ఓ కెమికల్ కంపెనీ నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూకు పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరైన కావటంతో తొక్కిసలాట లాంటి గందరగోళ పరిస్థితి చోటుచేసుకుంది. దీనికి సంబంధిచిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. గుజరాత్‌లోని భారుచ్ జిల్లాలో ఓ ప్రైవేట కెమికల్ కంపెనీ గురువారం 42 పోస్ట్‌లకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించింది.
5 పోస్టులకు వెయ్యి మంది చొప్పున భారీగా అభ్యర్థులు ఇంటర్వ్యూ నిర్వహించే అంకలేశ్వర్‌లో ఉన్న హోటల్‌కు తరలివచ్చారు. రెజ్యూమ్‌లు చేతపట్టుకొని పెద్ద ఎత్తున అభ్యర్థులు లైన్‌లో నిలబడటంతో హోటల్ రేయిలింగ్ ఒక్కసారిగా విరిగిపోయింది.
Over Hundreds of Youths with BE Chemical Degree in Bharuch District of Gujarat crowd for Interview at a Hotel for Forty Job Vacancies in a Private Firm. Such is the State of Unemployment in India.#GujaratModel pic.twitter.com/es8vvMSrmb
— Aniketh Brian 🇮🇳 (@aniketh_brian) July 11, 2024
అభ్యర్థుల తీవ్రమైన గందరగోళంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. భారీ అభ్యర్థులతో హోటల్ ప్రాంగణంలో ఒక్కసారిగా ఆందోళనకరమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఈ కంపెనీలో షిఫ్ట్ ఇన్‌చార్జ్, ప్లాంట్ ఆపరేటర్,సూపర్‌వైజర్, మెకానికల్ ఫిట్టర్, ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాల కోసం కెమికల్ ఇంజనీరింగ్ బీఈ, ఐటీఐ చదవినవారు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment