ఇంటర్వ్యూలో భర్తతో బిగ్‌బాస్ బ్యూటీ ముద్దులాట.. దారుణమైన ట్రోల్స్! | Bigg Boss Vasanthi Latest Interview Grapes Video | Sakshi
Sakshi News home page

Bigg Boss Vasanthi: దారి తప్పుతున్న యూట్యూబ్ ఇంటర్వ్యూలు.. రోజురోజుకీ అలా!

Published Mon, Feb 19 2024 3:21 PM | Last Updated on Mon, Feb 19 2024 4:38 PM

Bigg Boss Vasanthi Latest Interview Grapes Video - Sakshi

యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూలు రోజురోజుకీ మరింత దారుణంగా తయారవుతున్నాయి. హద్దులు దాటేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ వాసంతి కృష్ణన్‌ ఇంటర్వ్యూకి సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో ఈ డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే మరీ డైరెక్ట్‌గానే భర్తతో ముద్దులాట లాంటిది చేయడం వింతగా అనిపించింది.

(ఇదీ చదవండి: అనుపమ అభిమాని వీడియో.. ఎందుకు ఇలా చేస్తున్నారని ఆవేదన)

బిగ్‌బాస్ 6వ సీజన్‌లో పాల్గొన్న వాసంతి కృష్ణన్.. ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయింది. పవన్ కల్యాణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోనుంది. అయితే వాలంటైన్స్ డే సందర్భంగా ఈ జంటని ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఇంటర్వ్యూ చేశారు. మాట్లాడి వదిలేస్తే పెద్దగా ప్రాబ్లమ్ ఉండేది కాదు కానీ చేతులతో పట్టుకోకుండా ద్రాక్ష పళ్లు తినిపించడం అనే గేమ్ పెట్టారు.

అయితే ఈ గేమ్ చూస్తుంటే లైవ్‌లోనే సరసాలు ఆడినట్లు కనిపించింది. ఇదే ఇంటర్వ్యూలో ఇలానే పలు గేమ్స్ పెట్టారు. తాజాగా వీటికి సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో.. వీళ్లపై ట్రోల్స్ దారుణంగా వస్తున్నాయి. ఇంటర్వ్యూలో ఇలాంటి పనులేంట్రా బాబు అని తిట్లు అందుకుంటున్నారు. యాంకర్ సంగతి అటుంచితే ఇంటర్వ్యూ ఇచ్చే వారైనా కనీసం ఆలోచించరా అని నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు.

(ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement