ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్‌లో 2001 జనాభా లెక్కల ఆధారంగా చేసిన వార్డుల విభజనను హైకోర్టు తప్పుపట్టింది.
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్‌లో 2001 జనాభా లెక్కల ఆధారంగా చేసిన వార్డుల విభజనను హైకోర్టు తప్పుపట్టింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వార్డుల విభజన చేయాలని పురపాలకశాఖ అధికారులను ఆదేశించింది. ఈ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2001 జనాభా లెక్కల ఆధారంగా వార్డులు విభజించడాన్ని సవాలు చేస్తూ ఖమ్మం పట్టణానికి చెందిన సి.హెచ్.నాగేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. 2001 జనాభా ప్రకారం 50 వార్డులుగా విభజించడం వల్ల ఎంతో మంది నష్టపోతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది పి.వేణుగోపాల్ కోర్టుకు నివేదించారు.