Wipro Walk in Interview Kolkata Thousands People Line Up Viral Video - Sakshi
Sakshi News home page

ఐటీ జాబ్‌ ఇంటర్వ్యూ మరి.. కుప్పలు కుప్పలుగా వచ్చారు! వీడియో వైరల్‌

Published Thu, Aug 10 2023 7:03 PM | Last Updated on Thu, Aug 10 2023 7:20 PM

Wipro Walk In Interview kolkata Thousands Line Up viral video - Sakshi

Wipro Walk In Interview kolkata: ఐటీ పరిశ్రమలో కొన్ని నెలులుగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దిగ్గజ సంస్థలతోపాటు స్టార్టప్‌ సంస్థలు సైతం లేఆఫ్‌లు అమలు చేస్తున్నాయి. దీంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. వారంతా మరో జాబ్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌తోపాటు ఎక్కడ వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు జరిగినా క్యూ కడుతున్నారు. 

తాజాగా కోల్‌కతాలో విప్రో కంపెనీ నిర్వహించిన వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలకు ఉద్యోగార్థులు కుప్పలు కుప్పలుగా తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఈ వీడియోలో ఉన్న వారంతా కోల్‌కతాలోని విప్రో క్యాంపస్‌లో వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూల కోసం వచ్చారు. ఉన్నది తక్కువ ఉద్యోగాలే అయినా పదివేల మందికి పైగా తరలివచ్చారు. దేశంలో జాబ్‌ మార్కెట్‌ పరిస్థితికి ఇది నిదర్శనం’ అంటూ ఓ యూజర్‌ ఎక్స్ (ట్వటర్‌)లో వీడియో షేర్‌ చేశాడు.

ఇదీ చదవండి: Safe IT Jobs: ఎన్ని ఉద్యోగాలు ఊడినా.. ఈ ఐటీ జాబ్‌లు మాత్రం సేఫ్‌! 

విప్రో దేశంలోని పలు నగరాల్లోని కార్యాలయాల్లో వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కోల్‌కతా క్యాంపస్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూలకు  ఉద్యోగార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా దీనికి సంబంధించిన వీడియోను ఆగస్ట్‌ 8న ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్ట్‌ చేయగా ఇప్పటివరకూ 2.35 లక్షల మందికిపైగా వీక్షించారు. ఈ వీడియోపై పలువురు యూజర్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement