‘టౌన్‌ ప్లానింగ్‌’ శివబాలకృష్ణ అరెస్టు  | Sakshi
Sakshi News home page

‘టౌన్‌ ప్లానింగ్‌’ శివబాలకృష్ణ అరెస్టు 

Published Fri, Jan 26 2024 5:07 AM

Town planning Siva balakrishna arrested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు దొరికిన పురపాలక శాఖ పట్టణ ప్రణాళిక (టౌన్‌ ప్లానింగ్‌) విభాగం ఉన్నతాధికారి శివబాలకృష్ణ ఆస్తులు లెక్కకు మించి బయటపడుతున్నాయి. సోదాల్లో గుర్తించిన ఆస్తుల విలువను మదింపు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. గురువారం ఆయనను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

కోర్టు వచ్చే నెల 8వరకు రిమాండ్‌ విధించడంతో.. చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక బాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించిన మూర్తి, సత్యంల కోసం గాలిస్తున్నారు. శివబాలకృష్ణ అవినీతి, అక్రమాల సంపాదనతో నాలుగైదు ప్రాంతాల్లో వంద ఎకరాల వరకు వ్యవసాయ భూమి, ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేశారని పురపాలక శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వాటి ప్రస్తుత మార్కెట్‌ విలువ దాదాపు ఐదు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

సుమారు రెండు కిలోల బంగారం.. కోటి నగదు.. 
శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో స్థిరాస్తి పత్రాలను అధికారులు సీజ్‌ చేశారు. హైదరాబాద్‌లో విల్లాలు, ఫ్లాట్లు, నగర శివారు ప్రాంతాల్లో భారీగా భూముల పత్రాలు వీటిలో ఉండటం గమనార్హం.

మొత్తంగా వంద ఎకరాల వరకు ఈ భూములు ఉన్నట్టు తెలిసింది. వీటితోపాటు కోటి వరకు నగదు, దాదాపు రెండు కిలోల బంగారు ఆభరణాలు, ఆరు కిలోలకుపైగా వెండి వస్తువులు, 80కిపైగా అత్యంత ఖరీదైన వాచీలు, పదుల సంఖ్యలో ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లను కూడా అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. ఇంకా బ్యాంకు లాకర్లను తెరిస్తే ఇంకా ఎంత స్థాయిలో ఆస్తులు బయటపడతాయోనని అధికారులు పేర్కొంటున్నారు. 

బినామీల పేరిట భూములు 
సోదాల్లో కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాల స్థిరాస్తి భూముల పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటిలో చాలా వరకు బినామీల పేరిట ఉన్నట్టు చెప్తున్నారు. బినామీలుగా వ్యవహరించిన సత్యం, మూర్తి కోసం అధికారులు గాలిస్తున్నట్టు తెలిసింది.  

ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. 
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఇంట్లో, మరో 16 చోట్ల జరిపిన దాడుల్లో ఇప్పటివరకు స్థిరాస్తులు, చరాస్తుల డాక్యుమెంట్లలోని ప్రభుత్వ విలువ ప్రకారం రూ.8.26 కోట్ల ఆస్తులను గుర్తించినట్టు ఏసీబీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో ఎన్నోరెట్లు అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా ఆస్తుల మదింపు జరుగుతోందని తెలిపారు.

సోదాల్లో రూ.99,60,850 నగదు, 1,988 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆరు కిలోల వెండి ఆభరణాలు/వస్తువులు, డాక్యుమెంట్ల లెక్కల ప్రకారం రూ.5,96,27,495 విలువైన స్థిర, చరాస్తులను గుర్తించినట్టు తెలిపారు. బాలకృష్ణను అరెస్టు చేసి ఏసీబీ కోర్టు అదనపు స్పెషల్‌ జడ్జి ముందు హాజరుపర్చినట్టు వివరించారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులకు సంబంధించి ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫోన్‌ చేయాలని సమాచారం ఇవ్వాలని కోరారు.  


పుర ‘ప్లానింగ్‌’ అంతా ఆయనదే!
♦ విధానాల రూపకల్పనలో చక్రం తిప్పిన శివబాలకృష్ణ
♦ ఆయన కోసం పురపాలక శాఖలో డైరెక్టర్‌ (ప్లానింగ్‌) పోస్టు సృష్టి
♦ హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, మెట్రో రైల్‌ విధాన నిర్ణయాల్లో ప్రభావం
♦ రెరా నిబంధనలు, ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్, టీఎస్‌–బీపాస్‌ల రూపకల్పనలోనూ కీలక పాత్ర
♦ అనుమతులు, మినహాయింపులు, అలైన్‌మెంట్‌ మార్పుల  పేరిట అవినీతి
♦ శివబాలకృష్ణ ఏసీబీకి చిక్కడంపై రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తీవ్ర చర్చ

సాక్షి, హైదరాబాద్‌: ఏసీబీకి చిక్కి అరెస్టయిన హెచ్‌ ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ.. రాష్ట్ర అర్బన్‌ ప్లానింగ్‌ పాలసీల రూపకల్పనలో చక్రం తిప్పారని పురపాలకశాఖ వర్గాలు చెప్తున్నాయి. పట్టణ ప్రణాళి కకు సంబంధించిన విధానాల రూపకల్పన, రచన (డ్రాఫ్టింగ్‌)లో దిట్టకావడంతో ఆయన హవా కొన సాగిందని అంటున్నాయి. 2014లో రాష్ట్ర సచివాల యంలోని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో డైరెక్టర్‌ (ప్లానింగ్‌) పేరుతో కొత్త పోస్టును సృష్టించి మరీ ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించ డం గమనార్హం.

దీనితో ఆయన హెచ్‌ఎండీఏ, జీహె చ్‌ఎంసీ, హైదరాబాద్‌ మెట్రోరైల్, భూవిని యోగ మార్పిడి, ఎలివేటెడ్‌ కారిడార్లు, ఆకాశ హర్మ్యాలు, మాస్టర్‌ ప్లాన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ స్థాయి లో విధానపర నిర్ణయాలు తీసుకోవ డంలో కీలకంగా వ్యవహరించారు. పురపాలక శాఖ లో ఈ వ్యవ హారాలను పర్యవేక్షించే కీలకమైన ప్లానింగ్‌–1, ప్లానింగ్‌–2, ప్లానింగ్‌–3 అనే మూడు సెక్షన్లకూ శివ బాలకృష్ణ మకుటం లేని మహా రాజుగా వ్యవహరించారని.. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌ (ప్లానింగ్‌)గా ఆ సంస్థ అంతర్గత వ్యవహారాల్లోనూ ప్రభావం చూపి నట్టు చర్చ జరుగుతోంది.

ఈ సమయంలోనే ఆయ న పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడి ఆస్తులు పోగే సుకున్నట్టు ఆరోపణలు విని పిస్తున్నాయి. శివబాల కృష్ణ ఇంట్లో సోదాల్లో లభించిన విలువైన వాచీలు, సెల్‌ఫోన్లు, ఆభరణాలు వంటివన్నీ బహుమతు లుగా అందుకున్నవేనని పురపాలక శాఖలో చర్చ జరుగుతోంది.

కీలక విధాన నిర్ణయాలన్నీ..
గత పదేళ్లలో రాష్ట్ర పురపాలక శాఖ తీసుకొచ్చిన పాలసీల రూపకల్పనలో శివబాలకృష్ణ ముఖ్యపాత్ర పోషించారు. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి సంబంధించి ముఖ్యమైన తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యు లేషన్‌ అథారిటీ (టీఎస్‌ రెరా) నిబంధనలను సైతం శివబాలకృష్ణ రూపొందించారు. ఈ క్రమంలో రెరా అమల్లోకి వచ్చిన తేదీ నాటికే నిర్మాణం ప్రారంభమైన ప్రాజెక్టులకు మినహాయింపు ఇచ్చి, బిల్డర్లకు ప్రయోజనం కల్పించినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇక అనుమతి లేని కట్టడాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం సర్కారు తెచ్చిన ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌ల జీవోలు శివబాలకృష్ణ ఆధ్వర్యంలోనే సిద్ధం చేశారు.

టౌన్‌షిప్‌ పాలసీ, పొడియం పార్కింగ్‌ పాలసీ, పార్కింగ్‌ ఫీజు విధానం, సింగిల్‌ విండో విధానంలో ఆన్‌లైన్‌లో భవన అనుమతుల జారీ కోసం తెచ్చిన టీఎస్‌–బీపాస్‌ పాలసీ, కూల్‌రూఫ్‌ పాలసీ, రాష్ట్ర బిల్డింగ్‌ రూల్స్‌ (జీవో 168)కు సవరణలతో వేర్వేరు సందర్భాల్లో జారీ చేసిన జీవోలు, లేఅవుట్‌ రూల్స్‌కు సవరణలతో వేర్వేరు సందర్భాల్లో ఇచ్చిన జీవోలను సైతం ఆయన నేతృత్వంలోనే రూపొందించినట్టు పురపాలక శాఖ వర్గాలు చెప్తున్నాయి.

దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టి..
హెచ్‌ఎండీఏ, ఇతర పట్టణాల మాస్టర్‌ ప్లాన్లకు సవ రణలు/మినహాయింపులు, మాస్టర్‌ ప్లాన్ల నుంచి రోడ్లను తొలగించడం/పార్కులను మార్చడం, హెచ్‌ఎండీఏ పరిధిలో భూవినియోగ మార్పిడి దర ఖాస్తుల పరిష్కరణ, హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణ, ఎలివేటెడ్‌ కారిడార్, ఓఆర్‌ఆర్‌ వ్యవహారాలు, ఆకాశహర్మ్యాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిబంధ నల మినహాయింపులు, భారీ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజె క్టులు/గేటెడ్‌ సొసైటీలు/టౌన్‌షిప్‌ల నిర్మాణానికి అనుమతులు, మెట్రో అలైన్‌మెంట్‌ మార్పులు వంటి అంశాల్లోనూ శివబాలకృష్ణ కీల కంగా వ్యవహ రించారని సమాచారం.

ఈ క్రమంలో ఆయా అంశాల్లో అనుమతులు, మినహాయింపులు కోరుతూ వచ్చే దరఖాస్తులను పెండింగ్‌ ఉంచేవా రని.. కొన్నింటికి మాత్రమే వేగంగా పురపాలకశాఖ నుంచి అనుమతులు లభించేవని విమర్శలు ఉన్నా యి. ఈ క్రమంలోనే భారీగా సొమ్ము, బహుమ తులు అందుకునేవారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement