![Mrunal Thakur says she lost films as parents did not approve of intimate scenes](https://www.sakshi.com/styles/webp/s3/filefield_paths/mrunal.jpg1_.jpg.webp?itok=mndUBfVh)
‘కథకి, పాత్రకి అవసరమైతే గ్లామర్ సన్నివేశాల్లో, ముద్దు సీన్స్‌లో నటించేందుకు సిద్ధం’ అనే మాటని ఎక్కువశాతం హీరోయిన్లు అంటుంటారు. అయితే అలాంటి సన్నివేశాలకు నో అనే కథానాయికలూ లేకపోలేదు. హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కూడా గ్లామర్ సన్నివేశాలు, ముద్దు సీన్స్‌లో నటించేందుకు నో చెబుతాను అంటున్నారు.
‘సీతా రామం’(2022) సినిమాతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు ఈ మరాఠీ బ్యూటీ. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు మృణాళ్. ఆ తర్వాత తెలుగులో నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్నారామె.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ–‘‘ఇంటెన్స్ కిస్సింగ్ సీన్స్, బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించడం నాకు ఇష్టం ఉండదు. పైగా నేను అలాంటి సీన్స్‌లో యాక్ట్ చేసేందుకు నా తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. అందుకే మొహ మాటం లేకుండా నో చెబుతాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment