ఉద్రిక్తం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్ ) : మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పో లీసులకు.. ఆందోళనకారులకు మధ్య తోపులా ట జరిగింది. ఈ తోపులాటలో ఇద్దరు కార్మికుల కు గాయాలు కావడంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని మంగళవారం మున్సిపల్ కార్మికులు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారు మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీగా గడియారం చౌరస్తా, పాతబస్టాండ్ మీదుగా తెలంగాణ చౌరస్తా చేరుకున్నారు. జిల్లాలోని అ న్ని మున్సిపాలీటిల నుంచి కార్మికులు ఈ ర్యాలీ లో పాల్గొన్నారు.
తెలంగాణ చౌరస్తాలో గంట పాటు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఒ క్కసారిగా అడ్డంగా పెట్టిన బారికేడ్లను తోసుకు ని కలెక్టరేట్ వైపునకు వేళ్లేందుకు ప్రయత్నిం చారు. వారిని నిలువరించే క్రమంలో పోలీసుల కు.. కార్మికులకు మధ్య తీవ్ర తోపులాట జరి గింది. ఆందోళనకారులు పోలీసులను తోసుకు ని కలెక్టరేట్ వైపు వెళ్లారు. ఈ సమయంలో బా రికేడ్లతోపాటు ముండ్లకంచె తగిలి పలువురు మహిళా కార్మికులు కింద పడడంతో వారికి గా యాలయ్యాయి. అనంతరం కార్మికులు కలెక్టరే ట్ ప్రధాన గేట్ ముందు బైఠాయించారు.
కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కార్మిక సంఘ నాయకులను అరెస్టు చేశారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు ఒక్కసారిగా గేట్‌ను తోసుకుని కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లి ప్రదాన ద్వారం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు అక్కడికి వచ్చిన డీఆర్‌ఓ భాస్కర్‌పై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేశారు. ఎంతకీ పరిస్థితి అదుపు కాకపోవడంతో టూటౌన్ ఎస్‌ఐ రమేష్ ఆధ్వర్యంలో కార్మిక సంఘ నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు.
ఐదుగురికి గాయాలు
మున్సిపల్ కార్మికులు చేపట్టిన చలో కలెక్టర్ కార్యాక్రమంలో పలుమార్లు పోలీసులకు కార్మికులు తీవ్రంగా తోపులాట జరిగింది. ఈ సమయంలో కార్మికులు యాదగిరి, వరలక్ష్మి, చంద్రకళ, గోపాలమ్మ, నాగమణి గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ కార్మికుల ఆందోళనకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, కేవీపీఎస్, ఎస్‌ఎఫ్‌ఐ, ఎమ్మార్పీఎస్, అంబేద్కర్ జాతర, మాలమహానాడు, టీడీపీ మద్దతు తెలిపాయి.
ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ 37 రోజులుగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ. 15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. కార్మికల సమస్యలను పరిష్కరించని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేవలం హైదరాబాద్‌లో పనిచేసే కార్మికులకుమాత్రమే జీతాలు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు పర్వతాలు, ఆంజనేయులు, కురుమూర్తి, చంద్రకాంత్, బాల్‌రెడ్డి, నర్సింహ, రాములు, బాల్‌రాజు, రాంమోహన్, వెంకటేశ్, అరుణ్‌కుమార్, శ్రీనివాస్, రమేష్, రాందాస్, రమేష్, కేశవులు తదితరులు పాల్గొన్నారు.