మణికంఠపై రెచ్చిపోయిన ఆదిత్య.. దగ్గరుంటే కొట్టేసేవాడేమో! | Video: Bigg Boss 8 Telugu Aditya Om Buzz Interview, Serious Comments On Manikanta And Fights In Bigg Boss House | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Aditya Om: ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన ఆదిత్య

Published Sun, Oct 6 2024 4:38 PM | Last Updated on Mon, Oct 7 2024 11:00 AM

Bigg Boss 8 Telugu Aditya Om Buzz Interview

బిగ్‌బాస్ 8 మరీ చప్పగా సాగుతోంది. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఆదిత్య ఓంని బయటకు పంపేశారు. ఆదివారం కూడా నైనిక ఎలిమినేట్ కాబోతుందని చెబుతున్నారు. అలానే 'రీలోడెడ్' పేరుతో స్పెషల్ ఎపిసోడ్ ఆదివారం టెలికాస్ట్ కానుంది. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఆదివారమే ఉన్నాయి.

సరే ఇదంతా పక్కనబెడితే వారం మధ్యలో ఎలిమినేట్ అయి బయటకొచ్చిన ఆదిత్యని బిగ్‌బాస్ బజ్ కోసం అర్జున్ ఇంటర్వ్యూ చేశాడు. పలు విషయాల్ని చర్చించుకున్నారు. హౌస్‌లో ఉన్న నాలుగు వారాల జర్నీ గురించి ఏం చెబుతారని ఆదిత్యని అడగ్గా.. అది పెద్ద సైకాలజీ, మెంటల్ టెస్ట్ అని చెప్పుకొచ్చాడు. మరి అందులో పాసయ్యారా అంటే సమాధానం చెప్పలేకపోయిన ఆదిత్య నవ్వి తప్పించుకున్నాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోనే ది బెస్ట్... సలార్, కేజీఎఫ్‌కి బాబు లాంటి సినిమా)

ఇక హౌస్‌లో గొడవల గురించి కూడా మాట్లాడిన ఆదిత్య.. కావాలని గొడవ పడుతున్న వాళ్లు, యాక్ట్ చేస్తున్న వాళ్లు చాలామందే ఉన్నారని చెప్పుకొచ్చాడు. గొడవలు పడే కంటెంటే ముఖ్యమని వాళ్లు అనుకుంటున్నారని ఆదిత్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక మణికంఠపై ఫుల్ ఫైర్ అయిపోయాడు. మనిషివా జంతువువా అని పట్టరాని కోపాన్ని ప్రదర్శించాడు.

'మణికంఠ.. అసలు నువ్వు మనిషివా జంతువా? ఎన్నిసార్లు మీ దగ్గరు వచ్చి చెప్పాను మీకు, కరెక్ట్ సలహా ఇచ్చాను. కానీ ప్రతిసారీ నేను ఇచ్చిన సలహా సరిగా తీసుకోలేదు. ఎప్పుడు నేర్చుకుంటారు లైఫ్‌లో? అసలు బుర్ర ఉందా మీకు?' అని ఆదిత్య తెగ ఫైర్ అయిపోయాడు. ఒకవేళ మణికంఠ దగ్గరుంటే కొట్టేసేవాడేమో అన్నంతగా ఆవేశపడిపోయాడు.

(ఇదీ చదవండి: ‘బిగ్‌బాస్‌’ ఫేం శుభశ్రీకి యాక్సిడెంట్‌.. తుక్కుతుక్కైన కారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement