ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ 'సత్య నాదెళ్ల' (Satya Nadella) 2014లో సీఈఓ అవుతానని తెలిసినప్పుడు ఎలా అనిపించిందో ఇటీవల బెర్లిన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
2023 యాక్సెల్ స్ప్రింగర్ అవార్డు అందుకున్న సత్య నాదెళ్ల తన కెరీర్ గురించి, నాయకత్వం గురించి చాలా విషయాలను ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మైక్రోసాఫ్ట్‌లో స్టీవ్ బాల్మెర్ కంపెనీ నుంచి బయటకు వెళ్తున్నట్లు తెలుసుకుని షాక్‌కి గురైనట్లు, ఆ తరువాత మైక్రోసాఫ్ట్ బోర్డు సీఈఓ పదవికి ఎంపికైన నలుగురు టాప్ అభ్యర్థుల్లో నాదెళ్ల కూడా ఉన్నట్లు తెలిపాడు.
బోర్డు సభ్యులలో ఒకరు నన్ను మీరు CEO అవ్వాలనుకుంటున్నారా? అని అడిగిన విషయం స్పష్టంగా గుర్తుందని.. నేను ఎప్పుడూ సీఈఓ కావాలనుకునే విషయం గురించి ఆలోచించలేదని, అయితే నా మీద నమ్మకంతో సీఈఓ బాధ్యతలు అప్పగించారని వివరించారు.
ఇదీ చదవండి: ఉద్యోగుల పనిగంటల రిపోర్ట్ - భారత్ ప్రపంచంలోనే..
ఇంజినీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం కలిగిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తి అని బిల్ గేట్స్ ప్రకటించాడు. ఆ తరువాత సత్య నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ ఎన్నో విజయాలను సొంతం చేసుకోగలిగింది.
ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్..
1975లో మైక్రోసాఫ్ట్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీకి నాయకత్వం వహించిన ముగ్గురు వ్యక్తులలో తెలుగు తేజం సత్య నాదెళ్ల ఒకరు కావడం గర్వించదగ్గ విషయం. అంతకు ముందు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్ ఈ కంపెనీ బాధ్యతలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment