సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు వాస్తు దోషం పట్టిందట.! అందుకే కార్యాల యం వెనుకభాగంలో ప్రహరీని కూల్చివేశారు. ఈశాన్య భాగంలో బరువు ఉండకూడదని పాతకాలం నాటి రెండు షెడ్లను తొలగించారు. ఉత్త రం వైపు గేటు ఉంటే మున్సిపల్ కార్పొరేషన్‌కు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని వాస్తు జోతిష్యులు చెప్పడంతో అధికారులు వాస్తుకు అనుకూలంగా మార్పులు చేస్తున్నారు. ఇందు కోసం మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ. 18 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో వా స్తు దోష నివారణ కోసం ఉత్తర దిశలో కూల్చివేసిన ప్రహరీ స్థానంలో మెయిన్ గేటును ఏర్పా టు చేస్తున్నారు.
ఎవడబ్బ సొమ్మని
కూల్చి వేసిన రెండు పాత షెడ్లకు బదులుగా వేరే స్థలంలో మరో షెడ్ నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు టెం డర్లు కూడా పిలిచి కాంట్రా క్టర్లకు బాధ్యతలు అప్పగించారు.షెడ్ నిర్మాణానికి రూ. 15 లక్ష లు, మెయిన్ గేటు ఏర్పాటులకు రూ. 3 లక్షలు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించే షెడ్‌ను వాహనాల పార్కింగ్ కోసం ఉపయోగించనున్నట్లు కార్పొరేషన్ వర్గాలు తెలిపారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ముందు భాగాన ప్రహరీతోపాటు రెండు ప్రధాన గేట్లు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎందరో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించి ఉన్నత స్థాయికి ఎది గారు. అదే విధంగా మున్సి పాలిటీ మొదలుకొ ని మున్సిపల్ కార్పొరేషన్ వరకు పాలకవర్గాలు కూడా పనిచేశాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి పట్టని వాస్తు దోషం ఒక్కసారిగా ఇప్పటి అధికారులు గుర్తించడం..అదే పనిగా దోష నివారణ కోసం రూ. 18 లక్షలు కేటాయిం చి ప్రజల సొమ్ము వృథా చేయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.
జనమేమైనా పరవాలేదా?
నగర ప్రజలు సవాలక్ష సమస్యలతో ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని అధికారులు...తమ కు ఏ ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో వాస్తు జోతిష్యుల మాటలు నమ్మి కొత్త నిర్మాణా లు చేపట్టడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రమైన మున్సిపల్ కార్పొరేషన్‌లో రోడ్లు సరిగ్గా లేని పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చిన్నపాటి వర్ష పు జల్లులు పడినా రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. పారిశుధ్య సమస్య చెప్పనల వి కాకుండా ఉంది. సరైన డంపింగ్ యార్డులు లేకపోవడంతో నగరంలో సేకరించిన చెత్తను ఎక్కడ పడితే అక్కడే వదిలేయడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. శివారు ప్రాం తాలకు మంచినీటిని సరఫరా చేయలేని పరిస్థితిలో కార్పొరేషన్ కొట్టుమిట్టాడుతోంది. ఇలాం టి క్లిష్ట సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని నగర వాసులు కోరుతున్నారు.
వాస్తు దోషమట!
Published Fri, Jan 10 2014 4:26 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement