తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ పరిశోధనశాల (టీఎస్ఈఆర్ఎల్)కు చెందిన 300 ఎకరాలను ప్లాట్లుగా చేసి అమ్మాలని, దీనిపై రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ఈ మేరకు భూములను అమ్మేందుకు పురపాలక శాఖకు ఆ భూములను అప్పగించాలని యోచిస్తోంది. వాస్తవానికి వాలంతరీ, టీఎస్ఈఆర్ఎల్కు హిమాయత్‌సాగర్, ప్రేమావతిపేట, కిస్మత్పురాలలో 217.15, 224.52 ఎకరాల చొప్పున భూములున్నాయి. ఇందులో వాలంతరీ, టీఎస్ఈఆర్ఎల్ కార్యాలయాలు పోను మిగిలిన భూములను అమ్మేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ భూములను మున్సిపల్ శాఖ ద్వారా హెచ్ఎండీఏకు బదిలీ చేస్తే, ఆ సంస్థ ఎకరాకు 2,900 గజాల స్థలాన్ని అమ్మకానికి పెట్టి అమ్మనుందని సమాచారం. రుణాలు తీసుకునే వెసులుబాటుపై కేంద్రం ఆంక్షలు విధించిన నేపథ్యంలో సొంతవనరుల ద్వారా రాబడులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఇప్పటిదాకా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని భూములను అమ్మకానికి పెట్టింది. కానీ, తొలిసారిగా నీటిపారుదల శాఖకు చెందిన భూములను ఆదాయ టార్గెట్‌గా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుండటం గమనార్హం. -
వరంగల్‌లో ఆధునిక బస్టాండ్
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో సరికొత్త, ఆధునిక బస్టాండ్ నిర్మితం కానుంది. ప్రస్తుతం పట్టణంలో ఉన్న పాత బస్టాండ్‌ను కూల్చివేసి, దానికి పక్కనే ఉన్న వరంగల్ నగరపాలక సంస్థ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)లకు చెందిన స్థలాలను కూడా కలిపి 2.32 ఎకరాల స్థలంలో, రూ.75 కోట్ల వ్యయంతో ఐదు అంతస్తుల్లో కొత్త బస్టాండ్ నిర్మించనున్నారు. కేవలం బస్సులు ఆగే ప్రాంగణంగానే కాకుండా, భారీ వాణిజ్య సముదాయంగా, భవిష్యత్తులో వరంగల్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు సాకారమైతే దానితో అనుసంధానించేందుకు వీలుగా దీనిని నిర్మించాలని నిర్ణయించారు. శుక్రవారం బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్‌లు దీని ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. పురపాలక శాఖ నిధులతో.. పురపాలక శాఖ నిధులతో ఈ బస్టాండ్‌ను నిర్మించనున్నారు. వాహనాల పార్కింగ్‌కు భారీ సెల్లార్, బస్సులు నిలిపేందుకు 32 ప్లాట్‌ఫామ్స్, సమీపంలో ఉన్న వరంగల్ రైల్వే స్టేషన్‌కు స్కైవాక్‌తో అనుసంధానం, ఎస్కలేటర్లు, వాణిజ్య సముదాయాలు, రెస్టారెంట్లతో ఈ భారీ భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. ఒకవేళ మెట్రోతో అనుసంధానిస్తే ఎలాంటి ఏర్పాట్లు అవసరమో, నాగ్‌పూర్ మెట్రో అధికారులతో సంప్రదించినట్టు బాజిరెడ్డి వెల్లడించారు. అలాగే రైల్వేతో అనుసంధానంపై ఆ శాఖ అధికారులతో చర్చిస్తున్నామన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్‌తో చర్చల నేపథ్యంలో, పురపాలక శాఖ నిధుల విడుదలకు మార్గం సుగమమైనట్లు తెలిపారు. సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అజిత్‌రెడ్డి, ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, వినోద్, చీఫ్ ఇంజనీర్ రామ్‌ప్రసాద్, వరంగల్ ఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. -
శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ
గార్బేజ్ స్టేషన్ల నిర్వహణలో అత్యుత్తమ విధానాలు పాటించాలి. ఆయా పట్టణాలు, నగరాల్లో చెత్తను, మురుగు నీటిని శుద్ధి చేసేందుకు ఇప్పటికే ఉన్న సౌకర్యాలు, వసతులు.. ఇంకా కల్పించాల్సిన సదుపాయాలపై నివేదిక తయారు చేయాలి. అవసరమైన వసతులు లేని చోట్ల వెంటనే కల్పించి సమర్థవంతంగా నిర్వహించాలి. మురుగునీటి శుద్ధి, వేస్ట్ మేనేజ్మెంట్లో ప్రతి మున్సిపాలిటీ నూరు శాతం పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ప్లెక్సీలను పూర్తిగా నిషేధించింది. నవంబర్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దీన్ని సంపూర్ణంగా అమలు చేసేందుకు సంబంధిత వ్యాపారులతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలి. వ్యాపారులు ప్లాస్టిక్ నుంచి వస్త్రం వైపు మళ్లేందుకు కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు వారికి రుణాలు ఇప్పించి అండగా నిలవాలి. ఇచ్చిన రుణాలను సకాలంలో చెల్లించే వారికి ప్రభుత్వం నుంచే వడ్డీ రాయితీ కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో పారిశుధ్యంపై మరింత దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. గార్బేజ్ స్టేషన్ల కారణంగా పరిసరాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏమాత్రం ఉండకూడదని, ఇలాంటి ప్రాంతాల్లో సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. చెత్త నిర్వహణలో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నామో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నగరాల్లో పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్మెంట్, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్తో పాటు సుందరీకరణ పనులు, పచ్చదనం పెంపు, టిడ్కో ఇళ్లు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ తదితర అంశాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే చేపట్టిన పనుల ప్రగతి, మెరుగైన ఫలితాలు వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి మున్సిపాలిటీలోను వేస్ట్ ప్రాసెసింగ్ ప్రక్రియ అమలు తీరుపై శ్రద్ధ పెట్టాలని చెప్పారు. అన్ని యూఎల్బీల్లోనూ (అర్బన్ లోకల్ బాడీస్) ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో ఉందా? లేదా? అన్నదానిపై సంబంధిత అధికారులు నిరంతరం పరిశీలించాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. టిడ్కో ఇళ్లు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌పై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్ కృష్ణా వరద గోడకు సుందరీకరణ ► ఏటా వచ్చే వరదలకు కృష్ణా నది పొంగి విజయవాడ నగర పాలక సంస్థలోని పలు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యేవి. ఈ ఇబ్బందులను తప్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం రిటైనింగ్ వాల్‌ను నిర్మించింది. ఈ నేపథ్యంలో ఈ గోడకు ఆనుకుని ఉన్న ప్రాంతాల నుంచి మురుగు నీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలి. రిటైనింగ్ వాల్ బండ్‌ను చెట్లు, విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దాలి. ► విజయవాడ నుంచి గన్నవరం విమనాశ్రయానికి వెళ్లే రహదారికి ఇరువైపులా చేపట్టిన సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. అంబేడ్కర్ పార్కుకు వెళ్లే రోడ్లను సైతం అందంగా తీర్చిదిద్దాలి. విశాఖపట్నం నగరంలో సైతం సుందరీకరణ పనులు చేపట్టాలి. ► వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను బాగు చేయండి. మళ్లీ డ్రైవ్ చేపట్టి, మే 31 నాటికి అన్ని రోడ్లనూ బాగు చేయాలి. జగనన్న కాలనీల్లో నీరు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం ► ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కాలనీల నిర్మాణం పూర్తయ్యేలోగా వాటిలో మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలి. ప్రాధాన్యత క్రమంలో నీరు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసి తర్వాత మురుగు నీటి శుద్ధి కేంద్రాలను అందుబాటులోకి తేవాలి. ► రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లపై అధికారులు శ్రద్ధ పెట్టాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక లే అవుట్‌ను తీర్చిదిద్దాలి. ఈ పనుల ప్రగతిపై ఉన్నతాధికారులు జిల్లాల వారీగా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించాలి. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష కార్యక్రమం పట్టణ ప్రాంతాల్లో చేపట్టడంపై దృష్టి సారించాలి. ► వైఎస్సార్ చేయూత లబ్ధిదారుల్లో సాధికారిత కోసం కృషి చేయాలి. ఏటా 45 ఏళ్లు నిండిన మహిళల్లో అర్హత ఉన్న వారికి ఈ పథకం కింద నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేయాలి. ఈ డబ్బుతో వారు స్వయం ఉపాధి పొందేలా తగిన చర్యలు తీసుకోవాలి. అర్హత సాధించిన తొలి ఏడాదిలోనే వారికి స్వయం ఉపాధి మార్గాలు చూపించడం ద్వారా వారిలో సంపూర్ణ సాధికారితకు కృషి చేయాలి. ► ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీ లక్ష్మీశా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ముంపు ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలు బంద్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వరద ముంపునకు గురైన వెంచర్లు, ఖాళీ స్థలాల్లో భవిష్యత్తులో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని మున్సిపల్ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఈ మేరకు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీల శివార్లలోని అనేక నివాసాలు నీటమునిగాయి. హెచ్ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్లలోని నిర్మాణాలకు, ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరించుకున్న ప్లాట్లలో అనుమతుల విషయంలో ఎలాంటి నిబంధనలను అమలు చేయాలనే విషయమై పురపాలక శాఖ కసరత్తు చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. చెరువులు, కుంటల్లోనే పట్టణాలు! గతనెలలో భారీవర్షాల వల్ల పట్టణాల్లో ని ఏయేప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయనే విషయమై పురపాలక శాఖ నివేదిక రూపొందించినట్లు తెలియవచ్చింది. అందుకు గల కారణాలను కూడా పేర్కొన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ శివార్లలో మొన్నటివరకు గ్రామ పంచాయతీలుగా ఉన్న ప్రాంతాలన్నీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలుగా మారాయి. చెరువులు, కుంటలుగా ఉన్న ప్రాంతాలు పూడుకుపోయిన చోట్ల, శిఖం భూములుగా ఉన్న ప్రాంతాల్లోనే పట్టణాలు విస్తరించినట్లు అధికారులు నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది. ఆయా ప్రాంతాలకు ఆనుకొని కొత్తగా ఏర్పాటైన వెంచర్లు కూడా ముంపు ప్రాంతాలుగా నే ఉన్నట్లు పురపాలక శాఖ నిర్ణయానికి వచ్చింది. -
గుంటూరులో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన
-
వేతనాలు పెంచలేం!
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికుల వేతనాలను ప్రభుత్వం పెంచితే తాము చెల్లించలేమని పురపాలికలు చేతులెత్తేశాయి. ప్రస్తుత వేతనాలనే మూడు, నాలుగు నెలలకోసారి కార్మికులకు చెల్లిస్తున్నామని, ఈ పరిస్థితిలో వేతనాలు పెంచితే చెల్లించడం సాధ్యం కాదని తేల్చాయి. ఆదివారం రామగుండంలో రాష్ట్ర మునిసిపల్ మేయర్లు, చైర్పర్సన్ల సంఘం అధ్యక్షుడు, కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ నేతృత్వంలో మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మునిసిపాలిటీల చైర్పర్సన్లు, మునిసిపల్ కమిషనర్లు సమావేశమై పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపునకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. మునిసిపల్ పారిశుధ్య కార్మికుల వేతనాలను పెంచకపోతే ఈనెల 31 తర్వాత ఏ క్షణం నుంచైనా రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ కార్మిక సంఘాల జేఏసీ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో పురపాలక మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఈ సమావేశం నిర్వహించారు. సానుకూలంగా ఉన్నాం పురపాలక మంత్రి కె.తారకరామారావుతో త్వరలో సమావేశమై మునిసిపల్ పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపు ప్రతిపాదనలను సమర్పిస్తామని సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు. కార్మికుల వేతనాల పెంపు అంశంపై సానుకూలంగా ఉన్నామని, త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -- రవీందర్ సింగ్ ప్రభుత్వమే పెంచాలి మునిసిపల్ కార్మికులకు జీవో నం.14 ప్రకారం వేతనాలు పెంచే అధికారం ప్రభుత్వానిదేనని తెలంగాణ మునిసిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఖమర్ అలీ, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ స్పష్టం చేశారు. కార్మికుల వేతనాలను మునిసిపాలిటీలే పెంచుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించడం సరి కాదన్నారు. ప్రభుత్వమే వేతనాల పెంపు నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ఈనెల 31 తర్వాత ఏ క్షణం నుంచైనా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. -- ఖమర్ అలీ, పాలడుగు భాస్కర్ ఆదాయం అంతంత మాత్రమే.. జీహెచ్ఎంసీ తరహాలో రాష్ట్రంలోని మిగతా 72 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పారిశుధ్య కార్మికుల వేతనాలను రూ.14 వేలకు పెంచే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మొత్తం 72 పురపాలికల్లో 16 వేల మంది కార్మికులు పని చేస్తుండగా, వారి వేతనాలను రూ.8,300 నుంచి రూ.14 వేలకు పెంచితే ఏటా రూ.75 కోట్ల అదనపు భారం పడనుంది. పురపాలికలకు పన్నులు, ఇతర రుసుముల ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉందని, వేతనాలు పెంచితే పడే భారాన్ని 70 శాతం పురపాలికలు భరించే పరిస్థితిలో లేవని తేల్చారు. చివరిసారిగా 2011లో కార్మికుల వేతనాలు పెంచిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ వేతనాల పెంపు ఆవశ్యకత ఏర్పడిందని, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్థిక చేయూ త అందిస్తేనే ఇది సాధ్యమవుతుందని మేయర్లు, చైర్పర్సన్లు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కార్మికుల వేతనాల పెంపుపై ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉంచాలని నిర్ణయించారు. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల మధ్య ఉన్న ఆర్థిక అంతరాల మేరకు ఆయా సంస్థల కార్మికుల వేతనాలను వేర్వేరుగా పెంచాలని ఓ ప్రతిపాదన రూపొందించారు. ప్రభుత్వం సహాయం చేసేందుకు ముందుకు వస్తే కార్మికుల వేతనాలను రూ.14 వేలకు పెంచాలని మరో ప్రతిపాదన సిద్ధం చేశారు. చివరగా కార్మికుల వేతనాలను కనీసం రూ.12 వేలకు పెంచాలని, ఇందుకు ప్రభుత్వ సహాయం కోరాలని నిర్ణయించారు. -
ఖజానాకు గండి
20 ఏళ్లుగా అవే అద్దెలు మూడేళ్లకోసారి పెంచాలన్న నిబంధనలు బుట్టదాఖలు పట్టించుకోని పాలకవర్గం, అధికార యంత్రాంగం రూ.లక్షల్లో పేరుకుపోయిన బకాయిలు వికారాబాద్ మున్సిపాలిటీలో మారని తీరు ప్రైవేట్ భవనాలను అద్దెకిచ్చినప్పుడు సదరు యజమాని ఏటా ఎంతో కొంత అద్దెను పెంచడం షరా మామూలే. ప్రభుత్వ భవనాల విషయానికి వస్తే మాత్రం ఏళ్ల తరబడి పాత అద్దెలతోనే కొనసాగుతున్నాయి. అడిగేవారు లేకపోవడం, ప్రభుత్వ ఆస్తి కదా అన్న నిర్లిప్త వైఖరితో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. వికారాబాద్ మున్సిపల్ ఖజానాకు కోట్లలో రావాల్సి ఉండగా లక్షల్లో కూడా రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణాలను విడతల వారిగా 1996లో అప్పుడు మున్సిపల్ చైర్మన్ గా ఉన్న ఇప్పటి ఎమ్మెల్యే సంజీవరావు హయాంలో నిర్మించారు. పురపాలక సంఘానికి సంబంధించి పట్టణంలో మొత్తం 103 దుకాణాల వరకు ఉన్నాయి. డీసీఎంఎస్ ఎదురుగా బస్టాండ్‌కు వెళ్లే దారిలో 44 ఉండగా కూరగాయల మార్కెట్ స్థలంలో మిగతా దుకాణాలున్నాయి. వీటి అద్దెలను అప్పట్లో రూ.600 నుంచి రూ.2,848 వరకు నిర్ణయించారు. మున్సిపల్ అధికారులు కొన్ని దుకాణాలకు మాత్రమే రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు అడ్వాన్స్ గా తీసుకున్నారు. మున్సిపల్ గెజిట్‌లో ప్రతి మూడేళ్లకోసారి అద్దెలను పెంచాలన్న నిబంధన ఉన్నా యంత్రాంగం అమలు చేసిన దాఖలాలు లేవు. అప్పట్లో నిర్ణయించిన అద్దెలనే నేటికీ కొనసాగిస్తున్నారు. పెండింగ్‌లో అద్దెలు.. పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయానికి సంబంధించిన దుకాణాల అద్దెలు ఒక్కో దానికి రూ.10 వేల నుంచి రూ.23 వేల వరకు ఉంటే మున్సిపల్‌కు చెందిన దుకణాల అద్దెలు మాత్రం రూ.3వేలు మించడం లేదు. ఈ అద్దెను సైతం మున్సిపల్ అధికారులు నెలనెలా సక్రమంగా వసూలు చేయకపోవడంతో సుమారు రూ.18 లక్షల వరకు మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అద్దెలు పెండింగ్‌లో పడిపోయాయి. ఈ విషయంలో ఇటు పాలకపక్షం కాని, అటు అధికారయంత్రాంగం కానీ స్పందించకపోవడంపై స్థానికంగా విమర్శలు ఉన్నాయి. ఒక్కో దుకాణానికి కనీసం రూ.6 వేలు అద్దె నిర్ణయించినా 103 దుకాణాలకు సంబంధించి నెలకు సుమారు రూ.6లక్షలకు పైగా మున్సిపల్‌కు రాబడి వచ్చేది. ఏడాదికి రూ.74లక్షల పైచిలుకు ఖజానాకు చేరేదని అంటున్నారు. మంజీరా వాటర్, కరెంట్ బిల్లులు చెల్లించడానికే నానా అవస్థలు పడుతున్న పాలకపక్షం, అధికారయంత్రాంగం ఈ విషయంలో ఎందుకు దృష్టి సారించడం లేదోనని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి వెంటనే ప్రభుత్వ దుకాణాల అద్దెను నిర్ణయించి బహిరంగ వేలం (ఓపెన్ యాక్షన్) ద్వారా కేటాయించాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం: ఎంకేఐ అలీ, మున్సిపల్ కమిషనర్ కొంతమంది దుకాణాల నిర్వాహకులు కొన్నేళ్లుగా అద్దె చెల్లించడం లేదనే విషయం మా దృష్టికి కూడా వచ్చింది. సాధ్యమైనంత త్వరగా పాత అద్దెలను రద్దు చేసి బహిరంగ వేలం నిర్వహించి అద్దెలను సవరిస్తాం. బకాయి పడ్డ అద్దెలను సంబంధిత దుకాణాల నిర్వాహకుల నుంచి వసూలు చేయడానికి త్వరలో నోటీసులు జారీ చేస్తాం. చెల్లించకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. -
డెంగ్యూతో కార్మికుడు మృతి
వనపర్తి టౌన్ (మహబూబ్‌నగర్ జిల్లా) : వనపర్తి మునిసిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న గోర్ల చిన్న మన్యం(42) శుక్రవారం రాత్రి డెంగ్యూతో మృతిచెందాడు. మన్యానికి రెండు నెలల కిందట డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. దసరా పండుగకు ఇంటికి వెళదామని పట్టుబట్టడంతో రెండు రోజుల క్రితం వనపర్తికి తీసుకొచ్చారు. కాగా శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. అతడికి భార్య చెన్నమ్మ, ముగ్గురు కొడుకులు ఉన్నారు. -
కాంట్రాక్ట్ కార్మికుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: రెండు నెలల క్రితం విధుల నుం చి తొలగించడంతో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడు ఒకరు మనస్తాపానికిలోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ఎదుట గురువారం ఈ సంఘటన జరిగింది. వరంగల్ జిల్లా కొత్తపల్లికి చెందిన గ్యార ఉప్పలయ్య 20 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఉప్పలయ్యకు భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. అతను 15 ఏళ్లుగా ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. జీహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ పరిధిలోని సెవెన్‌హిల్స్ సొసైటీలో విధు లు నిర్వహిస్తున్నాడు. 2 నెలల క్రితం 30 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల నుంచి తొలగిం చారు. ఇలా తొలగించిన కార్మికులంతా గురువారం ఉప్పల్ సర్కిల్ ఇన్చార్జి డీసీ విజయకృష్ణతో మాట్లాడటానికి వచ్చారు. తన చేతుల్లో ఏమీ లేదని ఈ సందర్భంగా డీసీ వారికి చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన ఉప్పలయ్య సర్కిల్ కార్యాలయ ఆవరణలోనే వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకున్నాడు. దీనిని గమనించిన తోటి కార్మికులు అరవడంతో ఉప్పల్ పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అగ్గిపుల్లను అంటించుకునే లోపే ఉప్పలయ్య ఒంటిపై నీరుపోసి అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను స్కూల్ నుంచి గె ంటేస్తున్నారు ‘‘రెండు నెలల నుంచి ఇంటి అద్దెకట్టడం లేదు. పిల్లల స్కూల్ ఫీజులు కూడా చెల్లించలేదు. పిల్లలను స్కూల్ నుంచి గెంటేస్తున్నారు.. ఇంటి యజమాని గిన్నెలు బయటవే స్తానంటున్నాడు.. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నాం. 4 రోజులుగా పస్తులుంటున్నాం. ఈ బాధలు తట్టుకోలేక బతకడంకన్నా చావే నయం అనుకున్నా’’ - ఉప్పలయ్య -
ఉద్రిక్తం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్ ) : మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పో లీసులకు.. ఆందోళనకారులకు మధ్య తోపులా ట జరిగింది. ఈ తోపులాటలో ఇద్దరు కార్మికుల కు గాయాలు కావడంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని మంగళవారం మున్సిపల్ కార్మికులు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారు మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీగా గడియారం చౌరస్తా, పాతబస్టాండ్ మీదుగా తెలంగాణ చౌరస్తా చేరుకున్నారు. జిల్లాలోని అ న్ని మున్సిపాలీటిల నుంచి కార్మికులు ఈ ర్యాలీ లో పాల్గొన్నారు. తెలంగాణ చౌరస్తాలో గంట పాటు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఒ క్కసారిగా అడ్డంగా పెట్టిన బారికేడ్లను తోసుకు ని కలెక్టరేట్ వైపునకు వేళ్లేందుకు ప్రయత్నిం చారు. వారిని నిలువరించే క్రమంలో పోలీసుల కు.. కార్మికులకు మధ్య తీవ్ర తోపులాట జరి గింది. ఆందోళనకారులు పోలీసులను తోసుకు ని కలెక్టరేట్ వైపు వెళ్లారు. ఈ సమయంలో బా రికేడ్లతోపాటు ముండ్లకంచె తగిలి పలువురు మహిళా కార్మికులు కింద పడడంతో వారికి గా యాలయ్యాయి. అనంతరం కార్మికులు కలెక్టరే ట్ ప్రధాన గేట్ ముందు బైఠాయించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కార్మిక సంఘ నాయకులను అరెస్టు చేశారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు ఒక్కసారిగా గేట్‌ను తోసుకుని కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లి ప్రదాన ద్వారం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు అక్కడికి వచ్చిన డీఆర్ఓ భాస్కర్‌పై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేశారు. ఎంతకీ పరిస్థితి అదుపు కాకపోవడంతో టూటౌన్ ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో కార్మిక సంఘ నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. ఐదుగురికి గాయాలు మున్సిపల్ కార్మికులు చేపట్టిన చలో కలెక్టర్ కార్యాక్రమంలో పలుమార్లు పోలీసులకు కార్మికులు తీవ్రంగా తోపులాట జరిగింది. ఈ సమయంలో కార్మికులు యాదగిరి, వరలక్ష్మి, చంద్రకళ, గోపాలమ్మ, నాగమణి గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ కార్మికుల ఆందోళనకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, ఎమ్మార్పీఎస్, అంబేద్కర్ జాతర, మాలమహానాడు, టీడీపీ మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ 37 రోజులుగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ. 15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. కార్మికల సమస్యలను పరిష్కరించని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేవలం హైదరాబాద్‌లో పనిచేసే కార్మికులకుమాత్రమే జీతాలు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు పర్వతాలు, ఆంజనేయులు, కురుమూర్తి, చంద్రకాంత్, బాల్‌రెడ్డి, నర్సింహ, రాములు, బాల్‌రాజు, రాంమోహన్, వెంకటేశ్, అరుణ్‌కుమార్, శ్రీనివాస్, రమేష్, రాందాస్, రమేష్, కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
బాహాటంగా బెల్ట్‌షాపులు
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు పట్టణ శివారుతోపాటు గ్రామాల్లో విచ్చల విడిగా బెల్ట్ షాపులు వెలిశాయి. నిన్న మొన్నటి వరకూ చాటు మాటుగా విక్రయాలు చేస్తున్న బెల్ట్ నిర్వాహకులు గత వారం రోజుల నుంచి పబ్లిక్‌గా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ప్రొద్దుటూరు ఎక్సైజ్ పరిధిలో 22 మద్యం షాపులు, 8 బార్లు ఉన్నాయి. వాటిలో రాజుపాళెం మండలంలో ఒకటి, చాపాడులో రెండు, ప్రొద్దుటూరులో 19 షాపులు ఉన్నాయి. వాటిలో రెండు ప్రభుత్వ మద్యం షాపులు ఉన్నాయి. నిన్న దొంగ చాటుగా.. నేడు బాహాటంగా ఈ నెల 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ ప్రారంభమైంది. గతంలో మాదిరి కాకుండా ఈ సారి ప్రవేశపెట్టే మద్యం పాలసీ ద్వారా వైన్ షాపుల నిర్వహణలో పారదర్శకతను పాటిస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతూ వచ్చింది. అయితే గతంలో లాగానే ఈ సారి కూడా విచ్చల విడిగా బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారు. గ్రామాల్లోనూ, పట్టణ శివారులోనూ రెండు వారాలపాటు చాటు మాటుగా అనధికార విక్రయాలు జరిపిన వ్యాపారులు ఇప్పుడు బాహాటంగా విక్రయిస్తున్నారు. కొందరైతే బెల్ట్ షాపుల కోసం బంకులు ఏర్పాటు చేసుకున్నారు. పట్టణ శివారుతో పాటు ప్రొద్దుటూరు, రాజుపాళెం, చాపాడు మండలాల్లోని ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బెల్ట్ నిర్వాహకుల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లను కూడా ప్రధాన మద్యం షాపుల యజమానులు వసూలు చేస్తున్నారు. పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు డబ్బులు ఇచ్చాం.. వాళ్లు మీ గురించి పట్టించుకోరని మద్యం వ్యాపారులు బెల్ట్ షాపు నిర్వాహకులకు భరోసా ఇస్తున్నారు. దాడులు చేయడానికి సిబ్బంది లేరట.. సిబ్బంది తక్కువగా ఉండటం వల్లనే దాడులు చేయడం లేదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ప్రొద్దుటూరులో ఈ సారి కొత్తగా రెండు ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ షాపుల నిర్వహణకు గాను ప్రభుత్వం ఇంకా సిబ్బందిని నియమించలేదు. అందువల్లనే ఇక్కడ పని చేస్తున్న సిబ్బందే మద్యం షాపులను నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరు స్టేషన్లో సీఐ, ఎస్ఐలు మినహా 8 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. అయితే రెండు మద్యం షాపుల్లో ఇద్దరు చొప్పున కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు. ఒకరు ప్రతి రోజూ చలనా కట్టడానికి బ్యాంక్‌కు వెళ్తుంటారు. ఇలా ఐదు మంది సిబ్బంది షాపుల నిర్వహణ చూసుకోవాల్సి వస్తోంది. అందువల్లనే దాడులు చేయలేకపోతున్నామని అధికారులు సాకు చెబుతున్నారు. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోక పోవడంతో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఇటీవల వెంకటేశ్వరకొట్టాలలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై దాడి చేసి పెద్ద ఎత్తున మద్యం సీసాలను త్రీ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం సీసాలపై ఉన్న హోలోగ్రాంల ఆధారంగా వీటిని ఏ షాపు నుంచి తెచ్చి విక్రయిస్తున్నారో సులభంగా గుర్తించవచ్చు. ఈ విధంగా చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు ఎందుకో మరి ఆ దిశగా దృష్టి సారించడం లేదు. -
మళ్లీ పింఛన్ కష్టాలు!
కడప కార్పొరేషన్ : వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మళ్లీ పింఛన్ కష్టాలు మొదలయ్యాయి. ఆగష్టు 1 నుంచి ట్యాబ్‌ల ద్వారా పింఛను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు మొదలు పెట్టింది. మే, జూన్, జూలై నెలల్లో బిల్ కలెక్టర్ల ద్వారా మ్యాన్యువల్‌గానే పింఛన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం ఇపుడు మళ్లీ పాత పద్ధతిని అమల్లోకి తెస్తోంది. రూ.15 వేలు విలువగల ట్యాబ్లెట్ పీసీలను బిల్ కలెక్టర్లకు పంపిణీ చేసి వాటి ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ఆదే శాలు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్ట్టు 1వ తేది నుంచి బిల్ కలెక్టర్లు పింఛన్‌దారుల నుంచి వేలి ముద్రలు తీసుకుని పింఛన్లు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బిల్ కలెక్టర్లకు ట్యాబ్‌లపై అవగాహన కల్పించినట్లు సమాచారం. అయితే వాటిపై పూర్తి అవగాహన తెచ్చుకోలేని వారు తీవ్ర ఇబ్బందులు పడుతూ పింఛన్‌దారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పంపిణీపై ప్రభుత్వం పిల్లి మొగ్గలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పింఛన్ మొత్తాన్ని రూ.200 నుంచి రూ. 1000కి పెంచినా, అదే రీతిలో లబ్ధిదారులకు కష్టాలను కూడా రెట్టింపు చేసింది. సామాజిక సార్లు పిల్లిమొగ్గలు వేసి పింఛన్‌దారులను అష్టకష్టాలు పెట్టింది. గత ప్రభుత్వంలో పింఛన్‌దారుల వేలిముద్రలు తీసుకొని స్మార్టు కార్డు విధానంలో సీఎస్పీల ద్వారా పింఛన్ పంపిణీ చేస్తుండేవారు. అప్పట్లో మిషన్లలో వేలిముద్రలు సరిగా పడక, చార్జింగ్, సర్వర్ సమస్యలతో పింఛన్ల పంపిణీ ఆలస్యమయ్యేది. ఈ విధానం వల్ల లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడ్డారు. కొత్త ప్రభుత్వం వచ్చాక వారందరినీ తొలగించి మున్సిపల్ బిల్ కలెక్టర్ల ద్వారా కొన్ని నెలలు పంపిణీ చేశారు. తర్వాత కొత్తగా మిషన్లు పంపిణీ చేసి, వాటిలో వేలి ముద్రలు తీసుకొని పోస్టాఫీసుల ద్వారా రెండు మూడు నెలలు పంపిణీ చేశారు. అప్పుడు కూడా చార్జింగ్, సర్వర్, వేలిముద్రల సమస్యలు తలెత్తడంతో ఆ మూడు నెలలు కూడా పింఛన్‌దారులు అష్టకష్టాలు పడ్డారు. కాగా పింఛన్ పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటో వేసేందుకు పోస్టాఫీసులు అంగీకరించకపోవడంతో పింఛన్ పంపిణీ బాధ్యతల నుంచి పోస్టుమాన్లను తొలగించినట్లు సమాచారం. ఫలితంగా మే, జూన్, జూలై మాసాల్లో మళ్లీ బిల్ కలెక్టర్ల ద్వారానే పింఛన్ల పంపిణీ చేస్తూవచ్చారు. తాజాగా బిల్ కలెక్టర్లకు ట్యాబ్‌లు పంపిణీ చేసి, వేలిముద్రల సహాయంతో పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కడప కార్పొరేషన్లో మొత్తం 19154 పింఛన్లు ఉండగా అందులో వృద్ధాప్య పింఛన్లు 9967, చేనేత 23, వితంతు 6107, అభయహస్తం 485, వికాలాంగుల పింఛన్లు 2592 ఉన్నాయి. 50 డివిజన్లు ఉండగా 50 ట్యాబ్‌లు పంపిణీ చేశారు. గతంలోలాగే ఇప్పుడు కూడా సమస్యలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా పింఛన్ పంపిణీ పేరిట ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పోస్టాఫీసుల ద్వారా పంపిణీ సమయంలో కొత్త మిషన్లు పంపిణీ చేశారు. పోస్టాఫీసులకు పింఛన్ల బాధ్యత తొలగించడంతో అవి నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం ఒక్కో ట్యాబ్‌పై రూ.15 వేలు వెచ్చించి వాటి ద్వారా పింఛన్లు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం తప్ప ప్రజలకు ఒనగూరిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోనీ... ఈ విధానం వల్ల పింఛన్‌దారులకు సరళంగా, సులువుగా పింఛన్ లభిస్తున్నదా అంటే అదీ లేదు. వేలి ముద్రలు తీసుకోవడంలో తీవ్ర ఆలస్యమవుతోంది. వయో వృద్ధులు, వికలాంగుల వేలి ముద్రలను యంత్రాలు గుర్తించలేకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల గంటల తరబడి వేచి ఉండలేక పండుటాకులు ఇక్కట్లు పడుతున్నారు. -
నిధులు ఇవ్వండి
- పైపులైన్‌కు రూ.23కోట్లు - రోడ్ల విస్తరణకు రూ.8కోట్లు - కలెక్టర్‌కు లేఖ రాసిన కమిషనర్ - దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణ నేపథ్యంలో విజ్ఞప్తి విజయవాడ సెంట్రల్ : దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ పనులకు సర్కార్ పచ్చజెండా ఊపిన నేపథ్యంలో పైపులైన్, రోడ్ల విస్తరణ పనులపై నగరపాలక సంస్థ అధికారులు దృష్టిసారించారు. వారం రోజుల కిందట క్షేత్రస్థాయిలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ నివేదికలు రూపొందించాల్సిందిగా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పైపులైన్ నిర్మాణానికి రూ.23 కోట్లు, రోడ్ల విస్తరణకు రూ.8 కోట్లు ఖర్చవుతాయని అధికారుల అంచనా. ఫ్లైఓవర్ బడ్జెట్ నుంచి ఈ నిధులు కేటాయించాల్సిందిగా కోరుతూ కలెక్టర్ బాబు.ఏకు కమిషనర్ లేఖ రాశారు. రూ.23 కోట్లతో ప్రతిపాదనలు కుమ్మరిపాలెం వద్ద ప్రారంభమై పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు 1.8 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణం జరగనుంది. విద్యాధరపురం కేఎల్‌రావు హెడ్‌వాటర్ వర్క్స్‌లోని 16, 11, 8, 5 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్ పర్డే) ఫిల్టరైజేషన్ ప్లాంట్ల ద్వారా నగరంలోని విద్యాధరపురం, భవానీపురం, మధురానగర్, సింగ్‌నగర్, మొగల్రాజజపురం, బందరురోడ్డు తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా జరుగుతోంది. ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో వాటర్ పైపులైన్లను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. షిఫ్టింగ్‌కు రూ.18 కోట్లు, సైడ్ అప్రోచ్ రోడ్లకు అనుసంధానం చేసేందుకు రూ.5కోట్లతో ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. నెలలో పనులు ప్రారంభం హెడ్‌వాటర్ వర్క్స్‌లోని ప్రహరీ, ఆ పక్కనే ఉన్న షెడ్డు, అశోక్ స్తూపం, పొట్టిశ్రీరాములు విగ్రహం, నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం, స్వాతంత్య్ర సమరయోధుల స్మారక భవనంలో కొంతభాగం ఫ్లై ఓవర్ నిర్మాణానికి అడ్డుకావడంతో వాటిని తొలగించి వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఫ్లైఓవర్‌కు సంబంధించి నేషనల్ హైవే అథారిటీ అధికారులు మార్కింగ్ ఇచ్చిన తరువాత పైపులైన్ షిఫ్టింగ్ పనులు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిధులు మంజూరైన వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో పైపులైన్ పనులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రెండు నెలల్లో ఈ పనుల్ని పూర్తిచేసేలా చేస్తున్నారు. హమ్మయ్య ఫ్లైఓవర్ పుణ్యమా అని వన్‌టౌన్ వాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ముప్పై ఏళ్ల కిందట ఏర్పాటుచేసిన పైపులైన్లు కావడంతో లీకేజీలు వచ్చి నీరు కలుషితమవుతోంది. ఈ పనులతో ఆ సమస్య తీరనుంది. రూ.8కోట్లతో రోడ్ల విస్తరణ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరిగే సమయంలో ట్రాఫిక్ మళ్లింపు అనివార్యమైంది. 2016 ఆగస్టు నాటికి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఏడాదిపాటు నగరంలో ట్రాఫిక్‌ను మళ్లించాల్సిన పరిస్థితి. దీంతో రోడ్ల విస్తరణ షురూ అయ్యింది. గొల్లపూడి వై జంక్షన్ నుంచి బైపాస్ రోడ్డు, నైనవరం ఫ్లైఓవర్, ఇన్నర్‌రింగ్ రోడ్డు నుంచి సింగ్‌నగర్ ఫ్లైఓవర్ మీదుగా ఏలూరు రోడ్డుకు ట్రాఫిక్ మళ్లించే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా బైపాస్, సాయిబాబా గుడి, భగత్‌సింగ్, సాంబమూర్తి రోడ్లను విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు రూ.8 కోట్లు ఖర్చువుతుందని అంచనా. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే ఈ పనులు ప్రారంభించనున్నారు. -
దుర్గగుడి ఫ్లై ఓవర్ సర్వే ప్రారంభం
కార్పొరేషన్‌కు చేరిన డిజైన్ క్షేత్రస్థాయిలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ విగ్రహాలు, కట్టడాల తొలగింపుపై దృష్టి విజయవాడ సెంట్రల్ : దుర్గగుడి వద్ద నిర్మించనున్న ఫ్లై ఓవర్ సర్వే ప్రారంభమైంది. వంతెన నిర్మాణానికి అనుసంధానంగా ట్రాఫిక్ జంక్షన్ల అభివృద్ధిపై నగరపాలక సంస్థ అధికారులు దృష్టిసారించారు. ఆర్అండ్బీ అధికారులు రెండు రోజుల కిందటే ఫ్లైఓవర్ డిజైన్‌ను కార్పొరేషన్‌కు అందించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ జి.వీరపాండియన్ గురువారం ఇంజినీంగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న కట్టడాలు, విగ్రహాలను పరిశీలించారు. అధికారులకు సూచనలు ఇచ్చారు. అడ్డొచ్చేవన్నీ తొలగించండి భవానీపురం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు 1.8 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. విద్యాధరపురంలోని కేఎల్‌రావు హెడ్‌వాటర్ వర్క్స్, దుర్గగుడి సమీపంలోని అశోక్ స్థూపం, పొట్టిశ్రీరాములు విగ్రహం, నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం, స్వాతంత్య్ర సమరయోధుల స్మారక భవనంలో కొంతభాగం ఫ్లై ఓవర్ నిర్మాణానికి అడ్డు వస్తాయని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. వీటిని ఆయా ప్రాంతాల నుంచి తొలగించాల్సిందిగా కమిషనర్ ఆదేశాలిచ్చారు. వేరే ప్రాంతాల్లో ఏర్పాటుచేసే విధంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. ట్రాఫిక్ జంక్షన్లపై దృష్టి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరిగే సమయంలో ట్రాఫిక్‌ను మళ్లించనున్న దృష్ట్యా ట్రాఫిక్ జంక్షన్ల అభివృద్ధిపై అధికారులు దృష్టిసారిస్తున్నారు. గొల్లపూడి వై జంక్షన్ నుంచి బైపాస్‌రోడ్డు, నైనవరం ఫ్లైఓవర్ మీదుగా ఇన్నర్‌రింగ్ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డుకు ట్రాఫిక్ మళ్లించే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జంక్షన్లను విస్తరించడంతో పాటు పైప్లైన్లను మార్పు చేయాల్సిందిగా కమిషనర్ సూచించారు. వీటిపై త్వరలోనే నివేదిక ఇవ్వాలన్నారు. చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్, సిటీప్లానర్ ఎస్.చక్రపాణి, ఏసీపీ వి.సునీత, ఈఈ కేఆర్కే సత్యనారాయణ, డీఈఈలు నారాయణమూర్తి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు మున్సిపల్ కార్యాలయాల ముట్టడి
విజయనగరం మున్సిపాలిటీ: సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు, సిబ్బంది చేస్తున్న సమ్మె ఉద్ధృతమవుతోంది. ఆందోళనలో భాగంగా బుధవారం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్యాలయాలను ముట్టడించనున్నారు. మంగళవారం పార్వతీపురంలో కార్మికులు వంటా వార్పు చేసి నిరసన వ్యక్తం చేయగా, బొబ్బిలిలో మోకాళ్లపై నడిచారు. సాలూరు పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. వ్యవసాయ అధికారులు కూడా ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా రూపొందించారు. సాగునీటి వనరులు అందుబాటులో ఉన్న 61,500 హెక్టార్లలో సాగు చేయించేందుకు కార్యాచరణ తయారు చేశారంటే వారికెంత అనుమానాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్ని ఎలా అధిగమించాలి? రైతుల్ని ఎలా సిద్ధం చేయాలి? భవిష్యత్‌లో ఏం చేయాలి? అన్నదానిపై అధికారుల్లో కనీస స్పష్టత లేదు. దీనికంతటికీ వారి మధ్య సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణం. సీజన్లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు అధికారులు ముందుగానే సమాయత్తం కావాలి. సంబంధం ఉన్న శాఖలన్నింటితోనూ ఎప్పటికప్పుడు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండాలి. అప్పుడే పరిస్థితుల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది.కానీ, ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ఇంకా అప్రమత్తం కాలేదు. సాగుతో సంబంధం ఉన్న వ్యవసాయం, ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్ శాఖలతో ఇంతవరకు ఒక్క సమావేశాన్నీ కలెక్టర నిర్వహించలేదు. ఎప్పుడేం చేయాలో ఎవరేం చేయాలో సూచించిన దాఖలాలు లేవు. దీంతో ఖరీఫ్ సాగు అగమ్య గోచరంగా తయారైంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలెంత ఉన్నాయో వ్యవసాయ అధికారుల కు ఇంతవరకు తెలియదు. ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసేదెప్పుడో వ్యవసాయ శాఖకు కనీస సమాచారం లేదు. చెరువుల్లో ఉన్న నీటి సామర్థ్యం పైనా వ్యవసాయ శాఖకు అవగాహన లేదు. వాస్తవంగానైతే ఇరిగేషన్ అధికారులు ఆ సమాచారం ఇవ్వవల్సి ఉంది. వారిచ్చే సమాచారం మేరకు రైతుల్ని సిద్ధం చేయాలి. ఇక, వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరాపై ట్రాన్స్‌కో అధికారులు స్పష్టత ఇవ్వవల్సి ఉంది. ఎప్పుడిస్తారో, ఎప్పుడు నిలిపేస్తారో సమాచారం ఉంటే ఆ విధంగా రైతుల్ని వ్యవసాయ అధికారులు అప్రమత్తం చేసే అవకాశం ఉంది. వర్షాల్లేకపోతే అటు చెరువులు, ప్రాజెక్టులు, ఇటు వ్యవసాయ బోర్లుపైనే రైతులు ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా అప్రమత్తం చేసే పరిస్థితులు కనిపించడం లేదు. దీనికంతటికీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని తెలుస్తోంది. కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించకపోవడంతో అధికారులకు అవగాహన కొరవడంది. ఈ నేపథ్యంలో చివరికి రైతులు నష్టపోవాల్సి వస్తోంది. -
బంద్ సంపూర్ణం
కరీంనగర్ : మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాల పెంపు కోసం గత 12 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీలు శుక్రవారం ఇచ్చిన బంద్ పిలుపునకు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు మద్దతు ప్రకటించాయి. దీంతో జిల్లావ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరిగింది. కరీం నగర్లో ఉదయం 6గంటలకే వామపక్ష పార్టీల నేతలు, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, బోయిని అశోక్, పైడిపల్లిరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, న్యూడెమోక్రసీ నాయకులు జూపాక శ్రీనివాస్, జిందం ప్రసాద్, ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ నాయకులు గవ్వ వంశీధర్‌రెడ్డి తదితరులు బస్‌డిపో ముందు బైఠాయించి బస్సులు బయటికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని వారిని అదుపులోకి తీసుకోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, పట్టణ అధ్యక్షుడు కర్ర రాజశేఖర్ ఆధ్వర్యంలో టవర్‌సర్కిల్, తెలంగాణచౌక్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించి బంద్‌లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆనంతరం నగరంలోని బస్టాండ్, ప్రధాన వ్యాపార కూడళ్లలో ఆయా పార్టీల నాయకులు తిరుగుతూ బంద్ చేయించారు. విద్యాసంస్థలు సెలవు ప్రకటించగా, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంక్‌లు మధ్యాహ్నం వరకు మూసివేశారు. వామపక్ష పార్టీలు, మున్సిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల రాస్తారోకోలు, బైక్‌ర్యాలీలు నిర్వహించారు. జగిత్యాలలో ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో తహశీల్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. హుజూరాబాద్‌లో సీపీఎం రాష్ట్ర నాయకులు మర్రి వెంకటస్వామి ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. గంగాధర మండల కేంద్రం లో చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ ఇంటి ముందు కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు నిరసన తెలిపి బంద్‌లో పాల్గొన్నారు. సిరిసిల్లలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామల మల్లేశం ఆధ్వర్యంలో వామపక్ష పార్టీల నేతలు, కార్మికులు బంద్ పాటించారు. హుస్నాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు కేడం లింగమూర్తి, ఆకుల వెంకట్, సీపీఎం నాయకులు కొయ్యడ కొమురయ్య ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. మానకొండూరు, కోరుట్ల, మంథని, వేములవాడ, పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గ కేంద్రాల్లో వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్, టీడీపీ, విద్యార్థి యువజన సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. -
మున్సిపల్ సమ్మె తీవ్రం
విజయనగరం మున్సిపాలిటీ : మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు కనీస వే తనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న సమ్మె రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఎనిమిది రోజులుగా నాలుగు మున్సిపాలిటీల్లో సమ్మె కొనసాగుతుండగా... నెల్లిమర్ల నగర పంచాయ తీ పరిధిలో శుక్రవారం నుంచి సమ్మె ప్రా రంభమైంది. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో 275 కాంట్రాక్ట్ కార్మికులతో పాటు 34 మంది డ్రైవర్లు సమ్మె చేపడుతుండగా... శుక్రవారం నుంచి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లు, హెల్త్అసిస్టెం ట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు వీరికి మ ద్దతుగా విధులు బహిష్కరించారు. ప్ర భుత్వ తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయం నుంచి గంట స్తంభం జంక్షన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారంగా మో కాళ్లపై నిల్చొని ప్రభుత్వం తీరును ఎండగట్టారు. పార్వతీపురంలో మున్సిపల్ కా ర్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ జం క్షన్ వరకు ప్రభుత్వం దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించారు. సాలూరులో కార్మికులు మున్సిపల్ కార్యాలయం జంక్షన్ నుంచి మెయిన్‌రోడ్ మీదుగా ఎంఆర్వో కార్యాలయం జంక్షన్ వరకు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు సుజయ్ మద్దతు బొబ్బిలి: పారిశుద్ధ్య కార్మికుల న్యాయబద్దమైన కోర్కెలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమవుతోందని బొబ్బిలి ఎ మ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయం ఎదురుగా నిరసన దీక్ష చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు శుక్రవారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు పడుతున్న కష్టాన్ని గుర్తించి వారికి వేతనాలు చెల్లిం చాలని డిమాండ్ చేశారు. పార్టీ తరఫున పోరాటానికి సం పూర్ణమైన మద్దతు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే సుజయ్‌తో పాటు మండల పార్టీ అధ్యక్షుడు బొరపురెడ్డి వెంకటరమణ, బాడంగి నాయకుడు రామారావు తదితరులు ఉన్నారు. -
మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఉద్ధృతం
విజయనగరం మున్సిపాలిటీ:సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. ఏడు రోజులుగా సమ్మె చేపడుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో వినూత్న పద్ధతుల్లో వారు నిరసనలు తెలుపుతున్నారు. వీరి ఆం దోళనతో మున్సిపాలిటీలన్నీ మురికిమయంగా మారుతున్నాయి. శుక్రవారం నుంచి మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు సమ్మె బాట పట్టనున్నారు. ఈమేరకు గు రువారం సాయంత్రం విజయనగరం మున్సిపల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. విజయనగరం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల రిలే దీక్షలు మూడో రోజు గురువారం కొనసాగాయి. కార్మికుల దీక్షలకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభూజితో పాటు జిల్లా పింఛన్‌దారుల సంఘం ప్రతినిధి పెద్దింటి అప్పారావు తదితరులు సంఘీభావం తెలిపారు. బొబ్బిలిలో ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. సాలూరులో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. -
మున్సిపల్ కార్మికుల సమ్మెబాట
నేటి నుంచి విధులకు గైర్హాజరు సాక్షి, హైదరాబాద్: ‘కనీస’ వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం మునిసిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు నెల రోజులుగా చేస్తున్న ఆందోళన తీవ్రతరమైంది. కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో సోమవారం ఉదయం 6 గంటల నుంచి తాము సమ్మెకు దిగుతున్నామని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య సంఘాలు ప్రకటించాయి. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని 67 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సిం గ్ ప్రాతిపదికన పనిచేస్తున్న 40 వేల మంది కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. దీంతో రాష్ట్ర వ్యా ప్తంగా నగర, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు స్తంభించిపోనున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేయకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ ఇబ్బందికరంగా మారనుంది. సమ్మె సైరన్ మోగింది: కార్మిక సంఘాల జేఏసీ తమ డిమాండ్లపై ప్రభుత్వ స్పందన కరువవ్వడంతో తాము సమ్మెలోకి వెళ్తున్నామని, ఇందుకు సైరన్ మోగిందని.. దీన్ని ఆపడం ముఖ్యమత్రి కేసీఆర్ తరం కాదని కార్మిక సంఘాల జేఏసీ నేతలు స్పష్టీకరించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం పెంచాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు జీహెచ్ఎంసీలో పనిచేసే వివిధ విభాగాల కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఐటీయూ నేత పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. యాదాద్రికి రెండు వందల కోట్లు, వేములవాడకు ఏడాదికి రూ.వంద కోట్లను ప్రకటిస్తున్న సీఎంకు తమ గోడు పట్టదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వివిధ ట్రేడ్‌యూనియన్ల నేతలు ప్రసంగించారు. ఫలించని గత చర్చలు.. మున్సిపల్ కార్మికుల సమస్యలపై జూన్ 20న కార్మికశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి చర్చలు జరిపారు. ఈ మేరకు కార్మికుల డిమాండు మేరకు పెంపు ప్రతిపాదనలు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు సీఎంవో పరిశీలనలో ఉండడంతో సమ్మెను వాయిదా వేసుకోవాలని అధికారులు కోరారు. దీంతో సమ్మె గత నెల 22 నుంచి జూలై 6కు వాయిదా పడింది. ఇప్పటికీ ఆ ప్రతిపాదనలకు కదలిక లేకపోవడంతో కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. అందరితో పాటే పెంచుతాం ఆర్థిక శాఖ స్పష్టీకరణ మునిసిపల్ కార్మికుల వేతన పెంపు ప్రతిపాదనలను ఆర్థిక శాఖ వెనక్కి పంపించింది. ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందనీ, అందరితో పాటే మునిసిపల్ కార్మికుల వేతనాలను సైతం పెంచుతామని స్పష్టీకరించింది. దీంతో వేతన పెంపు ప్రతిపాదనలను సీఎం కార్యాలయం పరిశీలనకు పంపినట్లు పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. -
మున్సిపల్ కార్మికులకు ‘డబ్బు’ల్ ధమాకా!
వేతనాల రెట్టింపునకు ప్రభుత్వానికి పురపాలక శాఖ ప్రతిపాదన ♦ మున్సిపాలిటీ స్థాయితో సంబంధం లేకుండా ఒకే తరహా వేతనాలకు సిఫార్సు ♦ పబ్లిక్ హెల్త్ వర్కర్ల వేతనం రూ. 8,300 నుంచి రూ. 14,170కు ... ♦ నాన్‌పబ్లిక్ హెల్త్‌వర్కర్ల వేతనం రూ. 8,300 నుంచి రూ. 17,380కు పెంచాలని సూచన ♦ ఆర్థికశాఖ ఆమోదిస్తే 13,955 మంది కాంట్రాక్టు వర్కర్లకు లబ్ధి సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త. ఇకపై మున్సిపాలిటీల స్థాయితో సంబంధం లేకుండా ఒకే తరహా వేతనాల కోసం పురపాలకశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనాన్ని రూ.14,170 (స్థూల వేతనం రూ.19,586)కు, పారిశుద్ధ్యేతర కార్మికులకు రూ.17,380 (స్థూల వేతనం రూ.24,023)కు పెంచాలని కోరింది. ఈ ప్రతిపాదనలను ఆర్థికశాఖ యథాతథంగా ఆమోదిస్తే వేతనాలు దాదాపు రెట్టింపు కానున్నాయి. ప్రస్తుతం కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ల్లోని కార్మికులకు కనీస వేతనం రూ.8,300 (స్థూల వేతనం రూ.11,473) చెల్లిస్తుండగా, నగర పంచాయతీల్లోని కార్మికులకు రూ.7,300 (స్థూల వేతనం రూ.10,091) చెల్లిస్తున్నారు. 9వ పీఆర్సీ 4వ తరగతి ఉద్యోగుల కోసం సిఫారసు చేసిన కనీస వేతనాన్ని ప్రస్తుతం మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వోద్యోగులకు ప్రకటించిన 10వ పీఆర్సీ 43 శాతం ఫిట్‌మెంట్‌ను తమకు సైతం వర్తింపజేయాలని మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య సంఘాలు డిమాండ్ చేశాయి. లేకుంటే నిరసనలు, సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. దీంతో వారి డిమాండ్‌కు అనుగుణంగానే పురపాలకశాఖ వేతన పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేసి ఆర్థికశాఖ ఆమోదం కోసం పంపింది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 67 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 13,955 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తుండగా అందులో 9,953 మంది పారిశుద్ధ్య (పబ్లిక్ హెల్త్) కార్మికులు, 4,002 మంది పారిశుద్ధ్యేతర (నాన్ పబ్లిక్ హెల్త్) కార్మికులు ఉన్నారు. ప్రస్తుతం పురపాలికలు చెల్లిస్తున్న వేతనాలకు ఏటా రూ.186.70 కోట్లు ఖర్చవుతుండగా వేతనాలు పెంచితే ఆర్థిక భారం రూ.346.51 కోట్లకు పెరగనుంది. పురపాలికలపై రూ.159.81 కోట్ల అదనపు భారం పడనుంది. కాగా, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల క్రమబద్ధీకరణ డిమాండ్ సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. సఫాయివాలాల వేతనాలూ సఫాయి పలు మునిసిపాలిటీల్లో కాంట్రాక్టు కార్మికుల వేతనాల చెల్లింపుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు పురపాలకశాఖ పరిశీలనలో తేలింది. ఈఎస్ఐ, ఈపీఎఫ్ వాటాలను కార్మికుల వేతనాల నుంచి కోత పెట్టినప్పటికీ సంబంధిత కార్మికుల ఖాతాల్లో జమ చేయలేదని నిర్ధారించింది. మున్సిపల్ కమిషనర్లు, లేబర్ కాంట్రాక్టర్లు రూ. 9.04 కోట్ల ఈఎస్ఐ, పీఎఫ్ నిధులను స్వాహా చేసినట్లు ప్రాథమిక పరిశీలనలో తేల్చింది. ఈ నిధులను తక్షణమే కార్మికుల ఖాతాల్లో జమ చేయకుంటే కఠిన చర్యలు తప్పవని పురపాలకశాఖ ఇటీవల మున్సిపల్ కమిషనర్లను హెచ్చరించింది. -
నగరాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి
- వారానికో రోజు సమీక్ష - కొండ ప్రాంతవాసులకు పట్టాలు - పేదలకు 20వేల పక్కా ఇళ్లు - చెత్త నుంచి విద్యుదుత్పత్తికి ప్లాంట్ - కార్పొరేషన్ అధికారులతో చంద్రబాబు - నగరపాలక సంస్థ అధికారులతో సీఎం భేటీ - ఇంకా పలు నిర్ణయాలు సాక్షి, విజయవాడ : ‘ఒక్క అమరావతే కాదు, విజయవాడ, గుంటూరు నగరాలను బాగా అభివృద్ధి చెందాలి. ఇందుకు కావాల్సిన అనుమతులను ఇప్పిస్తాం. ఇక్కడ ఫైల్స్ పెండింగ్‌లో ఉండకుండా తక్షణం క్లియర్ చేయిస్తా. నగరాభివృద్ధిపై వారానికి ఒకరోజు సమీక్ష నిర్వహిస్తా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులు, అధికారులకు హామీ ఇచ్చారు. తన పేషీలోని అధికారులకు ఫోన్ చేసి ఇక నుంచి విజయవాడ నుంచి వచ్చే ఫైల్స్ తక్షణం క్లియర్ చేయమంటూ ఆదేశించారు. గురువారం రాత్రి నగరంలోనే బస చేసిన చంద్రబాబు శుక్రవారం ఉదయం బస్సులోనే నగరపాలకసంస్థ అధికారులతోనూ సమావేశం నిర్వహించారు. ఇక నుంచి అప్పడప్పుడు ఆకస్మిక తనిఖీలు కూడా చే స్తుంటానని హెచ్చరించారు. ఈనెల 26వ తేదిన మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తానని సూచించారు. కొండ ప్రాంతవాసులకు పట్టాలు నగరపాలకసంస్థ అధికారులతో మాట్లాడుతూ కొండప్రాంతాల్లో నివసించే పేదలందరికీ పట్టాలిచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. ఇప్పటివరకు ఉన్న ఇళ్లను గుర్తించి, అక్కడనుంచి కొండ పైకి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగరంలో పేదలకు 20వేల పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు మహేంద్ర కంపెనీ ముందుకు వచ్చిందని, ల్యాండ్ పూలింగ్‌లో స్థలం సేకరించి, వారి చేత కట్టిస్తానని చంద్రబాబు తెలిపారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు సీఆర్డీఏ పరిధిలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు విదేశీ కంపెనీలతో మాట్లాడుతున్నానని చెప్పారు. డంపింగ్ యార్డుకు కేటాయించిన 20 ఎకరాల స్థలం వేరే అవసరాలకు వాడుకోవాలని సూచిం చారు. కాల్వల బ్యూటిఫికేషన్ చేయాలని, కాల్వగట్లపై నివసించేవారికి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే ఖాళీ చేయించాలని సూచించారు. భవానీద్వీపాన్ని అభివృద్ధి చేయడానికి తాను ప్రైవేటు కంపెనీలతో సంప్రదిస్తున్నట్లు అధికారులకు వివరించారు. సిబార్ డిస్నీల్యాండ్ స్థలం గురించి మాట్లాడుతూ దాని యజమానులతో సంప్రదించాలని అక్కడ మరో ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలని సూచిం చారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్, మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్ గోగులరమణారావు, కమిషనర్ వీరపాండ్యన్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ నగరపాలకసంస్థ ఇంజినీర్లు పాల్గొన్నారు. జీ+2కు ‘మార్టిగేజ్ రద్దు’ 250 గజాలు లోపు భవననిర్మాణాలకు జీ+2 ఇళ్లు నిర్మించుకునేందుకు ‘మార్టిగేజ్’ చేయాల్సిన అవసరం లేకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సీఆర్డీఏ అధికారులకు సూచించారు. వర్షపు నీరు వెళ్లేందుకు నగరంలో సరైన వ్యవస్థ లేనందున దానికి కావాల్సిన డీపీఆర్‌లు తయారు చేయాలని సూచించారు. విజయవాడ(తూర్పు, సెంట్రల్) నియోజకవర్గంలో మంచినీటి ప్లాంట్లు ఏర్పాటుకు కావాల్సిన టెండర్లు పిలవాలని, వాటికి కావాల్సిన నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. -
హిజ్రాలతో స్టెప్పులు వేయిస్తే కాని ...
చెన్నై : నగరంలో ఆస్తి పన్ను బకాయి వసూళ్లలో కార్పొరేషన్ అధికారులు రోజుకో వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. నోటీసులిచ్చినా, దండోరా వేసినా స్పందించని స్టార్ హోటళ్ల యజమానుల్ని బెంబెలెత్తిస్తున్నారు. దండోరాతో పాటుగా హిజ్రాలతో నృత్యాలు చేయించే పనిలో పడ్డారు. రాష్ట్ర రాజధాని నగరం చెన్నై కార్పొరేషన్ పరిధిలోని స్టార్ హోటళ్లు, మాల్స్, అనేక ప్రైవేటు సంస్థలు ఆస్తి పన్నుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ బకాయిలు పెరుగుతుండడం అధికారుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. నగరంలోని పదిహేను మండలాల పరిధుల్లో ఏ మేరకు ఏయే సంస్థలు బకాయిలు ఉన్నాయో వివరాల్ని సేకరించారు. ఆయా సంస్థలు, హోటళ్లు, మాల్స్‌ల పరువు బజారుకీడ్చే రీతిలో నోటీసులు జారీ చేశారు. అయినా, ఫలితం శూన్యం. ఆయా భవనాల ముందు దండోరా వేయిస్తూ, వారు ఉన్న బకాయిల వివరాల్ని వెల్లడిస్తూ వినూత్న పంథాలో పయనించారు. అధికారుల దండోరాకు మంచి స్పందన వచ్చిందని చెప్పవచ్చు. బకాయిలు ఉన్న వాళ్లందరూ ఉరకలు పరుగులతో ఆస్తి పన్ను చెల్లింపు మీద దృష్టిపెట్టారు. అయితే, కొన్ని బడా బాబులకు చెందిన హోటళ్లు, సంస్థలు నోటీసులిచ్చినా, దండోరా వేసినా స్పందించలేదు. స్టెప్పులతో.. నోటీసులిచ్చినా, దండోరా వేసినా స్పందించిన యజమానుల పరువును మరింతగా బజారుకు లాగే రీతిలో కొత్త మార్గంలో పయనించేపనిలో అధికారులు పడ్డారు. శుక్రవారం నుంచి ఈ కొత్త పంథాను అనుసరిస్తున్నారు. దండోరా వేయిస్తూనే, కొందరు హిజ్రాలను నియమించుకుని, వారి ద్వారా ఆయా భవనాల ముందు స్టెప్పులు వేయించే పనిలో పడ్డారు. ఉదయం ఈక్కాడు తాంగల్‌లోని ఓ హోటల్ ముందు హిజ్రాలతో నృత్యం చేయిస్తూ, దండోరా వేయించారు. దీంతో ఆ యజమానుల్లో కలవారాన్ని రేపింది. ఆగమేఘాలపై అక్కడిక్కడే తాము పన్ను చెల్లించాలని రూ.30 లక్షలకు గాను చెక్కును అధికారులకు అందజేశారు. ఇదే బాటలో ఇతర యాజమాన్యాల భరతం పట్టే విధంగా కార్పొరేషన్ అధికారులు ముందుకు కదిలారు. శుక్రవారం ఒక్క రోజు కేవలం 13వ డివిజన్లో మాత్రం రూ.కోటి 63 లక్షలు ఆస్తి పన్ను వసూలైంది. కోయంబేడు, మదురవాయిల్ పరిసరాల్లో నీటిపన్ను వసూళ్లు రూ.33 లక్షలు రావడం విశేషం.