విజయనగరం మున్సిపాలిటీ : మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు కనీస వే తనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న సమ్మె రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఎనిమిది రోజులుగా నాలుగు మున్సిపాలిటీల్లో సమ్మె కొనసాగుతుండగా... నెల్లిమర్ల నగర పంచాయ తీ పరిధిలో శుక్రవారం నుంచి సమ్మె ప్రా రంభమైంది. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో 275 కాంట్రాక్ట్ కార్మికులతో పాటు 34 మంది డ్రైవర్‌లు సమ్మె చేపడుతుండగా... శుక్రవారం నుంచి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్‌లు, హెల్త్‌అసిస్టెం ట్‌లు, కంప్యూటర్ ఆపరేటర్‌లు వీరికి మ ద్దతుగా విధులు బహిష్కరించారు. ప్ర భుత్వ తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయం నుంచి గంట స్తంభం జంక్షన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారంగా మో కాళ్లపై నిల్చొని ప్రభుత్వం తీరును ఎండగట్టారు. పార్వతీపురంలో మున్సిపల్ కా ర్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ జం క్షన్ వరకు ప్రభుత్వం దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించారు. సాలూరులో కార్మికులు మున్సిపల్ కార్యాలయం జంక్షన్ నుంచి మెయిన్‌రోడ్ మీదుగా ఎంఆర్వో కార్యాలయం జంక్షన్ వరకు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికులకు సుజయ్ మద్దతు
బొబ్బిలి: పారిశుద్ధ్య కార్మికుల న్యాయబద్దమైన కోర్కెలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమవుతోందని బొబ్బిలి ఎ మ్మెల్యే, వైఎస్‌ఆర్ సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయం ఎదురుగా నిరసన దీక్ష చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు శుక్రవారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు పడుతున్న కష్టాన్ని గుర్తించి వారికి వేతనాలు చెల్లిం చాలని డిమాండ్ చేశారు. పార్టీ తరఫున పోరాటానికి సం పూర్ణమైన మద్దతు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే సుజయ్‌తో పాటు మండల పార్టీ అధ్యక్షుడు బొరపురెడ్డి వెంకటరమణ, బాడంగి నాయకుడు రామారావు తదితరులు ఉన్నారు.
మున్సిపల్ సమ్మె తీవ్రం
Published Sat, Jul 18 2015 12:20 AM | Last Updated on Tue, Oct 16 2018 7:27 PM
Advertisement