సీఎం జగన్‌లో ఆ ధీమా ఎలా వచ్చిందంటే.? | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌లో ఆ ధీమా ఎలా వచ్చిందంటే.?

Published Thu, May 9 2024 7:20 PM

CM YS Jagan Mohan Reddy Interview With TV9

నాలుగు రోజుల్లో ఎన్నికలు. యావత్తు దేశం ఆసక్తిగా ఆంధ్రప్రదేశ్‌ ఎదురు చూస్తున్న వేళ.. సీఎం జగన్‌ నిన్న టీవీ 9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజనీకాంత్ వెల్లలచెరువుతో మాట్లాడారు. వివిధ విషయాలపై తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా వివరించారు. ఐదేళ్ల తన పాలనలో ప్రజలకు ఏం చేశారన్నదానిపై వివరించిన సీఎం జగన్‌.. తానిచ్చిన మాటకు, చేసిన పనిని పోల్చి చూపించి తనకు ఎంత విశ్వసనీయత ఉందో స్పష్టంగా వివరించారు. Yes, why not 175 అని ధీమా వ్యక్తం చేశారు. వేర్వేరు అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలు.

గెలిచేది వైఎస్సార్‌సిపీనే, తిరిగేదీ ఫ్యానే

  • ఇప్పుడు ఏపీలో జరుగుతున్నవి బై పోలార్ ఎన్నికలు 
  • 99% కుటుంబాల అభివృద్ధిలో జగన్ పాత్ర ఉంది 
  • ఎంతమంది కలిసి పోటీ చేసినా 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన వాళ్లే గెలుస్తారు 
  • ప్రతి పేదింటి అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం 
  • అందుకే వైనాట్‌ 175 అంటున్నాం
  • బీజేపీతో మాకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటాయి 
  • బీజేపీ, టీడీపీ పొత్తులపై వారికే క్లారిటీ లేదు 
  • మోదీ దేశానికి ప్రధాని.. నేను రాష్ట్రానికి సీఎం 
  • ఒక సీఎంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలుస్తాం 
  • బీజేపీ పెట్టిన అన్ని బిల్లులకు మేం మద్దతు ఇవ్వలేదు 
  • రాష్ట్ర ప్రయోజనాల కోసమే కొన్నింటికి మద్దతు ఇచ్చాము 
  • కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెస్తాం 
  • కేంద్రంలో ఎవరున్నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం 
  • అందరితో సత్సంబంధాలు ఉండాలని నేను ఆశిస్తా 
  • నన్ను ఒంటరిగా ఎదుర్కోలేమని భయపడుతున్నారు 

దేశం మొత్తం ఏపీ మోడల్ ఫాలో 

  • మనసుపెట్టి పాలన చేస్తున్నాం
  • కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం
  • కొత్తగా నాలుగు ఓడరేవులు కడుతున్నాం
  • 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం
  • మూడు ఇండస్ట్రీయల్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ గా ఉన్నాం
  • MSMEలపై పెట్టిన దృష్టి ఇంతకుముందెన్నడూ లేదు
  • MSMEలలో అదనంగా 20 లక్షల మందికి ఉపాధి లభించింది
  • స్వయం ఉపాధి ఎంచుకున్న వారు దెబ్బతింటే అభివృద్ధి ఆగుతుంది
  • గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి చేశాం
  • మా పాలనలో లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు

పారిశ్రామికవేత్తలు క్యూ కట్టారు

  • నేను చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోంది
  • చూడాలని లేనప్పుడు అభివృద్ధి కనిపించదు
  • పచ్చకామెర్లు ఉంటే లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది
  • శ్రీకాకుళంలో పోర్టు కడుతున్నాం
  • శ్రీకాకుళం ముంబైలా అభివృద్ధి చెందుతుంది
  • తెలంగాణలో  60శాతం రెవెన్యూ హైదరాబాద్ దే
  • తెలంగాణకు హైదరాబాద్..ఏపికి విశాఖ ఐకాన్ సిటీలు
  • అందుకే ఏపీకి పెట్టుబడులు పోటెత్తాయి

విద్యలో విప్లవాత్మక సంస్కరణలు

  • 3వేల డిజిటల్ లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయి
  • 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన
  • 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ లు ఇచ్చాం
  • అంతర్జాతీయవర్సిటీల కోర్సులు తీసుకొచ్చాం
  • పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలనేది మా తాపత్రయం

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 2 లక్షల 31 వేల ఉద్యోగాలు 

  • చంద్రబాబు హయాంలో 32 వేల ఉద్యోగాలు ఇచ్చారు
  • కానీ మా హయాంలో ఏకంగా 2 లక్షల 31వేల ఉద్యోగాలిచ్చాం
  • వైద్యరంగంలో 54 వేల ఉద్యోగాల భర్తీ జరిగింది

అన్నదాతకు అండగా నిలిచాం

  • రైతు భరోసా సాగు ఖర్చులో 80 శాతం
  • రైతులకు పెట్టుబడి సాయం గతంలో లేదు

విశాఖ నుంచే పరిపాలన

  • అమరావతిలో డెవలప్‌మెంట్ ఎకరాకు రూ.2 కోట్లు అవసరం
  • విశాఖలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏపీలో మరెక్కడా లేవు
  • విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తా
  • పరిపాలన విశాఖ నుంచే జరుగుతుంది
  • ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ అతిపెద్ద సిటీ
  • విశాఖలో అతిపెద్ద సచివాలయం నిర్మిస్తాం
  • అతిపెద్ద కన్వెన్షన్ హాల్, స్టేడియం కడతాం
  • విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం
  • విశాఖకు బూస్టింగ్ ఇస్తే మరింత అభివృద్ధి సాధ్యం
  • అమరావతి అభివృద్ధి చేయాలంటే ఆలస్యం అవుతుంది
  • వీలైనంత త్వరగా విశాఖను హైదరాబాద్, చెన్నై స్ధాయికి తీసుకెళ్లాలి

పారదర్శకంగా సంక్షేమం

  • అర్హులైన వారందరికి సంక్షేమం ఇస్తున్నాం
  • లంచాలు, వివక్ష లేకుండా పథకాలు అందిస్తున్నాం
  • నేరుగా ఖాతాల్లోకి డబ్బు జమచేస్తున్నాం
  • నాణ్యమైన విద్యతో పిల్లల టాలెంట్ పెరుగుతుంది
  • అందుకే అమ్మఒడి ఇస్తున్నాం
  • పిల్లలకు పెట్టే ప్రతిరూపాయి వారి అభివృద్ధికోసమే
  • ఆసరా లేకపోతే కోటి మంది మహిళలు నష్టపోతారు
  • నిలదొక్కుకోవడానికి సాయం చేస్తే వారిని సోమరిపోతులను చేసినట్టు కాదు
  • DBT ద్వారా ఇచ్చేవేవీ ఉచితాలు కావు
  • DBT లకు ఒక ప్రయేజనం ఉంది
  • నాలుగేళ్ల పాటు చేయూత అందించాం

చంద్రబాబు ఇష్టానుసారంగా హామీలు ఇస్తున్నారు

  • నేనుకూడా చంద్రబాబుకంటే ఎక్కువ హామీలు ఇవ్వగలను
  • ఒకే అబద్ధాన్ని వందసార్లు చెబుతున్నారు
  • చేయగలిగేవే మేనిఫెస్టోలో పెట్టాలి
  • ఇష్టానుసారం హామీలు ఇస్తే నిధులు ఎలా వస్తాయి
  • రాష్ట్ర వనరులను దృష్టిలో పెట్టుకుని హామీలు ఇవ్వాలి
  • ప్రజలను మోసం చేయడం నాకు ఇష్టం లేదు
  • రాష్ట్రం శ్రీలంక అవుతుందని మాట్లాడుతున్నారు
  • సూపర్-6, సూపర్-7 అంటూ అడ్డగోలు హామీలు ఇస్తున్నారు
  • రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి
  • చేయగలిగేవే మేనిఫెస్టోలో పెట్టాలి

విశ్వసనీయత నా శ్వాస

  • నా ప్రతి మాటకు విశ్వసనీయత ఉంటుంది
  • నేను చేసేవి విమర్శలే తప్ప... వాళ్లలాగే తిట్టలేను
  • గతంలో కంటే ఎక్కువ కాన్ఫిడెన్స్‌తో ఉన్నా
  • ఇప్పుడు జరుగుతున్నవి బైపోలార్
  • 90 శాతం కుటుంబాల అభివృద్ధిలో జగన్ పాత్ర ఉంది
  • ఎంత మంది కలిసి పోటీ చేసినా 50శాతానికిపైగా ఓట్లు వచ్చిన వాళ్లే గెలుస్తారు
  • ప్రతి పేదింటి అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం
  • మంచినిచూసి ఓటువేయండని చంద్రబాబు అడగలేకపోతున్నారు
  • నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించి ఓట్లు అడుగుతున్నా

పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

  • పవన్ గురించి నేను చాలా తక్కువ మాట్లాడుతా
  • రాజకీయాల్లో రోల్ మోడల్ గా ఉండాలి
  • ఐదేళ్లకోసారి భార్యలను మార్చడం సరికాదు
  • ఒకసారి జరిగితే పొరపాటు.. రెండోసారి జరిగితే గ్రహపాటు
  • మూడు, నాలుగుసార్లు అయితే అలవాటు
  • చంద్రబాబు, దత్తపుత్రుడు రాజకీయ పార్టనర్స్
  • గతంలో టీడీపీ మేనిఫెస్టోలో పవన్ భాగస్వామి
  • చంద్రబాబు చేసిన ప్రతిపాపంలో దత్తపుత్రుడి వాటా ఉంది

బీజేపీ తప్పులను కూడా నేను ప్రశ్నిస్తున్నా

  • ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడటం తప్పు 
  • ప్రతిమతంలో ఓసీలు, బీసీలు ఉంటారు 
  • మతం వేరు.. రిజర్వేషన్లు వేరు
  • ముస్లింలపై చంద్రబాబుకు ప్రేమ ఉంటే ఇంకా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారు
  • ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం ధర్మం
  • ముస్లింలలో వెనకబడిన వారికే రిజర్వేషన్లు ఉన్నాయి
  • రిజర్వేషన్ల విషయంలో కోర్టుకు వెళ్తాం 
  • పార్లమెంటులో కూడా గళమెత్తుతాం 

ప్రత్యేక హోదా వైఎస్సార్‌సీపీ ఎజెండా

  • ప్రత్యేక హోదాను ఎవరు అమ్మేశారు? 
  • హోదాను తాకట్టు పెట్టి చంద్రబాబు ప్యాకేజీ అన్నారు 
  • చంద్రబాబు వల్ల రాష్ట్రం నష్టపోయింది 
  • కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసింది 
  • ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చలేదు 
  • హోదాను చట్టంలో చేర్చకపోవడం అతిపెద్ద అన్యాయం
  • హోదాను చట్టంలో చేర్చి ఉంటే కోర్టుకు వెళ్లి సాధించుకునే అవకాశం ఉండేది 

చంద్రబాబు ట్రాప్‌లో పడితే ఏం చేయగలం?

  • వివేకా కేసును తప్పుదోవ పట్టించారు
  • వివేకాహత్యను కడప సెంట్రిక్ గా మార్చారు 
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నాన్న ఓడిపోవాల్సింది కాదు 
  • అవినాష్ వివరణ కరెక్టేనని ఎవరికైనా అనిపిస్తుంది 
  • తప్పు చేయని వ్యక్తిని తప్పు చేశారనడం ఘోరం 
  • అవినాష్ తప్పు చేయలేదని వీడియోలు చూసిన వారు ఎవరైనా చెబుతారు
  • చెల్లెళ్లకు న్యాయం చేసేందుకు మరొకరికి అన్యాయం చేయడం ధర్మం కాదు 
  • చిన్నాన్న రెండో భార్య గురించి అవినాష్ అడుగుతున్నది లాజికల్ గా కరెక్ట్‌ కాదా?
  • సునీత మాటలు ఎన్నికలపై ప్రభావం చూపవు 
  • ఏం జరిగిందో కడప జిల్లా ప్రజలందరికీ తెలుసు 
  • అవినాష్ ఎలాంటివాడో జిల్లా ప్రజలకు తెలుసు 
  • అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు 

కుటుంబం vs పార్టీ

  • ప్రజా జీవితంలో కొన్ని సవాళ్లు వస్తాయి 
  • 2019లో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ కు రాలేదు 
  • అయినా వైఎస్సార్‌సిపి ఓటు బ్యాంకును చీల్చాలని కాంగ్రెస్‌ పేరిట కుట్ర చేస్తున్నారు 
  • షర్మిల ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు 
  • నాకు ప్రైవేట్ లైఫ్ అంటూ ప్రత్యేకంగా లేదు 
  • పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అంతా ఒక్కటే 
  • దేవుడిపై నమ్మకం, ప్రజలపై విశ్వాసం ఉంది

వందేళ్ల తర్వాత తొలిసారి సర్వే చేశాం

  • భూ రికార్డులు సిద్ధం చేశాం
  • భూమిపై యజమానికి సర్వహక్కులు కల్పించేదే ఈ చట్టం 
  • ఏపీలో 17వేల గ్రామాల్లో రికార్డులు అప్డేట్ చేశాం 
  • టైటిల్స్ లో తప్పులు లేకుండా చూడడం ప్రభుత్వ గ్యారెంటీ 
  • ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో భూములకు ఇన్సూరెన్స్ 
  • గ్రామ సచివాలయాలే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా మార్పు 
  • సచివాలయాల్లో 15 వేల సర్వేయర్లతో కొత్త వ్యవస్థను తీసుకొచ్చాం 
  • ప్రతి గ్రామంలో ఒక సర్వేయర్ ను పెట్టాం 
  • ల్యాండ్ టైటిలింగ్, రిజిస్ట్రేషన్ రెండూ ఒకటి కాదు 
  • అన్ని సర్వేలు పూర్తయ్యాకే యాక్ట్ వస్తుంది 
  • ఈ చట్టం వల్ల ఎవరికీ నష్టం లేదు, పైగా అన్ని రకాల ప్రయోజనాలు

Advertisement

తప్పక చదవండి

Advertisement