ఉద్యోగానికి ఎవరైనా అనుభవం ఏంటి? పని చేయడం పట్ల అతని నిబద్దత ఏంటి అనే విషయాలు చూస్తారు. అయితే చైనాకి చెందిన ఒక కంపెనీ ఉద్యోగం కావాలంటే మాంసం ముట్టని, మద్యం సేవించని & స్మోక్ చేయని వారి కోసం వెతుకుతున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
షెంజెన్‌లోని ఓ సంస్థకు చెందిన హెచ్‌ఆర్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగితో జరిపిన సంభాషణ గురించి ఓ అభ్యర్థి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెలకు 5,000 యువాన్స్ జీతం (రూ. 57,000) అందిస్తామని, అంతే కాకుండా ఉచిత వసతి కూడా అందించనున్నట్లు వెల్లడించారు. అయితే అభ్యర్థులు స్మోక్, డ్రింక్, మాంసం తినకూడదని పేర్కొంది. కంపెనీ చేసిన ఈ అసాధారణ డిమాండ్లు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి.
(ఇదీ చదవండి: ఇషా అంబానీ నివాస భవనం ఎన్ని కొట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!)
దీనిపై అభ్యర్థి ప్రశించగా ఇది ఎవరి హక్కులను ఉల్లంఘించడానికి మాత్రం కాదని, కేవలం కంపెనీ కార్పొరేట్ సంస్కృతి కోసం వీటిని అమలు చేస్తున్నట్లు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి వెల్లడించారు. అయితే ఈ ఉద్యోగం తనకు అవసరం లేదని ఆ అభ్యర్థి తిరస్కరించినట్లు తెలిసింది. ఈ విషయం మీద సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment