న్యూఢిల్లీ: చె న్నై సూపర్ కింగ్స్ జట్టు తమ సొంత మైదానంలో ఆడాల్సిన మ్యాచ్‌లను ఇతర చోట్లకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెపాక్ స్టేడియంలో తమిళనాడు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా గతంలో మూడు స్టాండ్స్‌ను నిర్మించడమే దీనికి కారణం. ఇప్పటిదాకా వాటికి కార్పొరేషన్ నుంచి ఎన్‌వోసీ సర్టిఫికెట్ అందలేదు.
ఈనెల 18న బెంగళూరుతో, 22న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లీగ్‌లతో పాటు 27న క్వాలిఫయర్, 28న ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. ‘చెపాక్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చెన్నై మ్యాచ్‌లను నిర్వహించాల్సిన వేదిక గురించి నేడు (శనివారం) ముంబైలో సమావేశం ఉంటుందని సీఎస్‌కే యాజమాన్యం నుంచి మాకు సమాచారం అందింది’ అని ఐపీఎల్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. చెపాక్‌లో ఆడాల్సిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం రెండింటిని రాంచీలో జరిపే అవకాశం ఉంది.
‘చెన్నై’ మ్యాచ్‌ల తరలింపు!
Published Sat, May 10 2014 1:07 AM | Last Updated on Tue, Oct 16 2018 7:27 PM
Advertisement
Advertisement