మార్చిలోగా 35 వేల మందికి ప్రైవేటు ఉద్యోగాలే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: అర్హత కలిగిన గ్రామీణ యువతకు ప్రైవేటు ఉద్యోగాలను కల్పించే నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జాబ్ మేళాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ, మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మార్చిలోగా గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 35 వేల మందికి ఉద్యోగాలను ఇప్పించాలని భావి స్తున్నా రు. ఇందుకుగాను రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఒక మినీ, ప్రతి జిల్లాలో ఒక మెగా జాబ్‌మేళా నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు.
ఒక్కో మినీ మేళా ద్వారా 150 నుంచి 250మందికి, మెగా మేళా ద్వారా కనీసం 250 నుంచి 350 మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యం. వివిధ కోర్సులలో అభ్యర్థులకు శిక్షణ నిమిత్తం 42 ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ (పీఐఏ)లను గ్రామీణాభివృద్ధిశాఖ ఏర్పాటు చేసింది. వాటితో సమన్వయంగా పనిచేసి జాబ్ మేళాల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారు(డీఆర్‌డీవో)లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం స్పాన్సర్ చేస్తున్న డీడీయూ– జీకేవై పథకం ద్వారా 3 నెలల శిక్షణను ఇప్పిం చనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి అన్ని జిల్లాలోనూ శిక్షణ, జాబ్‌మేళాలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగార్థుల్లో నైపు ణ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఇంగ్లిష్ వర్డ్స్ రెడినెస్ కంప్యూటర్ (ఈడబ్ల్యూఆర్‌సీ) కేంద్రాలను ఏర్పాటు చేయా లని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో 11 కేంద్రాలున్నాయి.
వాడవాడలా జాబ్‌మేళాలు!
Published Mon, Jan 30 2017 1:52 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM
Advertisement
Advertisement