Walk in interviews
-
భారీగా అభ్యర్థులు.. తొక్కిసలాట దిశగా ఇంటర్వ్యూ!
ఓ కెమికల్ కంపెనీ నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూకు పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరైన కావటంతో తొక్కిసలాట లాంటి గందరగోళ పరిస్థితి చోటుచేసుకుంది. దీనికి సంబంధిచిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. గుజరాత్‌లోని భారుచ్ జిల్లాలో ఓ ప్రైవేట కెమికల్ కంపెనీ గురువారం 42 పోస్ట్‌లకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించింది. 5 పోస్టులకు వెయ్యి మంది చొప్పున భారీగా అభ్యర్థులు ఇంటర్వ్యూ నిర్వహించే అంకలేశ్వర్‌లో ఉన్న హోటల్‌కు తరలివచ్చారు. రెజ్యూమ్‌లు చేతపట్టుకొని పెద్ద ఎత్తున అభ్యర్థులు లైన్లో నిలబడటంతో హోటల్ రేయిలింగ్ ఒక్కసారిగా విరిగిపోయింది.Over Hundreds of Youths with BE Chemical Degree in Bharuch District of Gujarat crowd for Interview at a Hotel for Forty Job Vacancies in a Private Firm. Such is the State of Unemployment in India.#GujaratModel pic.twitter.com/es8vvMSrmb— Aniketh Brian 🇮🇳 (@aniketh_brian) July 11, 2024 అభ్యర్థుల తీవ్రమైన గందరగోళంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. భారీ అభ్యర్థులతో హోటల్ ప్రాంగణంలో ఒక్కసారిగా ఆందోళనకరమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఈ కంపెనీలో షిఫ్ట్ ఇన్చార్జ్, ప్లాంట్ ఆపరేటర్,సూపర్వైజర్, మెకానికల్ ఫిట్టర్, ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాల కోసం కెమికల్ ఇంజనీరింగ్ బీఈ, ఐటీఐ చదవినవారు హాజరయ్యారు. -
ఐటీ జాబ్ ఇంటర్వ్యూ మరి.. కుప్పలు కుప్పలుగా వచ్చారు! వీడియో వైరల్
Wipro Walk In Interview kolkata: ఐటీ పరిశ్రమలో కొన్ని నెలులుగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దిగ్గజ సంస్థలతోపాటు స్టార్టప్ సంస్థలు సైతం లేఆఫ్‌లు అమలు చేస్తున్నాయి. దీంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. వారంతా మరో జాబ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌తోపాటు ఎక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు జరిగినా క్యూ కడుతున్నారు. తాజాగా కోల్‌కతాలో విప్రో కంపెనీ నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు ఉద్యోగార్థులు కుప్పలు కుప్పలుగా తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఈ వీడియోలో ఉన్న వారంతా కోల్‌కతాలోని విప్రో క్యాంపస్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూల కోసం వచ్చారు. ఉన్నది తక్కువ ఉద్యోగాలే అయినా పదివేల మందికి పైగా తరలివచ్చారు. దేశంలో జాబ్ మార్కెట్ పరిస్థితికి ఇది నిదర్శనం’ అంటూ ఓ యూజర్ ఎక్స్ (ట్వటర్)లో వీడియో షేర్ చేశాడు. ఇదీ చదవండి: Safe IT Jobs: ఎన్ని ఉద్యోగాలు ఊడినా.. ఈ ఐటీ జాబ్‌లు మాత్రం సేఫ్! విప్రో దేశంలోని పలు నగరాల్లోని కార్యాలయాల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కోల్‌కతా క్యాంపస్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూలకు ఉద్యోగార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా దీనికి సంబంధించిన వీడియోను ఆగస్ట్ 8న ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేయగా ఇప్పటివరకూ 2.35 లక్షల మందికిపైగా వీక్షించారు. ఈ వీడియోపై పలువురు యూజర్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేశారు. Outside Wipro's Kolkata office during walkin. 10000+ applicants for some jobs! Job market isint that easy it seems. Your view? pic.twitter.com/BGm1TKfsOv — Abhishek Kar (@Abhishekkar_) August 8, 2023 -
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ
-
ట్రెండ్ మారింది, గుడ్‌వర్కర్ నుంచి డిజిటల్ వాకిన్ ఇంటర్వ్యూ ప్లాట్‌ఫాం
న్యూఢిల్లీ: కార్మికులు మొదలుకుని ఉన్నతోద్యోగుల వరకు వివిధ రకాల ఉద్యోగుల నియామకానికి సంబంధించి దేశీయంగా తొలి డిజిటల్ వాకిన్ ఇంటర్వ్యూ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించినట్లు గుడ్‌వర్కర్ సంస్థ వెల్లడించింది. ఓడ బ్ల్యూవీఐ ప్లాట్‌ఫాంతో సాంప్రదాయ ఆఫ్‌లైన్ వాకిన్ అనుభూతిని తమ గుడ్‌వర్కర్ యాప్‌లో ఆన్లైన్ విధానంలో పొందవచ్చని పేర్కొంది. ఇంటర్వ్యూ చేసే వారు, ఉద్యోగార్థులు వ ర్చువల్‌గా ముఖాముఖి భేటీ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని గుడ్‌వర్కర్ తెలిపింది. దీనితో భౌతికంగా ప్రయాణాలు చేయాల్సి న భారం తగ్గుతుందని, రిక్రూట్మెంట్ వ్య వస్థకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది. -
Ap: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 25న హెచ్‌సీఎల్ ‘వాక్ ఇన్ డ్రైవ్’
సాక్షి, అమరావతి: టెక్బీ శిక్షణ కోసం ఏపీ నుంచి ఈ ఏడాది 1,500 మంది ఇంటర్ విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రకటించింది. ఇందుకోసం ఈనెల 25న విజయవాడలో వాక్ ఇన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుబ్బరామన్ తెలిపారు. ఈ వివరాలను గురువారం విజయవాడలో ఆయన మీడియాకు వెల్లడించారు. 2021లో మ్యాథమెటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్‌తో 12వ తరగతి(ఇంటర్మీడియట్) పూర్తి చేసినవారు.. అలాగే 2022లో 12వ తరగతికి హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వాక్ ఇన్ డ్రైవ్‌లో ఎంపికైన విద్యార్థులకు 12 నెలల పాటు శిక్షణ అందించడంతో పాటు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కూడా కల్పిస్తామని చెప్పారు. టెక్బీ శిక్షణ పూర్తి చేసిన వారికి ఏడాదికి రూ.1.70 లక్షల నుంచి రూ.2.20 లక్షల వేతనంతో ఉద్యోగం లభిస్తుందన్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వద్ద పనిచేస్తూనే బిట్స్ పిలానీ, శాస్త్ర, అమిటీ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కూడా పూర్తి చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. అర్హత కలిగిన వారు ఆన్లైన్ కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(హెచ్‌సీఎల్ క్యాట్)కు హాజరవ్వాల్సి ఉంటుందని, ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి రూ.లక్ష ఫీజు ఉంటుందని, దీనికి పన్నులు అదనమని పేర్కొన్నారు. ఫీజును నెలవారీ వాయిదాల్లో తీర్చే విధంగా రుణ సౌకర్యం కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. 2017లో ప్రారంభించిన టెక్బీ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 7,000 మంది విద్యార్థులకు ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. మరింత సమాచారం కోసం www.hcltechbee.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. -
వాక్ ఇన్ ఇంటర్వ్యూలు
⇒ ఎన్సీఈఆర్టీలో 3 జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో (జేపీఎఫ్) పోస్టులకు జూన్ 1 ⇒ మోయిల్ లిమిటెడ్‌లోని మెడికల్ సర్వీసెస్‌లో 4 మేనేజర్ పోస్టులకు జూన్ 1 ⇒ డీఆర్డీఓలో 10 జేఆర్ఎఫ్ పోస్టులకు జూన్ 2 ⇒ ఈసీఐఎల్‌లో 4 జూనియర్ ఆర్టిసన్ పోస్టులకు జూన్ 2 ⇒ ఐసీఏఆర్‌లో 7 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు జూన్ 30