
‘‘నా కెరీర్‌లో ఎప్పుడూ విభిన్నమైన సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలనుకుంటాను’’ అని హీరోయిన్ కీర్తీ సురేశ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు.. ‘దసరా’, ‘మామన్నన్ ’ సినిమాల విజయాల తర్వాత కథ ఎంపికలో మీ ఆలోచనలు ఏవైనా మారాయా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు కీర్తీ సురేశ్ బదులిస్తూ.. ‘‘నేను నటించిన సినిమా హిట్టు అయిందనో, ఫ్లాప్ అయిందనో అప్పటికప్పుడు కథల ఎంపికలో నా ఆలోచనా విధానం మారదు.
అయితే నేనెప్పుడూ భిన్నంగా చిత్రాలు చేయాలనుకుంటా. ఎందుకంటే నాకిది ప్రయోగాలు చేసే సమయం. అందుకు తగ్గట్టే కథలను ఎంపిక చేసుకుంటున్నా. నా వద్దకు వస్తున్న కథలు, పాత్రలు నా ఊహలకు, కలలకు మించిన విధంగా ఉంటున్నాయి. అలాంటప్పుడు మళ్లీ కథల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఆ ప్రయాణాన్ని బాగా ఆస్వాదించాలనే దానిపైనే దృష్టిపెడితే సరిపోతుంది’’ అన్నారు. కాగా కీర్తీ సురేశ్ ప్రస్తుతం ‘సైరెన్ , రఘు తాత, రివాల్వర్ రీటా’ చిత్రాలు, ‘అక్క’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment