Private jobs
-
మెరుగైన పెన్షన్ కావాలంటే?
సర్కారు ఉద్యోగం.. ఎంతో మంది నిరుద్యోగుల ఆకాంక్ష. ఆకర్షణీయమైన వేతనం, ఇతర ప్రయోజనాలతోపాటు, రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను వస్తుందన్న భరోసా ఎక్కువ మందిని ఆకర్షించే అంశాలు. కానీ, 2004 నుంచి అమల్లోకి వచి్చన నూతన ఫింఛను విధానంతో రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాలు మారిపోయాయి. దీంతో పాత పింఛను విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి పరిష్కారంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను కేంద్ర సర్కారు తాజాగా తెరపైకి తీసుకొచ్చింది. పదవీ విరమణ చివరి ఏడాది వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా అందించే హామీ ఉంటుంది. మరి ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారి సంగతి ఏంటి? రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను పొందాలంటే అసాధ్యమేమీ కాదు. ఇందుకు చేయాల్సిందల్లా.. ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడమే. ఈపీఎఫ్‌తోపాటు, ఎన్‌పీఎస్‌లోనూ నిర్ణీత శాతం మేర పెట్టుబడి పెట్టడం ద్వారా విశ్రాంత జీవితాన్ని మెరుగ్గా గడిపేందుకు మార్గం ఉంది. ఇందుకు ఏం చేయాలో నిపుణుల విశ్లేషణ చూద్దాం. కేటాయింపులు కీలకం.. ప్రభుత్వరంగ ఉద్యోగుల మాదిరే ప్రైవేటు రంగ ఉద్యోగులూ తమ రిటైర్మెంట్ పెట్టబడులను కొంత మేర ఎన్పీఎస్కు కేటాయించుకోవడం ఇక్కడ కీలకం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వేతనం నుంచి 10 శాతం, వారి తరఫున ప్రభుత్వం నుంచి 14 శాతం చొప్పున ఎన్‌పీఎస్‌లోకి పెట్టుబడిగా వెళుతుంది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. మొత్తం ఎన్పీఎస్ పెట్టుబడుల్లో ఈక్విటీలకు 15 శాతం మించి కేటాయించుకోలేరు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌లో రాబడుల వృద్ధి పరిమితంగానే ఉంటుంది. అంటే 10 శాతంలోపు అని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రైవేటు రంగంలోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ అమలవుతుంది. ఉద్యోగి, యాజమాన్యం చెరో 12 శాతం చొప్పున మూల వేతనం, డీఏపై ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంటాయి. దీనిపై రాబడి 8 శాతం స్థాయిలోనే ఉంది. దీనివల్ల దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ భవిష్యనిధి ఏర్పడుతుందేమో కానీ, రిటైర్మెంట్ అవసరాలను తీర్చే స్థాయిలో కాదు. కనుక ప్రైవేటు రంగ ఉద్యోగులు ఈపీఎఫ్ కాకుండా ఎన్‌పీఎస్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈపీఎఫ్–ఎన్పీఎస్ కలయిక కేంద్ర ఉద్యోగులకు ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)లో అతిపెద్ద ఆకర్షణ.. చివరి వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా పొందడం. కానీ దీర్ఘకాలం పాటు సేవలు అందించిన తర్వాత చివరి వేతనంలో 50% భారీ మొత్తం కాబోదు. ప్రైవేటు రంగంలో పనిచేసే వారు సైతం తమ చివరి వేతనంలో 50 శాతాన్ని ఉద్యోగ విరమణ తర్వాత పొందొచ్చు. ప్రణాళిక మేరకు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఇంతకంటే ఎక్కువే సొంతం చేసుకోవచ్చు. ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లో సమకూరిన నిధితోపాటు, ఈపీఎఫ్‌లో భాగమైన ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కూడిన పెట్టుబడుల ప్రణాళిక ఒకటి. ఉదాహరణకు ఈపీఎఫ్ కింద ఉద్యోగి మూల వేతనం నుంచి 12%, అంతే చొప్పున యాజమాన్యం జమ చేస్తాయి. దీనికితోడు పాత పన్ను విధానంలో కొనసాగే వారు ఎన్పీఎస్ ఖాతా తెరిచి తమ వేతనంలో 10 % మేర యాజమాన్యం ద్వారా జమ చేసుకోవాలి. దీనికి సెక్షన్ 80సీసీడీ(2) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు తమ వేతనంలో 14 శాతాన్ని ఎన్పీఎస్కు జమ చేయించుకోవడం ద్వారా ఆ మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగ జీవితంలో క్రమం తప్పకుండా ఈ పెట్టుబడులు కొనసాగించడం ద్వారా చివరి వేతనంలో 50 శాతాన్ని పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కాని ఇతరులు అందరూ.. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలకు గరిష్టంగా 75% కేటాయింపులు చేసుకోవచ్చు. దీని ద్వారా రిటైర్మెంట్ నాటికి భారీ నిధి సమకూరుతుంది. నెలవారీ ఆదాయం.. ప్రైవేటు ఉద్యోగంలో ఆరంభ మూల వేతనం రూ.14,000తో ప్రారంభమై.. ఏటా 10% చొప్పున పెరుగుతూ వెళితే.. పైన చెప్పుకున్న విధంగా ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లకు 30 ఏళ్ల పాటు చందాలు జమ చేసుకుంటూ వెళ్లినట్టయితే, రిటైర్మెంట్ తర్వాత నెలవారీ రూ.2.9 లక్షలు పొందొచ్చు. చివరి ఏడాదిలో వేతనం రూ.2.44 లక్షల కంటే ఇది ఎక్కువ. రిటైర్మెంట్ నాటికి ఎన్‌పీఎస్‌లో సమకూరిన నిధిలో 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ (పింఛను) తీసుకోవాలి. మిగిలిన 60% ఫండ్‌ను వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, ఈపీఎఫ్‌లో సమకూరిన నిధిని కూడా వెనక్కి తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ/సిప్‌కు విరుద్ధమైనది) ఎంపిక చేసుకోవాలి. తద్వారా ప్రతి నెలా కోరుకున్నంత వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, పనిచేసిన కాలం ఆధారంగా ఈపీఎఫ్‌లో భాగమైన ఎన్పీఎస్ నుంచి నెలవారీ నిరీ్ణత మొత్తం పింఛనుగా అందుతుంది. ఎన్‌పీఎస్‌లో 60% నిధి, ఈపీఎఫ్‌లో భవిష్యనిధి వాటా కింద సమకూరిన మొత్తాన్ని.. రిస్క్, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. కన్జర్వేటివ్ లేదా బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అయితే రిస్్క–రాబడుల సమతుల్యంతో ఉంటాయి. వ్యాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం గడిచిన పదేళ్లలో కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు వార్షిక రాబడి 8.41 శాతంగా ఉంది. బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగంలో రాబడి 9.83% మేర ఉంది. ఈ ఫండ్స్‌లో వార్షిక రాబడి రేటు కంటే తక్కువ మొత్తాన్ని ఏటా ఉపసంహరించుకోవాలి. దీనివల్ల కాలక్రమంలో పెట్టుబడి కూడా కొంత మేర వృద్ధి చెందుతుంది. పెట్టుబడి విలువలో ప్రతి నెలా 0.5% చొప్పున ఎస్‌డబ్ల్యూపీ ద్వారా వెనక్కి తీసుకోవాలి. ఏటా ఈ మొత్తాన్ని 5% (ద్రవ్యో ల్బణం స్థాయిలో) పెంచుకుని ఉపసంహరించుకున్నా సరే.. రిటైర్మెంట్ నిధి ఏటా 10% చొప్పున వృద్ధి చెందితే 25 ఏళ్లలో రూ.2.05 కోట్ల నుంచి రూ.2.9 కోట్లకు చేరుతుంది. రిటైర్మెంట్ ఫండ్ విలువ మరింత పెరగాలంటే, నెలవారీ ఉపసంహరణ రేటు వీలైనంత తక్కువగా ఉండేలా చూడాలి. ఎంత మేర..?ఆరంభ మూల వేతనం రూ.14,000. ఏటా 10% పెరిగేట్టు. ఈపీఎఫ్‌లో నిబంధనల మేరకు ఇన్వెస్ట్ చేస్తూనే, ఎన్‌పీఎస్‌లోనూ పాత పన్ను విధానంలో 10% మొత్తాన్ని యాజమాన్యం ద్వారా డిపాజిట్ చేయించుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. ఈపీఎఫ్ నిధిపై 8% రాబడి రేటు. ఎన్పీఎస్ జమలపై 12% రాబడి రేటు అంచనా. ఎన్పీఎస్ 40% ఫండ్‌తో యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే, దీనిపై 6% రాబడి ప్రకారం ప్రతి నెలా వచ్చే ఆదాయం అంచనాలు ఇవి. ప్రత్యామ్నాయంప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఎలానూ ఉంటుంది. దీనికితోడు ఎన్పీఎస్ జోడించుకోవడం రాబడుల రీత్యా మంచి నిర్ణయం అవుతుంది. రిటైర్మెంట్ నాటికి ఎన్పీఎస్ నిధిలో 60 శాతాన్ని ఎలాంటి పన్ను లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్ నిధిపైనా ఎలాంటి పన్ను లేదు. పన్ను కోణంలో ఈ రెండింటి కంటే మెరుగైనవి లేవు. ఎన్‌పీఎస్‌లో 75 శాతం ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. కానీ, ఎన్పీఎస్ ఫండ్ మేనేజర్లు టాప్–200 కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయగలరు. ఒకవేళ ఇంతకంటే అదనపు రాబడులు ఆశించే వారు ఎన్పీఎస్ బదులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ సమయంలో మొత్తం వెనక్కి తీసుకోకుండా, క్రమానుగతంగా ఉపసంహరణ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల పన్ను భారం చాలా వరకు తగ్గుతుంది. అయితే పదవీ విరమణ తర్వాత నూరు శాతం ఈక్విటీల్లోనే పెట్టుబడులు ఉంచేయడం సరైనది కాదు. కనుక 50% మేర అయినా డెట్ ఫండ్స్‌కు మళ్లించుకోవాలి. కనుక ఈ మొత్తంపై పన్ను భారం పడుతుంది. అయినా సరే యాక్టివ్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా పన్ను భారానికి దీటైన రాబడులు సొంతం చేసుకోవడం సాధ్యమే. ఈ సంక్లిష్టతలు వద్దనుకునే వారికి సులభమైన మార్గం ఎన్పీఎస్. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. పైగా పన్ను భారం లేకుండా ఈక్విటీ నుంచి డెట్‌కు, డెట్ నుంచి ఈక్విటీకి పెట్టుబడుల కేటాయింపులు మార్చుకోవచ్చు. అలాగే, భవిష్యత్తులో ఎన్‌పీఎస్‌లోనూ ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే ఎన్పీఎస్ ద్వారా 50% పెట్టుబడులను ఈక్విటీల్లో, మిగిలినది డెట్‌లో కొనసాగిస్తూ, క్రమానుగతంగా కావాల్సినంత మేర వెనక్కి తీసుకోవచ్చు. గమనిక: కొత్త పన్ను విధానంలో ఉన్న వారు ఎన్పీఎస్కు 14 శాతం మేర వేతనంలో ప్రతి నెలా కేటాయించుకుంటే.. చివర్లో 40 శాతం యాన్యుటీ ప్లాన్‌పై ప్రతి నెలా టేబుల్లో పేర్కొన్న ఆదాయం కంటే 40 శాతం అధికంగా, ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా 10 శాతం మేర అదనంగా పొందొచ్చు. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
కన్నడనాట స్థానిక రగడ!
సాక్షి బెంగళూరు: కర్నాటకలో మరోసారి స్థానిక, స్థానికేతర రగడ రాజుకుంది. రాష్ట్రంలో ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా స్థానికులకే ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమైంది. రాష్ట్రంలోని పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇతర ప్రైవేటు సంస్థలన్నింట్లోనూ కన్నడిగులకు రిజర్వేషన్ కలి్పంచాలని ప్రభుత్వం తీర్మానించింది. ప్రైవేట్ రంగంలో మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 50 శాతం, నాన్ మేనేజ్మెంట్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన ఉద్యోగ బిల్లు–2024కు కేబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే రూ 25 వేల దాకా జరిమానా కూడా విధిస్తారు. అంతేగాక గ్రూప్ సి, డి తరహా చిరుద్యోగాల్లో ప్రైవేట్ కంపెనీలు విధిగా నూటికి నూరు శాతం స్థానికులనే తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు చట్టం చేసేందుకు వీలుగా ఒకట్రెండు రోజుల్లో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. కానీ ఐటీ తదితర పరిశ్రమలు, ప్రైవేటు రంగ సంస్థల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ప్రస్తుతానికి దీనిపై వెనకడుగు వేసింది. బిల్లును పక్కన పెడుతున్నామని, మరింత అధ్యయనం చేస్తామని సీఎం కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఇదీ నేపథ్యం... కర్నాటకవ్యాప్తంగా ప్రైవేటు ఉద్యోగాల్లో ఉత్తరాది వారికే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయంటూ కొన్నాళ్లుగా కర్నాటకలో ఆందోళనలు జరుగుతున్నాయి. స్థానిక వనరులు, మౌలిక వసతులు ఉపయోగించుకుంటున్న ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు అందుకు తగ్గట్టుగా స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉద్యోగాల బిల్లుకు రూపకల్పన చేసింది. 100 % స్థానికులకేనంటూ సిద్ధు పోస్టుబిల్లుకు మంత్రివర్గ ఆమోదం అనంతరం మంగళవారం సీఎం సిద్ధరామయ్య ఎక్స్‌లో పెట్టిన పోస్టు వివాదానికి దారితీసింది. ‘‘మాది కన్నడ ప్రభుత్వం. కన్నడిగుల భద్రత, సంక్షేమానికి పాటుపడటమే మా బాధ్యత. కానీ కన్నడిగులు కన్నడనాడులోనే ఉద్యోగాలు పొందడంలో వెనకబడుతున్నారు. దీన్ని నివారించేందుకు ఈ బిల్లు ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. ఇకపై రాష్ట్రంలో అన్ని ప్రైవేటు రంగ పరిశ్రమలు, కర్మాగారాల్లో గ్రూప్ సి, డి ఉద్యోగాలు వంద శాతం కన్నడిగులకే ఇవ్వాల్సిందే’’ అని పోస్టులో సిద్ధు పేర్కొన్నారు. తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు.తీవ్ర వ్యతిరేకతసిద్ధు సర్కారు నిర్ణయాన్ని కర్ణాటకలోని ప్రైవేటు రంగ సంస్థలు, పరిశ్రమలు ము ఖ్యంగా ఐటీ తదితర కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పారిశ్రామిక దిగ్గజం, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా దీనిపై తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. టెక్ కంపెనీలకు స్థానికత కంటే ప్రతిభే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ బిల్లుతో కంపెనీలు కర్నాటకకు రావాలంటే భయపడే పరిస్థితి తలెత్తుతుందని సాఫ్ట్వేర్ పరిశ్రమల జాతీయ సంఘం నాస్కామ్ విమర్శించింది. దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇది వివక్షా పూరితమైన బిల్లంటూ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ విమర్శించారు. ‘‘ఇది రాజ్యాంగవిరుద్ధం. టెక్ రంగానికి గొడ్డలిపెట్టు వంటి ఈ ఫాసిస్టు బిల్లును వెంటనే వెనక్కు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. అసోచామ్ కర్నాటక సహధ్యక్షుడు ఆర్కే మిశ్రా తదితరులు కూడా ఇది దూరదృష్టి లేని బిల్లంటూ తీవ్రంగా తప్పుబట్టారు. విపక్ష బీజేపీ కూడా బిల్లును తీవ్రంగా తప్పుబట్టింది. కర్నాటకలో కన్నడిగుల స్వాభిమానాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కన్నడ నేమ్ప్లేట్లు, కన్నడ ధ్వజం, భాష, సంస్కృతి, పరంపర విషయంలో వెనుకంజ ఉండదు. రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్ కలి్పస్తూ బిల్లు తేవడం అందులో భాగమే– బిల్లును తాత్కాలికంగా పక్కన పెట్టిన అనంతరం కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు -
20వేల జీతం.. జాబ్ కోసం పోటెత్తిన 25వేల మంది నిరుద్యోగులు.. తొక్కిసలాట
ముంబై : ముంబై ఎయిర్ పోర్ట్‌కు నిరుద్యోగులు పోటెత్తారు. 600 ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునేందుకు 25 వేల మంది నిరుద్యోగులు తరలివచ్చారు. దీంతో ముంబై ఎయిర్పోర్ట్ నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది. ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా మంగళవారం నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్ తొక్కిసలాటకు దారితీసింది. ఎయిరిండియాకు మొత్తం 2,200 మంది ఎయిర్ లోడర్లు అవసరం. ప్రస్తుతం 600 మంది ఎయిర్పోర్ట్ లోడర్ల (హ్యాండీమ్యాన్) కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలకు సుమారు 25వేలమందికి కంటే ఎక్కువ మంది హాజరయ్యారు. అయితే అభ్యర్ధుల్ని ఎంపిక, ఫారమ్‌ల ధరఖాస్తు స్వీకరణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. జాబ్ అప్లికేషన్ కోసం అభ్యర్ధులు ఎగబడడంతో వారిని కంట్రోల్ చేయలేకపోయినట్లు సమాచారం. దరఖాస్తుదారులు ఆహారం, నీరు లేకుండా గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని, ఫలితంగా వారిలో చాలా మంది అస్వస్థతకు గురైనట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. జీతం రూ.25వేలుఎయిర్పోర్ట్ లోడర్ల జీతం నెలకు రూ.20,000 నుండి రూ.25,000 వరకు ఉంటుంది.అయితే చాలా మంది ఓవర్‌టైమ్ అలవెన్సుల తర్వాత రూ. 30,000 కంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. ఇక ఈ ఉద్యోగం పొందాలంటే కనీస అర్హతలు తప్పని సరి. శారీరకంగా బలంగా ఉంటే సరిపోతుంది.500 కిలోమీటర్ల దూరం నుంచి ఇక 25వేల మంది అభ్యర్ధుల్లో ఒకరైన బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్న ప్రథమేశ్వర్ ఈ ఇంటర్వ్యూ కోసం 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుల్దానా జిల్లాకు నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ప్రథమేశ్వర్ మాట్లాడుతూ.. నేను ఎయిర్పోర్ట్ లోడర్ జాబ్‌కు అప్లయ్ చేయడానికి వచ్చాను. ఈ ఉద్యోగానికి రూ.22,500 మాత్రమే ఇస్తారంట అని నిట్టూర్చాడు.ఈ ఉద్యోగం వస్తే చదువు మానేస్తారా అని ప్రశ్నించగా.. ‘ఏం చేస్తాం.. ఇంత నిరుద్యోగం ఉంది.. మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని బదులిచ్చారు. ప్రస్తుతం నిరుద్యోగులతో కిక్కిరిసిపోయిన ముంబై ఎయిర్ పోర్ట్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
స్టార్టింగ్ శాలరీ రూ.25,500.. జాబ్ కోసం అప్లయ్ చేసుకుంది 10లక్షల మంది!
కోవిడ్ -19, ఆర్ధిక మాంద్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా కొత్త టెక్నాలజీ పోకడలతో జాబ్ మార్కెట్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఉద్యోగ అవకాశాల కోసం అన్వేషిస్తున్న అభ్యర్ధులు ఎక్కడ ఏ జాబ్ దొరికినా చేరిపోయిందేందుకు సిద్ధపడుతున్నారు. అందుకు ఉదాహరణే ఈ తాజా ఉదంతం. ప్రారంభ వేతనం రూ.25,500తో ప్రభుత్వ ఉద్యోగానికి విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సుమారు 10 లక్షల మంది అప్లయ్ చేసుకున్నారు. ఇలా జాబ్ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులతో ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్రైవేట్ ఉద్యోగాల్లో సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీపడుతున్నారు. ఇటీవల కోల్‌కతాలో విప్రో నిర్వహించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ ఫైల్స్‌తో ఎగబడుతున్న అభ్యర్ధులు అంటూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొన్ని వీడియోలు ప్రస్తుత ఉద్యోగాల పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇటీవల, మహారాష్ట్ర ప్రభుత్వం 4,600 ‘తలాతి’ పోస్టులకు ఎంబీఏలు, ఇంజినీర్లు, పీహెచ్డీ హోల్డర్లు సహా 10లక్షల మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకున్నారని భూ రికార్డుల శాఖకు చెందిన సీనియర్ అధికారి తెలిపారు. తలాతి అంటే రెవెన్యూ శాఖ అధికారి. అతని పని భూమి రెవెన్యూ డిమాండ్, సేకరణ, హక్కుల రికార్డులు, ప్రభుత్వం సూచించిన గ్రామ ఫారాలకు సంబంధించిన గ్రామ ఖాతాలను నిర్వహించడం, పంటలు, సరిహద్దు గుర్తులను తనిఖీ చేయడం, వ్యవసాయ గణాంకాలను తయారు చేయడం వంటి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నెల వారి ప్రారంభ వేతనం రూ.25,500-రూ.81,100 మధ్య వరకు ఉంటుంది. క్లాస్ సీ గ్రేడ్ ఉద్యోగులు 4,600 పోస్ట్‌లకు 10లక్షలమందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు రాష్ట్ర పరీక్షల సమన్వయకర్త, భూరికార్డుల అదనపు సంచాలకులు ఆనంద్ రాయతే తెలిపారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోని వివిధ కేంద్రాల్లో ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుందని అన్నారు. ఇక ఈ జాబ్ కోసం అప్లయ్ చేసుకున్న వారిలో ఎంబీఏ, పీహెచ్డీ, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, ఇంజినీరింగ్ అర్హతలు ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయని రాయతే వెల్లడించారు. అయితే, జాబ్‌తో సంబందం లేకుండా వేలాది ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలకు లక్షల మంది పోటీపడడంతో ఏఐ టూల్స్ పూర్తి స్థాయి వినియోగంతో భవిష్యత్‌లో అసలు ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇదీ చదవండి : రిలయన్స్‌కు 1.67 లక్షల మంది ఉద్యోగుల రాజీనామా.. కారణం అదే -
హవ్వ.. జాబ్ కావాలంటే అవేవీ వద్దంట.. నెటిజన్లు ఫైర్!
ఉద్యోగానికి ఎవరైనా అనుభవం ఏంటి? పని చేయడం పట్ల అతని నిబద్దత ఏంటి అనే విషయాలు చూస్తారు. అయితే చైనాకి చెందిన ఒక కంపెనీ ఉద్యోగం కావాలంటే మాంసం ముట్టని, మద్యం సేవించని & స్మోక్ చేయని వారి కోసం వెతుకుతున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షెంజెన్‌లోని ఓ సంస్థకు చెందిన హెచ్ఆర్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగితో జరిపిన సంభాషణ గురించి ఓ అభ్యర్థి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెలకు 5,000 యువాన్స్ జీతం (రూ. 57,000) అందిస్తామని, అంతే కాకుండా ఉచిత వసతి కూడా అందించనున్నట్లు వెల్లడించారు. అయితే అభ్యర్థులు స్మోక్, డ్రింక్, మాంసం తినకూడదని పేర్కొంది. కంపెనీ చేసిన ఈ అసాధారణ డిమాండ్లు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి. (ఇదీ చదవండి: ఇషా అంబానీ నివాస భవనం ఎన్ని కొట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!) దీనిపై అభ్యర్థి ప్రశించగా ఇది ఎవరి హక్కులను ఉల్లంఘించడానికి మాత్రం కాదని, కేవలం కంపెనీ కార్పొరేట్ సంస్కృతి కోసం వీటిని అమలు చేస్తున్నట్లు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి వెల్లడించారు. అయితే ఈ ఉద్యోగం తనకు అవసరం లేదని ఆ అభ్యర్థి తిరస్కరించినట్లు తెలిసింది. ఈ విషయం మీద సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. -
కళ్లముందున్న వివక్ష కనబడదా?
ఉద్యోగార్థుల కులం గురించి తెలిసేదాకా ప్రయత్నం చేసే అలవాటు కంపెనీలకు ఉందని గతంలోనే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ (ఐఐడీఎస్) బయటపెట్టింది. ఇలాంటి అనుభవాలను చాలామంది దళిత, ఆదివాసీలు, కొన్ని వెనుకబడిన కులాల యువతీ యువకులు ఎదుర్కొనే ఉంటారు. ఈ వివక్ష దేశంలో ఇంకా అలాగే ఉందని తాజాగా ఆక్స్‌ఫామ్ నివేదిక కూడా వెల్లడించింది. కులం, మతం, స్త్రీ–పురుషులు – ఇలా రకరకాల వివక్ష కొనసాగుతూనే ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు అత్యంత అవసరమైనవే... ఉపాధి, ఉద్యోగం. కానీ వారికి ఆ రెండూ ఆమడ దూరంలో ఉన్నాయి. కుల వ్యవస్థ ప్రజల జీవితాలను ఇంకా నియంత్రిస్తూనే ఉంది. రమేష్ మెష్రం అనే విద్యార్థి ఉద్యోగం కోసం ఒక కంపెనీకి దరఖాస్తు చేసుకున్నాడు. దానికి కావాల్సిన అర్హతలన్నీ అతడికి ఉన్నాయి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పంపాడు. కానీ పిలుపు రాలేదు. తన పేరును కొంచెం మార్చి, అంటే ఇంటిపేరును సంక్షిప్తీకరించి పంపిస్తే పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు అభ్యర్థుల కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆధిపత్య కులాలైతే సంక్షిప్తంగా మాట్లా డడం, దళితులు, వెనుకబడిన కులాలైతే, వారి కుల వివరాలు తెలి యకపోతే, మీ తండ్రి ఏం చేస్తారు? గ్రామమా? పట్టణమా? ఎటు వంటి జీవనోపాధి ఉండేది?... అట్లా కులం తెలిసేదాకా లాగడం జరుగుతుంటుంది. ఒక వ్యక్తి కులం గురించి తెలిసేదాకా ప్రయత్నం చేసే అలవాటు కంపెనీలకు ఉందని పదిహేనేళ్ళ క్రితమే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్(ఐఐడీఎస్) బయటపెట్టింది. ఉద్యోగం మాత్రమే కాదు, ప్రాథమిక విద్య, వ్యాపారం, ఆరోగ్య అవకాశాలు, ఇట్లా కొన్ని అంశాలపై ఒక సంవత్సరానికిపైగా సర్వే చేసింది ఆ సంస్థ. ఆ సర్వే ఆ రోజుల్లో సంచలనం రేపింది. దానిని 2010 సంవత్సరంలో ‘బ్లాకెడ్ బై కాస్ట్’ పేరుతో పుస్తకంగా కూడా ముద్రించారు. దానికి ఐఐడీఎస్ ఛైర్పర్సన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్ నేతృత్వం వహించారు. ఇటువంటి అనుభవాలను చాలామంది దళిత, ఆదివాసీ, కొన్ని వెనుకబడిన కులాల యువతీ యువకులు ఎదుర్కొనే ఉంటారు. ఈ కులాల్లో అత్యధిక నైపుణ్యం కలిగినవాళ్ళకు కొన్ని ఇబ్బందుల తర్వాతనైనా అవకాశాలు వచ్చి ఉంటాయి. ఆధిపత్య కులాల్లోని మంచివాళ్ళు, లేదా విదేశీ నిపుణులు ఇంటర్వ్యూ చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకనే ప్రశ్న చాలామందికి వచ్చే అవకాశం ఉంది. ‘ఆక్స్‌ఫామ్’ అనే అంతర్జాతీయ అధ్యయన సంస్థ ఇటీవల ‘ఇండియా డిస్క్రిమినేషన్ రిపోర్టు–2020’ పేరుతో ఒక నివే దికను విడుదల చేసింది. ఇందులో కులం, మతం, స్త్రీ–పురుషులు – ఇలా రకరకాల వివక్ష కొనసాగుతోందనీ, ఉద్యోగాలు పొందడంలో, వైద్య సౌకర్యాలు అందుకోవడంలో వివక్ష ఎదురవుతోందనీ ఆ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను నేషనల్ సర్వే ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేల ఆధా రంగా రూపొందించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకూ, మిగతా సమాజానికీ మధ్య నెలవారీ సంపాదనలో తేడా ఉందని గుర్తించారు. ఎస్సీ, ఎస్టీలు నెలకు 10,533 రూపాయలు సంపాదిస్తే, సమాజంలోని మిగతా వ్యక్తులు నెలకు సరాసరిగా 15,878 రూపాయలు పొందు తున్నారని వెల్లడించారు. పురుషులు, మహిళల మధ్య కూడా వేత నాలు, కూలీ విషయంలో వ్యత్యాసం ఉందని తేల్చారు. మగవారు నెలకు 19,779 రూపాయలు సంపాదిస్తే, మహిళలు 15,578 రూపా యలు మాత్రమే పొందుతున్నారు. పట్టణాల్లో ముస్లింలు నెలకు 13,672 రూపాయలు సంపాదిస్తే, ఇత రులు 20,345 రూపాయలు సంపాదిస్తున్నారు. స్వయం ఉపాధిలో మగవారు సరాసరి 15,996 రూపాయల ఆదాయం పొందితే, మహిళలు కేవలం 6,620 రూపా యలు మాత్రమే సంపాదిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిలో ఎస్సీ, ఎస్టీలు 7,337 రూపాయలు పొందితే, ఇతరులు 9,174 రూపాయలు సంపాదిస్తున్నారు. కోవిడ్ అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు రెండు న్నర రెట్లు అధికమైందని ఈ సర్వే తెలుపుతున్నది. 10 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది. పర్మినెంట్ ఉద్యోగాల్లో కోత పడింది. జీత భత్యాల్లో కూడా కోతపడింది. లాక్డౌన్ సమయంలో, ఆ తర్వాత చాలాకాలం సగం జీతాలే లభించాయి. మహిళల్లో కోవిడ్ తీవ్ర ప్రభావాన్ని కలుగజేసింది. స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళల్లో మగవారిలో 9 శాతం మంది దెబ్బతింటే, మహిళలు 70 శాతం మంది నష్టపోయారు. ఆర్థిక వృద్ధిలోనూ, ఆదాయం పెరగడానికి ప్రారంభించే వ్యాపా రాల్లోనూ అప్పు అనేది ముఖ్యం. ఎవరైతే అవసరానికి తగ్గ ఆర్థిక సాయం పొందుతారో వారు ఆర్థిక వనరులను పెంచుకోగలుగు తారు. వేలకోట్లు ఆస్తులు కలిగిన అనేక మంది పారిశ్రామిక వేత్తలు కూడా బ్యాంకుల నుంచి రుణాలు లభించడం వల్లనే తమ కార్యకలాపాలను కొనసాగించగలుగుతున్నారు. ఈ విషయంపై కూడా ఆక్స్‌ఫామ్ తన అధ్యయనాన్ని కొనసాగించింది. ఒక వ్యక్తి లేదా ఇద్దరు ముగ్గురు ఉమ్మడిగా లక్షల కోట్లు బ్యాంకుల నుంచి పొందితే, 120 కోట్ల మంది కేవలం కొన్ని కోట్ల రూపాయలను మాత్రమే అప్పుగా పొంద గలిగారు. ఇందులో వివిధ వర్గాల మధ్యన మరింత వ్యత్యాసం ఉంది. ఎస్సీలు తాము తీసుకున్న రుణాల్లో 34 శాతం వాణిజ్య బ్యాంకులు, 9 శాతం సహకార బ్యాంకుల నుంచి తీసుకున్నట్టు లెక్కలు చెపు తున్నాయి. ఎస్టీలు 31 శాతం వాణిజ్య బ్యాంకులు, 29 శాతం సహకార బ్యాంకుల నుంచి తీసుకున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. ఎస్సీలు అతి తక్కువ బ్యాంకు రుణాలు పొందడానికి ప్రధాన కారణం, దాదాపు 90 శాతం మందికి పైగా దళితులకు నికరమైన వ్యవసాయ భూమి లేదు. ఒకవేళ ఉన్నా అది అరెకరం, ఎకరానికి మించదు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగుల సంఖ్య చాలా తగ్గింది. 96 శాతం ఉద్యోగాలు కేవలం ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. నాలుగుశాతం ఉద్యోగాలు ప్రభుత్వ అధీనంలోని సంస్థల్లో ఉన్నాయి. 2018–19లో నిరుద్యోగుల శాతం ఎస్సీ, ఎస్టీల్లో 9.9 శాతంగా ఉంటే, అది ఇతరుల్లో 7.9 శాతంగా ఉంది. నిజానికి ఉద్యోగాల మీద ఆధారపడేది ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలే. వారి చేతిలో భూమి లేదు. వ్యాపారాల్లేవు. ఆర్థిక వనరులు లేవు. కానీ ఉద్యోగ నియామకాల్లో మాత్రం ఆ వర్గాలు వివక్షను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు మళ్ళీ మొదటి విషయానికి వద్దాం. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు అత్యంత అవస రమైనవే... ఉపాధి, ఉద్యోగం. కానీ వాళ్ళకు ఆ రెండూ ఆమడ దూరంలో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం, దేశంలో ఉన్న అసమానతలు. వీటికి పునాది కుల వ్యవస్థలో ఉంది. ఆధిపత్య కులాల్లోని ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాల్లో ప్రవేశించడానికి ఏ అడ్డంకులూ లేవు. వారిలో కొద్ది శాతం మంది పేదలు ఉండొచ్చు. ఇది ఎట్లా అంటే దళితుల్లో ధనికులు ఉన్నట్టే. ఒక గ్రామానికి సంబంధించిన వివరాలను నేను రెండు రోజుల క్రితం సేకరించాను. ఆ గ్రామంలో ఉన్న ఆధిపత్య కులాలు భూమిని కలిగి ఉన్నాయి. అదే ఆధారంతో ఉద్యోగార్హమైన చదువులు చదివారు. ఈ రోజు వాళ్ళు విదేశాల్లో తమ పిల్లలను చదివించి, ఉద్యోగాల్లో స్థిరపరిచారు. వెనుకబడిన కులాలకు ఆదాయాన్ని పొందే కుల వృత్తులున్నాయి. వాటి ద్వారా బతుకుదెరువుకు ఇబ్బంది లేని జీవితా లను గడుపుతున్నారు. కానీ 25 శాతానికి పైగా ఉన్న ఎస్సీలు మాత్రం రోజు రోజుకీ తమ బతుకు వెళ్ళదీయడానికి పరుగులు పెడుతున్నారు. వారు భద్రత కలిగిన ఉద్యోగాల్లో లేరు. తరతరాలుగా కుల వ్యవస్థ అవలంబించిన వివక్ష ప్రజల జీవితాలను నియంత్రిస్తున్నది. పరిస్థితి ఇట్లా ఉంటే, ఇటీవల కొంతమంది తప్పుడు భావాలను ప్రచారం చేస్తున్నారు. దళితులు కొందరి పట్ల విద్వేషాన్ని రెచ్చగొడు తున్నారని మాట్లాడుతున్నారు. పైన పేర్కొన్న వాస్తవాలు దళితులను రోజురోజుకీ ఇంకా పేదరికంలోకి, అభద్రతలోనికి నెడుతున్నాయి. వేలాది మంది దళితులు ఆధిపత్య కులాల చేతుల్లో హత్యలకు, అత్యా చారాలకు గురయ్యారు. ఎక్కడా కూడా దళితులు తిరిగి అణచివేతకు పూనుకోలేదు. దళితుల మీద నిందలు వేసేవాళ్లు అధ్యయనం చేయడం మంచిది. అంతిమంగా ఈ వివక్షను, హింసను ఎట్లా నివా రించాలో, నిర్మూలించాలో ఆలోచిస్తే మంచిది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
వాడవాడలా జాబ్‌మేళాలు!
మార్చిలోగా 35 వేల మందికి ప్రైవేటు ఉద్యోగాలే లక్ష్యం సాక్షి, హైదరాబాద్: అర్హత కలిగిన గ్రామీణ యువతకు ప్రైవేటు ఉద్యోగాలను కల్పించే నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జాబ్ మేళాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ, మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మార్చిలోగా గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 35 వేల మందికి ఉద్యోగాలను ఇప్పించాలని భావి స్తున్నా రు. ఇందుకుగాను రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఒక మినీ, ప్రతి జిల్లాలో ఒక మెగా జాబ్‌మేళా నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో మినీ మేళా ద్వారా 150 నుంచి 250మందికి, మెగా మేళా ద్వారా కనీసం 250 నుంచి 350 మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యం. వివిధ కోర్సులలో అభ్యర్థులకు శిక్షణ నిమిత్తం 42 ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ (పీఐఏ)లను గ్రామీణాభివృద్ధిశాఖ ఏర్పాటు చేసింది. వాటితో సమన్వయంగా పనిచేసి జాబ్ మేళాల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారు(డీఆర్డీవో)లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం స్పాన్సర్ చేస్తున్న డీడీయూ– జీకేవై పథకం ద్వారా 3 నెలల శిక్షణను ఇప్పిం చనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి అన్ని జిల్లాలోనూ శిక్షణ, జాబ్‌మేళాలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగార్థుల్లో నైపు ణ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఇంగ్లిష్ వర్డ్స్ రెడినెస్ కంప్యూటర్ (ఈడబ్ల్యూఆర్‌సీ) కేంద్రాలను ఏర్పాటు చేయా లని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో 11 కేంద్రాలున్నాయి. -
సుధీర్ కమిటీ సిఫార్సులు అమలుచేయాలి
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సాక్షి, హైదరాబాద్: ముస్లింల సామాజిక, ఆర్థిక పరిస్థితి లో మార్పు తీసుకొచ్చేందుకు సుధీర్ కమిషన్ నివేదికను అమలుచేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ‘సుధీర్ కమిషన్ నివేదిక– ముస్లింల సామాజిక, ఆర్థిక పరిస్థితి’పై సోమవారం హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించారు. స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, సంపాదకుడు జాహెద్‌అలీఖాన్. కోదండరాం మాట్లాడుతూ.. ముస్లింల వెనుకబాటుతనాన్ని సుధీర్ కమిషన్ వెల్లడించిందన్నారు. వారికి 12శాతం రిజర్వే షన్లను అమలుచేయడమే కాకుండా విద్య, వైద్యం, ఉపాధి కల్పన, సామాజిక పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడానికి కమిటీ సూచనలను ఆమోదించాలని డిమాండ్ చేశారు. సదస్సులు, చర్చలతోనే వదిలిపెట్ట కుండా సుధీర్ కమిషన్ నివేదిక అమలు కోసం జిల్లా స్థాయిల్లో పోరాడుతామన్నారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలు, ముస్లింలకు మధ్య పంచాయితీ పెట్టొద్దన్నారు. అసెంబ్లీలో దీన్ని చర్చకు పెట్టి, ఆమోదించాలన్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లోనూ ముస్లింలపట్ల వివక్షత ఉందని యోగేంద్ర ఆరోపించారు. పదేళ్లుగా ప్రభుత్వ ఉద్యో గాల్లో ముస్లింల సంఖ్య తగ్గిందన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలుపై అసెంబ్లీలో ఆమోదిం చడంతో పాటు కేంద్రంపైనా ఒత్తిడి తేవాలన్నారు. సదస్సులో జేఏసీ నేతలు ప్రహ్లాదరావు, గోపాలశర్మ, వెంకటరెడ్డి, బైరి రమేశ్, స్వరాజ్ అభియాన్ నేత ఆదిల్‌అలీ తదితరులు పాల్గొన్నారు. -
రూ.15 లకే కిలో బియ్యం!
ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అతి ముఖ్యమైనది పేదవారికి కిలో బియ్యం కేవలం రూ.1కి అందించడం. ఐతే లక్షలాది మందికి ప్రయోజ నం కలిగిస్తున్న ఈ విశిష్ట పథకం ఏ చిన్న తరగతి ప్రభుత్వ ఉద్యోగికీ వర్తించదు. అలాగే చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారు కూడా ఈ పథకానికి అర్హులు కారు. అయితే వారు కూడా నిత్యం ఆర్థిక ఇబ్బందులతో ఎంతగానో సతమతవుతుంటారు. ఇలా ఉద్యో గాలు చేస్తున్నప్పటికీ సమస్యలతో ఇక్కట్ల పాలవుతున్న వారందరికీ తగు మాత్రంగా సంక్షేమ పథకాలను వర్తింప జేయాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నిరుపేదలకు ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం ఇవ్వడం, ఆ స్థాయికి వెలుపల ఉన్న మిగతా వారు బహిరంగ మార్కెట్లో రూ.40లకు కిలో బియ్యం కొనుక్కోవాల్సి రావడంలో ఏమాత్రం న్యాయం కనపడటం లేదు. ఏ సంక్షేమ పథకాల పరిధిలోకీ రాని వర్గాల ప్రజలకు కూడా సన్నబియ్యం కిలో రూ.10 నుండి రూ.15కు లభ్యమయ్యేట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వారిపై భారం గణనీయంగా తగ్గుతుంది. ఒకవైపు సంక్షే మ పథకాలను అర్హులైన వారికే ఇవ్వడం ఎంతైనా సమంజసమే కానీ.. ప్రస్తుత సమాజ సంక్షోభం నేపథ్యంలో అటూ ఇటూ కాకుండా పోతున్న మధ్యతరగతి వారిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్దమనసుతో ఆదుకో వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. - గర్నెపూడి వెంకటరత్నాకర్రావు విద్యారణ్యపురి, వరంగల్ -
సారుకో షాడో..!
తిమ్మాపూర్ : ఆర్టీఏ కార్యాలయంలో క్లర్క్‌స్థాయి నుంచి డీటీసీ వరకు 28 మంది ఉద్యోగులుండగా, మరో 18 మంది హోంగార్డులున్నారు. వీరుగాకుండా అనధికారికంగా 12 మంది ప్రైవేటు ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. కార్యాలయంలో ఫీజు వసూలు నుంచి ఆన్లైన్ చేసే వరకు ఒరిజినల్ ఉద్యోగులు పని చేస్తుండగా, వాటికి సంబంధించిన రికార్డుల నిర్వహణ, పత్రాల సమర్పణకు ప్రైవేటు ఉద్యోగులు పని చేస్తున్నారు. అట్లాగే వివిధ రకాల లెసైన్సులకు సంబంధించిన దరఖాస్తులపై సంతకాలు చేయడం అసలు ఉద్యోగుల పనైతే, సదరు ఫైళ్లపై ఉన్న కోడ్ల ఆధారంగా బ్రోకర్ల వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేసుకోవడం ప్రైవేటు ఉద్యోగుల పని. ఈ లెక్కన ఏరోజుకు ఆరోజు తమ సారు ఎన్ని ఫైళ్లపై సంతకాలు చేశారో... అన్ని ఫైళ్లకు సంబంధించిన అమ్యామ్యాలను నిక్కచ్చిగా వసూలు చేసి బాస్‌కు అందజేస్తున్నారు. ఆ వెంటనే సదరు సారు తనకు అందిన డబ్బును లెక్క చూసుకుని అందులోంచి 20 శాతం సొమ్మును ప్రైవేటు ఉద్యోగికి అందజేస్తారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల కంట పడకుండా, ఒకవేళ ప్రైవేటు వ్యక్తి పట్టుపడినా తన చేతికి మట్టి అంటకుండా ఉండేందుకే ఆర్టీఏలో ఈ డూప్లికేట్ ఉద్యోగులను నియమించుకున్నారు. దళారీల వద్దకు వెళితేనే లెసైన్సు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసినా ఆర్టీఏ కార్యాలయ సమీపంలో దళారీ వ్యవస్థ యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే దరఖాస్తులు 80 శాతం దళారుల ప్రమేయంతోనే వస్తున్నాయి. లెర్నింగ్ లెసైన్సు నుంచి మొదలుకుని ప్రతీ పనికి దళారులు ఒక రేట్ ఫిక్స్ చేసుకుని వ్యవహారం నడిపిస్తున్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన డబ్బు కంటే ఎక్కువగా దళారులు వసూలు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా దరఖాస్తుదారుడు నేరుగా ఆఫీసుకు వస్తే పత్రాలు సరిగా లేవంటూసాకులు చెబుతూ తిప్పుతుంటారనే విమర్శలున్నాయి. దీంతో విసిగిపోయిన దరఖాస్తుదారులు ఇష్టం లేకపోయినా దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో తిమ్మాపూర్‌లోని ఆర్టీఏ కార్యాలయం వద్ద దాదాపు యాభై మందికి పైగా దళారులున్నట్లు తెలుస్తోంది. వీరంతా తాము పంపే దరఖాస్తులపై కోడ్ మార్కు పెట్టుకుంటారు. సదరు కోడ్ మార్క్‌ను చూసిన అధికారులు వాటిపై ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా సంతకాలు పెట్టేస్తున్నట్లు తెలుస్తోంది. తప్పనిసరి పనులకూ దళారీ తోడు కొన్ని పనులకు సంబంధించి దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఆఫీసుకు రావాల్సి ఉంది. ఆ సమయంలోనూ దళారులు ఆయన పక్కనే ఉండి వ్యవహారం నడిపిస్తున్నారు. లర్నింగ్ లెసైన్సు, పర్మినెంట్ లెసైన్సు, వాహన రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపులు, ఫిట్నెస్, పట్టుబడిన వాహనాల రిలీజ్‌తోపాటు శాఖాపరంగా ఇతర పనులను దళారులు తమకున్న అనుభవంతో చకచకా పనులు పూర్తి చేయిస్తారు. వాహనదారులకే అన్ని పత్రాలు ఇచ్చి వారు నేరుగా ఆఫీసుకు వచ్చేలా చూడాలని ఇటీవల షోరూం డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీటీసీ స్పష్టం చేసినప్పటికీ దానిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కొందరు షోరూం నిర్వాహకులు సైతం వాహన రిజిస్ట్రేషన్ తామే చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేసి ఆ ఫైళ్లను దళారులకు అప్పగిస్తున్నారు. ఆర్టీఏలో ఇంకా పాత పట్టికే... ఆర్టీఏ కార్యాలయంలో అందిస్తున్న సేవలు, వాటి ఫీజుల పట్టికకు, ప్రస్తుతం అధికారులు వసూలు చేస్తున్న చాలా వ్యత్యాసం కన్పిస్తోంది. ఈ విషయాన్ని కొందరు దరఖాస్తుదారులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పటికీ ఆఫీసు వద్ద పాత ఫీజు పట్టికే దర్శనమిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా స్మార్ట్ కార్డులు రావడంతో ఒక్కో కార్డుకు రూ.200 అదనంగా పెరిగినట్లు చెబుతున్నారు. పట్టికలో చూపించిన ఫీజులతో పాటు అదనంగా పోస్టల్ చార్జీలు వసూలు చేస్తుండగా, ఆ మొత్తం ఫీజు చలాన్ రూపంలోనే చూపించి రశీదు ఇస్తున్నారు. కొందరు నేరుగా, మరికొందరు ఏజెంట్ల ద్వారా కార్డులు తీసుకోవడంతో పోస్టల్ ద్వారా వెళ్తున్న కార్డులు తక్కువనే చెప్పొచ్చు. జేబులకు చిల్లు ఇలా... - లెసైన్స్ కోసం వచ్చే దరఖాస్తుదారునికి లెర్నింగ్ సమయంలో గరిష్టంగా రూ.90, పర్మినెంట్ లెసైన్స్ కోసం రూ.440 మాత్రమే ఆఫీసులో ఖర్చు ఉంటుంది. అయితే వీరి వద్ద దళారులు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తుంటారు. - బైక్‌ల రిజిస్ట్రేషన్‌కు రూ.395, కార్లకు రూ.650 ఫీజుంటే రూ.1200 నుంచి 2 వేల వరకు, టాక్సీ కార్లకు పర్మిట్, ఫిట్నెస్, రిజిష్ట్రేషన్‌కు రూ.2250 వరకు ఫీజుండగా, రూ.4వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. - లారీలకు ఫిట్‌నెస్‌కు రూ.1150 ఫీజుంటే రూ.3వేల వరకు, ట్రాక్టర్లకు రూ.550 ఉంటే రూ.వెయ్యి వరకు వసూలు చేస్తుంటారు. - హార్వెస్టర్‌కు రూ.3600 ఫీజుంటే రూ.10వేల వరకు వసూలు చేస్తుంటారు. - దళారులు వసూలు చేసిన మొత్తంలో ఒక్కో పనికి ఒక్కో విధంగా రూ.వంద నుంచి రూ.2వేల వరకు కార్యాలయంలో క్లర్క్ నుంచి మొదలు అధికారి వరకు ముట్టజెప్పుతారని బహిరంగంగానే చర్చ జరుగుతోంది. -
అనవసర రాద్ధాంతం వద్దు
‘ఆసరా’పై ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన అర్హులైన వారందరికీ పింఛన్లు అందజేస్తామని స్పష్టీకరణ 29.11 లక్షల దరఖాస్తుల్లో 24.21 లక్షల లబ్ధిదారులను గుర్తించాం ఇంకా పరిశీలన జరుగుతోంది మూడు గదుల ఇళ్లున్న వారికీ ‘ఆసరా’ అంగన్వాడీ, ఔట్ సోర్సింగ్, చిరుద్యోగుల కుటుంబాలకు కూడా.. నిబంధనల మార్పునకు అంగీకారం సాక్షి, హైదరాబాద్: అర్హులైన పేదలందరికీ ‘ఆసరా’ పథకం కింద పింఛన్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేసి అయోమయం సృష్టించవద్దని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ఎంపీల జోక్యం లేదని.. ధర్మబద్ధంగా అర్హులను ఎంపిక చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆసరా పథకంపై గురువారం శాసనసభలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. గతంలో పింఛన్ లబ్ధిదారులు 29.11లక్షల మంది ఉం డగా.. ఇప్పటి వరకు 24.21 లక్షల మంది అర్హులను గుర్తించినట్లు కేసీఆర్ చెప్పారు. ఈ లెక్కలు అంతిమం కాదని, జిల్లాల్లో దరఖాస్తులపై ఇంకా పరిశీలన జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ అంశంపై శాసనసభ్యులు మరో వారం రోజులు ఓపిక పట్టాలని కోరారు. ఈ ప్రక్రియ పూర్తయి, పూర్తి సమాచారం రాగానే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా జాబితాలను ఎమ్మెల్యేలకు అందజేస్తామని సీఎం ప్రకటించారు. మార్గదర్శకాల్లో మార్పులు పింఛన్లకు ఆదాయాన్నే అర్హతగా తీసుకుంటామని.. గ్రామీణ ప్రాంతాల్లో రూ. లక్షన్నర, పట్టణాల్లో రూ.2లక్షలలోపు ఆదాయమున్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. అంగన్వాడీలు, ఆయాలు, ఔట్ సోర్సింగ్, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారి తల్లిదండ్రులకు, మూడు గదుల ఇళ్లు ఉన్నవారికి కూడా ‘ఆసరా’ అమలయ్యేలా నిబంధనలు మార్చనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తక్షణమే అధికారులకు ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు. పింఛన్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను గురువారం రాత్రే పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా జిల్లా కలెక్టర్లకు పంపుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. పింఛన్ల కోసం క్యూల్లో నిలబడి చనిపోతున్నారంటూ ప్రతిపక్షాలు అనవసర ప్రచారం చేయవద్దం టూ.. ఎండలో నిలుచుంటే చచ్చిపోతారా? అని ప్రశ్నించారు. హెచ్చులు చెప్పొచ్చుగానీ వికారం కాకూడదని ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు. క్యూలో నిలబడి చనిపోతున్నారు: డీకే పింఛన్ దరఖాస్తుల క్యూలో నిలబడి పలువురు ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ సభలో ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఆసరా’ పథకం అమలుపై ఆమె చర్చను ప్రారంభిస్తూ.. కాంగ్రెస్ హయాంలో 32 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేశామని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా ఇప్పటికీ ‘ఆసరా’ పింఛన్లకు దిక్కులేదని పేర్కొన్నారు. పింఛన్ల జాబితాలో తమ పేరు లేదనే ఆవేదనతో వృద్ధులు గుండె పగిలి చనిపోతున్నారన్నారు. పింఛన్ల పంపిణీపై మానవతా కోణంలో ఆలోచించాలని అరుణ ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురం తరహాలో ఇవ్వాలి.. ఏపీలోని అనంతపురం జిల్లాలో పదెకరాల వ్యవసాయ భూమి ఉన్నవారికి సైతం పింఛన్లు ఇస్తున్నారని, తెలంగాణ సైతం అనంతపురం తరహాలో వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా అలాంటి నిబంధనను వర్తింపజేయాలని టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో ఎలాంటి నియంత్రణలు లేకుండా పింఛన్లను రూ. 200కు పెంచి అమలు చేశారని, వికలాంగులకు కూడా రూ. 500 ఇప్పించారని గుర్తు చేశారు. పింఛన్ల పథకాన్ని ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకానికి అనుసంధానం చేయాలని బీజేపీ సభ్యుడు కె.లక్ష్మణ్ సూచించారు. -
జిల్లాకు ట్రైనీగా రావడం పూర్వజన్మ సుకృతం
గుంటూరుసిటీ: చరిత్రాత్మకమైన గుంటూరు జిల్లాకు ట్రైనీ కలెక్టర్‌గా రావడం తన పూర్వ జన్మ సుకృతమని జిల్లా ట్రైనీ కలెక్టర్ లోతేటి శివశంకర్ అన్నారు. 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు ఎంపికైన శివశంకర్ శుక్రవారం జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఆరు నెలలపాటు ఆయన ట్రైనీ కలెక్టరుగా విధులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో ముచ్చటించారు. విజయనగరం జిల్లా ధర్మవరంలో 8వ తరగతి చదివే సమయంలో పాఠశాలకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ను చూసి స్ఫూర్తి పొంది, తానూ కలెక్టర్‌ను కావాలనుకున్నానని లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. లక్ష్య సాధన కోసం రోజుకు 10 గంటలు కష్టపడి చదివినట్టు చెప్పారు. కృషి, పట్టుదల, లక్ష్యం ఉంటే దేనినైనా సాధించవచ్చని అన్నారు. తాను ఐఎఎస్ పరీక్షల్లో మూడుసార్లు ఇంటర్వ్యూలో ఫెయిలయ్యానని, ఐదోసారి అనుకున్న లక్ష్యం సాధించానని చెప్పారు. హైదరాబాద్‌లోని ఏపీ స్టడీ సర్కిల్లో మాక్ ఇంటర్వ్యూలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు.రిటైర్డు ఐఏఎస్ అధికారి చంద్రమౌళి తనకు ఎంతో స్ఫూర్తిని, ధైర్యాన్నిచ్చి ప్రోత్సహించారన్నారు. నేటి యువత డిగ్రీ పూర్తయిన వెంటనే లక్ష్యాలు నిర్ణయించుకుని, నిరంతరం లక్ష్యసాధనకు కృషిచేస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. తన తండ్రి హెల్త్ సూపర్ వైజర్‌గా పనిచేసి రిటైరయ్యారన్నారు. తన తల్లి కృష్ణవేణి, తండ్రి సన్యాసప్పడు తన విజయ సాధనకు ఎంతో కృషి చేశారన్నారు. తాను బీటెక్ అయ్యాక కొంతకాలం ప్రైవేటు ఉద్యోగాలు చేశానని, 2007లో గ్రూప్-2 పాస్ అయి తమ జిల్లాలోనే ఏసీటీవోగా పనిచేశానని చెప్పారు. ఎలాగైనా ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో 2013లో యూపీఎస్సీ పరీక్షలు రాసి 411 వ ర్యాంకు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఏఎస్‌కు ఎంపికైనట్టు వివరించారు. తెలుగు సాహిత్యం, జాగ్రఫీ ప్రధాన సబ్జెక్టులుగా తెలుగు మీడియంలో పరీక్షలు రాసి ఐఏఎస్ సాధించినందుకు తనకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. స్వగ్రామం : విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం ధర్మవరం. తల్లిదండ్రులు : కృష్ణవేణి, సన్యాసప్పడు. భార్య : డోల లక్ష్మి, ఎంపీడీవో, పూసపాటిరేగ మండలం, విజయనగరం జిల్లా విద్యాభ్యాసం : 10వతరగతి వరకు ధర్మవరం జెడ్పీ హైస్కూలు, ఇంటర్మీడియెట్ విశాఖపట్నం వికాస్ జూనియర్ కాలేజీ, బీటెక్ నిట్, సూరత్కల్,కర్నాటక ఉద్యోగాలు : గ్రూప్-2లో ఉత్తీర్ణుడై 2007 నుంచి 2013 వరకు విజయనగరం జిల్లాలో ఏసీటీవోగా విధులు,2013 సివిల్స్‌లో 411వ ర్యాంకు. ఏపీ కేడర్ ఐఏఎస్‌కు ఎంపిక.