బిగ్‌బాస్ సీజన్-7 రియాలిటీ షో గ్రాండ్‌గా ముగిసింది. ఈ సీజన్‌లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ వినర్‌గా అవతరించాడు. టాప్-2లో ఉన్న అమర్‌దీప్, ప్రశాంత్ నిలవగా.. చివరికీ రైతుబిడ్డనే ట్రోఫీని సాధించాడు. అయితే అంతకుముందు టాప్-3 కంటెస్టెంట్, యావర్-4 స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే యావర్ రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని ఎలిమినేట్ అయ్యారు. అయితే షో ముగిసిన తర్వాత బయటకొచ్చిన యావర్ ఇంటర్వ్యూలో యాంకరప్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. అవేంటో తెలుసుకుందాం.
(ఇది చదవండి: రైతుబిడ్డకు గింత విలువిస్తలేరు.. పోలీసులపై ప్రశాంత్ అసహనం)
యావర్ మాట్లాడుతూ..' నేను నా ఫ్యామిలీ కోసమే రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని వచ్చేశా. టైటిల్ గెలవడమనేది పెద్ద విషయం కాదు. హౌస్‌లో మోస్ట్ కన్నింగ్ పర్సన్ శోభా అని.. మాస్క్ వేసుకుని ఉన్న వ్యక్తి అమర్‌దీప్. సింపతీ కోరుకునేది అశ్విని.. డబుల్ యాక్షన్ గౌతమ్.' అంటూ సమాధానలిచ్చాడు యావర్. అంతే కాకుండా నాకు తెలుగు రాదు అన్నమాటను నీకు అనుకూలంగా మార్చుకున్నావా? అని యాంకర్ ప్రశ్నించగా.. గట్టిగా నవ్వేశాడు యావర్. ఇదంతా ఉల్టా పుల్టా అంటూ తనదైన శైలిలో ఆన్సరిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment