మణికంఠ చెల్లి చెప్పిన సంచలన నిజాలు.. చిన్నప్పటి నుంచీ | Bigg Boss 8 Telugu Naga Manikanta Sister Kavya Amarnadh Comments On His Game In BB House, Deets Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Manikanta: పక్కనోళ్లు బాధ గురించి వాడికి సంబంధం లేదు

Published Wed, Oct 9 2024 12:57 PM | Last Updated on Wed, Oct 9 2024 1:18 PM

Bigg Boss 8 Telugu Naga Manikanta Sister Kavya Interview

ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్ 8వ సీజన్ టెలికాస్ట్ అవుతుంది. రీసెంట్‪‌గానే దాదాపు 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చారు. అయితే అందరిలో కాస్త విచిత్రమైన క్యారెక్టర్ ఎవరా అంటే చాలామంది చెప్పే పేరు మణికంఠ. ఒక్కో టైంలో ఒక్కోలా ప్రవర్తించే ఇతడికి సపోర్ట్ చేసేవాళ్లు ఉన్నట్లే.. విమర్శించేవాళ్లు కూడా బోలెడుమంది ఉన్నారు. ఇప్పుడు మరిన్ని నిజాలని మణికంఠ చెల్లి కావ్య బయటపెట్టింది.

(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్.. అమ్మాయిని గర్భవతి చేశాడు: పూనమ్ కౌర్)

అనవసరంగా బిగ్‌బాస్‌ షోకి వెళ్లి ఫ్యామిలీ విషయాలన్నీ రోడ్డు మీద పెట్టేశాడని అనుకున్నారా? అని యాంకర్ అడగ్గా.. 'అవును ఆ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే చెప్పాకుండా ఉండాల్సింది కదా అనిపించింది. రీసెంట్‌గా నాకు నిశ్చితార్థం జరిగింది. మా అత్తయ్య వాళ్ల ఫ్యామిలీకి కూడా కాల్స్ రావడం, వాళ్ల బంధువులు ఫోన్ చేసి.. ఇలాంటి ఫ్యామిలీ నుంచి ఎందుకు అమ్మాయిని తెచ్చుకున్నారని అని అందరూ అడగడం మొదలుపెట్టారు'

'అంత లో క్లాస్ అయినప్పుడు ఎందుకు తెచ్చుకున్నారు ఇలాంటి అమ్మాయిని మా అత్తమ్మని అడిగారు. కానీ ఆమెకు నా గురించి ముందే తెలుసు కాబట్టి మాకు లేని ప్రాబ్లమ్ మీకేంటి అని వాళ్లని అడిగి, నాకు సపోర్ట్‌గా నిలిచింది. ఈ విషయంలో ఆమె చాలా గ్రేట్' అని మణికంఠ చెల్లి కావ్య చెప్పింది.

(ఇదీ చదవండి: నోరు జారిన టేస్టీ తేజ.. వెక్కివెక్కి ఏడ్చిన నయని పావని)

'చిన్నప్పటి నుంచి వాడు(మణికంఠ) అంతే. నాదే, నా ఒక్కడితే బాధ అని అనుకుంటాడు. పక్కనోళ్లు బాధ గురించి వాడికి సంబంధం లేదు. ఇవన్నీ పక్కనబెడితే వాడు గెలిచి రావాలి. ఎందుకంటే వెళ్లిందే దానికోసం. మేమందరం ఇన్ని అవమానాలు తీసుకున్నాం. ఎందుకంటే వాడు గెలిచి వస్తాడనే కదా. బయటనే కాదు హౌసులో కూడా చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాడు' అని మణికంఠ చెల్లెలు తన ఆవేదన బయటపెట్టింది.

మణికంఠ చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో.. ఇతడి తల్లి రెండో పెళ్లి చేసుకుంది. సవతి తండ్రి వల్ల.. అలానే పెళ్లయి, పాప పుట్టిన తర్వాత భార్య తనకు విడాకులు ఇచ్చిందని.. ఈ రెండింటి వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డాడని బిగ్‌బాస్ షోలో చెప్పాడు. ఇది విని బాధపడే వాళ్లు కొందరైతే. సింపతీ గేమ్ ఆడుతున్నాడని ట్రోల్ చేసేవాళ్లు లేకపోలేదు. దీని వల్ల మణికంఠనే కాదు ఇతడి తీరు వల్ల బయట ఉన్న చెల్లి, భార్య కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని ఇప్పుడు తెలిసింది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' గేమ్ కాదు ట్రామా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement