కోవిడ్ -19, ఆర్ధిక మాంద్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా కొత్త టెక్నాలజీ పోకడలతో జాబ్ మార్కెట్‌లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఉద్యోగ అవకాశాల కోసం అన్వేషిస్తున్న అభ్యర్ధులు ఎక్కడ ఏ జాబ్ దొరికినా చేరిపోయిందేందుకు సిద్ధపడుతున్నారు. అందుకు ఉదాహరణే ఈ తాజా ఉదంతం. ప్రారంభ వేతనం రూ.25,500తో ప్రభుత్వ ఉద్యోగానికి విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సుమారు 10 లక్షల మంది అప్లయ్ చేసుకున్నారు.
ఇలా జాబ్ మార్కెట్‌లో నెలకొన్న ఒడిదుడుకులతో ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్రైవేట్ ఉద్యోగాల్లో సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీపడుతున్నారు. ఇటీవల కోల్‌కతాలో విప్రో నిర్వహించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ ఫైల్స్‌తో ఎగబడుతున్న అభ్యర్ధులు అంటూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొన్ని వీడియోలు ప్రస్తుత ఉద్యోగాల పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
ఇటీవల, మహారాష్ట్ర ప్రభుత్వం 4,600 ‘తలాతి’ పోస్టులకు ఎంబీఏలు, ఇంజినీర్లు, పీహెచ్డీ హోల్డర్లు సహా 10లక్షల మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకున్నారని భూ రికార్డుల శాఖకు చెందిన సీనియర్ అధికారి తెలిపారు.
తలాతి అంటే రెవెన్యూ శాఖ అధికారి. అతని పని భూమి రెవెన్యూ డిమాండ్, సేకరణ, హక్కుల రికార్డులు, ప్రభుత్వం సూచించిన గ్రామ ఫారాలకు సంబంధించిన గ్రామ ఖాతాలను నిర్వహించడం, పంటలు, సరిహద్దు గుర్తులను తనిఖీ చేయడం, వ్యవసాయ గణాంకాలను తయారు చేయడం వంటి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నెల వారి ప్రారంభ వేతనం రూ.25,500-రూ.81,100 మధ్య వరకు ఉంటుంది. క్లాస్ సీ గ్రేడ్ ఉద్యోగులు
4,600 పోస్ట్‌లకు 10లక్షలమందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు రాష్ట్ర పరీక్షల సమన్వయకర్త, భూరికార్డుల అదనపు సంచాలకులు ఆనంద్ రాయతే తెలిపారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోని వివిధ కేంద్రాల్లో ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుందని అన్నారు. ఇక ఈ జాబ్ కోసం అప్లయ్ చేసుకున్న వారిలో ఎంబీఏ, పీహెచ్డీ, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, ఇంజినీరింగ్ అర్హతలు ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయని రాయతే వెల్లడించారు.
అయితే, జాబ్‌తో సంబందం లేకుండా వేలాది ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలకు లక్షల మంది పోటీపడడంతో ఏఐ టూల్స్ పూర్తి స్థాయి వినియోగంతో భవిష్యత్‌లో అసలు ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
ఇదీ చదవండి : రిలయన్స్‌కు 1.67 లక్షల మంది ఉద్యోగుల రాజీనామా.. కారణం అదే
Comments
Please login to add a commentAdd a comment