ఇచ్చిన హామీలు అమలు చేయడం ఆయనకే చెల్లు
జగన్‌లోని పట్టుదల ఎందరికో స్ఫూర్తిదాయకం
సాక్షి ఇంటర్వ్యూలో సినీనటి, యాంకర్ శ్యామల
‘వైఎస్సార్‌సీపీ నవరత్నాలు అమలు సాధ్యమేనా అన్న నోళ్లు మూతపడేలా అమలు చేసి చూపించారు సీఎం జగన్. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్కరికీ ఓ లెసన్. ‘జగన్ గెలుపు అంటే జనం గెలుపు’ అన్నది ఈ ఎన్నికల్లో స్పష్టం కానుంది’ అని సినీనటి, ప్రముఖ బుల్లితెర యాంకర్ శ్యామల అన్నారు. కొంత కాలంగా వైఎస్ జగన్‌కు మద్దతుదారుగా ఉన్న ఆమె ఈ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ తరఫున చురుకుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. జగన్‌పై తనకు అభిమానం కలగడానికి కారణాలను... తన భవిష్యత్తు రాజకీయ ప్రయాణాన్ని ఆమె తెలియజేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
వైఎస్ అంటే ఇష్టం.. జగన్‌పై అభిమానం...
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం సమీపంలోని ఇంద్రపాలెం మాది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నాకు రాజకీయ నేపథ్యం ఏమీ లేదు. ఎదుగుతున్న సమయంలో లీడర్స్ చేపట్టే పనులు మన మీద చాలా ప్రభావం చూపుతాయి కదా. అలా తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేసినప్పటి నుంచీ వైఎస్ అంటే నాకు చాలా ఇష్టం. కట్టు బొట్టు నుంచి ఆయన ఆహార్యం దాకా అన్నీ గమనిస్తుండేదాన్ని. ఆయన హుందాతనం, మందహాసం బాగా నచ్చేవి. కెరీర్ కోసం హైదరాబాద్ వచ్చేసిన తర్వాత.. వైఎస్సార్ మరణించిన సమయంలో ఉప్పల్‌లో ఓ ప్రైవేట్ చానల్‌లో పనిచేస్తున్నాను. ఎంతగానో బాధనిపించినా... ఆ సమయంలో ఎటూ కదలడానికి వీలు కాలేదు. వైఎస్ మరణం తర్వాత జగన్‌ను బాగా గమనిస్తూ ఉండేదాన్ని, ఆయన చేసిన పోరాటం, అడ్డంకులు ఎదుర్కొంటూ ఆయన వేసిన అడుగులు చూశాక ఆయనపైనా కొండంత అభిమానం కలిగింది. నా భర్త కూడా జగన్ అభిమాని కావడంతో... ఆయన్ను స్వయంగా కలవడం, ఆయన చేతుల మీదుగా వైఎస్సార్‌సీపీ కండువా ధరించడం జరిగిపోయాయి.
హామీల ఆమల్లో ఆయనకు ఆయనే సాటి
ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలి? ప్రజలకు ఆపద వస్తే ఎలా స్పందించాలి? ఇలాంటివన్నీ జగన్‌ను చూసి నేర్చుకోవాలి. అందుకే భవిష్యత్తు రాజకీయ నేతలకు ఆయన పాలన ఒక పాఠం అంటాను నేను. ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి మొదట్లో విని... బాబోయ్ ఇన్ని పథకాలా? ఎలా ఇస్తారో అని భయపడిన మాట నిజం. కాని అవి పక్కాగా అందించడానికి గ్రామ వలంటీర్ పేరిట ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది కలిగిందీ అంటే ఫిర్యాదు చేసిన 10–20 రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారం అయిపోయేలా పక్కాగా నిర్వహించడం అద్భుతం అనిపించింది.
కోవిడ్ సవాల్‌నూసమర్థంగా ఎదుర్కొని...
ప్రపంచమే బిత్తరపోయిన సంక్షోభం కోవిడ్. మహామహులే ఆ సమయంలో చేతులెత్తేశారు. అలాంటిది ఒక కొత్త సీఎం, అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఇలాంటి తరుణంలో అనూహ్యమైన ఈ చాలెంజ్ ఎదురైనా.. జగన్ అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా రెండు వేవ్స్‌నూ సమర్థంగా ఎదుర్కొన్నా రు. అందుకే నేను ఫిదా అయ్యా. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లోని ప్రజల్ని కలిసినప్పుడు వారు చెబుతున్నదీ అదే. ‘కోవిడ్ టైమ్‌లో సొంత వారు కూడా మా మొహం చూడలేదమ్మా.. అలాంటిది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతీదీ మా చేతికి అందించింది’ అని.
జగన్ గురించి తెలుసుకున్న కొద్దీ సంతోషం
మా సొంత ఊరితో పాటు మా అత్తగారి ఊరు చీరాలకు రాకపోకలు సాగించినప్పుడు, షూటింగ్ కోసం గ్రామాలకు వెళ్లినప్పుడు... అక్కడి స్థితిగతుల గురించి కనుక్కునేదాన్ని. వీలైనంతమందితో మాట్లాడేదాన్ని. వాళ్లందరి స్పందన తెలుసుకుంటున్న కొద్దీ జగన్ మీద ఇష్టం పెరుగుతూ వచి్చంది. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన నాడు నేడు కార్యక్రమం నా ఆల్‌ౖ టెమ్ ఫేవరెట్. నేను కాకినాడ ప్రభుత్వ పాఠశాలలో చదువు కున్నా. ఆ స్కూల్లో 7వ తరగతి వరకూ అసలు ఇంగ్లిష్ మీడియం ఉండేది కాదు. ఇప్పుడు ఏకంగా డిజిటల్ బోధన, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్స్, షూస్, సాక్స్... ఇవన్నీ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇటీవల ఒక ప్రభుత్వ పాఠశాల విద్యారి్థని జగన్ ముందు అద్భుతమైన ఇంగ్లిష్ లో మాట్లాడితే షాక్ అయిపోయా. ఆ భాషా పరిజ్ఞానం నాకు కూడా లేదు. కేవలం రాజకీయాల కోసం ఓ పాపను దారుణంగా ట్రోల్ చేయడం దారుణం.
అవకాశాలు పోతాయని వారించినా...
అయితే నేను ఇంకా సినీ–టీవీ కెరీర్ ప్రారంభంలోనే ఉండడంతో పార్టీ మనిషిగా ముద్ర వేసుకోవడం మంచిది కాదంటూ చాలా మంది హెచ్చరించారు. నిజానికి ఇప్పటికీ చాలా మంది అలాగే చెబుతుంటారు. అయితే ఏదో రాజకీయ పారీ్టలో ఉన్నానని ఒక క్యారెక్టర్‌కి నేను సరిపోతానని తెలిసినా పిలవకుండా ఉంటారా? అలా జరగదని నా నమ్మకం. ఇప్పటివరకూ అలాంటి అనుభవాలు కూడా ఎదురవ్వలేదు. నేను కేవలం టీవీ యాంకర్‌గానే కాకుండా మాచర్ల నియోజకవర్గం, బెంగాల్ టైగర్... తదితర సినిమాల్లో మంచి పాత్రల్లో చేశాను.
Comments
Please login to add a commentAdd a comment